స్టేజ్‌పైనే ఏడ్చేసిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్.. ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ సినిమా నచ్చకపోతే అంటూ సవాలు

ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి ఎమోషనల్ అయిపోయాడు. ప్రభాస్ ఎదురుగా మాట్లాడలేక పదే పదే కంటతడి పెట్టాడు. దీంతో రెబల్ స్టార్ స్టేజ్ పైకి వెళ్లి అతన్ని ఓదార్చడం విశేషం.

Published on: Dec 28, 2025, 07:22:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభాస్, మారుతి మధ్య ఎంతటి బలమైన అనుబంధం ఉందో ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్పష్టమైంది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన ఎదురుగా కూర్చొన్నప్పుడు మారుతి మాట్లాడలేక పదే పదే ఏడ్చేశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

స్టేజ్‌పైనే ఏడ్చేసిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్.. ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ సినిమా నచ్చకపోతే అంటూ సవాలు
స్టేజ్‌పైనే ఏడ్చేసిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్.. ఇంటి అడ్రెస్ ఇచ్చి మరీ సినిమా నచ్చకపోతే అంటూ సవాలు

మారుతి ఎమోషనల్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఒక ఎమోషనల్ సంఘటన చోటు చేసుకుంది. సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన వెంటనే ప్రభాస్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?

ఈవెంట్‌లో మైక్ అందుకున్న మారుతి.. గత మూడేళ్లుగా తాను పడుతున్న ఆవేదనను బయటపెట్టాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తనపై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, నెగెటివిటీని తలుచుకుని అతడు ఎమోషనల్ అయ్యాడు.

"ప్రభాస్ గారితో సినిమా అనగానే చాలామంది నన్ను తిట్టారు. ఆయన రేంజ్ ఏంటి? నీ రేంజ్ ఏంటి? అని కామెంట్స్ చేశారు. మూడేళ్లుగా ఈ మాటలన్నీ భరిస్తూ వచ్చాను. కానీ ప్రభాస్ గారు నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపాను" అని చెబుతూ మారుతి గద్గద స్వరంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న నిర్మాత ఎస్‌కేఎన్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసినా మారుతి కంట్రోల్ కాలేకపోయాడు.

ప్రభాస్ రియాక్షన్ ఇలా..

మారుతి తన స్పీచ్ కొనసాగించలేక పదే పదే ఏడుస్తూ ఉన్నాడు. అది గమనించిన ప్రభాస్.. వెంటనే సీట్లో నుంచి లేచి స్టేజ్ మీదకు పరుగెత్తుకెళ్లాడు. మారుతిని గట్టిగా హత్తుకుని, భుజం తట్టి ఓదార్చాడు. "ఇది మూడేళ్ల కష్టం.. ఇప్పుడు బయటకు వస్తోంది" అంటూ మారుతికి ధైర్యం చెప్పాడు. ప్రభాస్ అలా పరుగెత్తుకెళ్లి తన డైరెక్టర్‌కి సపోర్ట్ ఇచ్చిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. గ్రౌండ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.

మారుతి ఓపెన్ ఛాలెంజ్

సినిమా అవుట్‌పుట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని మారుతి చెప్పాడు. "సినిమా చూశాక ఏ ఒక్క అభిమాని అయినా నిరాశ చెందితే.. నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను నిలదీయండి" అంటూ ఏకంగా తన ఇంటి అడ్రస్ (కొండాపూర్‌లోని విల్లా నంబర్ 16) మైక్‌లో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మూడేళ్ల పాటు తన ప్రాణం పెట్టి ఈ సినిమా తీశానని, ప్రభాస్ కు రుణ పడి ఉంటానని, ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదని ప్రభాస్ గురించి, మూవీ గురించి మారుతి తెలిపాడు.

"నా కెరీర్లో ఫ్లాప్స్ ఉన్న టైంలో కూడా ప్రభాస్ గారు కథను మాత్రమే నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే" అని మారుతి కొనియాడాడు.

ఈ సినిమాలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో, వింటేజ్ స్టైల్ ఎంటర్‌టైనర్‌గా చూస్తారని, ఫ్యాన్స్‌కి ఇది పండగలా ఉంటుందని హామీ ఇచ్చాడు. ది రాజా సాబ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే రెండు వారాల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం, దానికి డార్లింగ్ ప్రభాస్ రావడంతో మూవీకి మంచి బూస్టప్ లభించింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More