రాజమౌళి వారణాసి కోసం పురాతన యుద్ధ విద్యలో మహేశ్ బాబు శిక్షణ- సూపర్ స్టార్ శ్రమకు ట్రైనర్ ఫిదా!
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య ‘కలరిపయట్టు’ను మహేశ్ బాబు నేర్చుకుంటున్నారు. అయితే మహేష్ బాబు నేర్చుకుంటున్న మహేష్‌ను చూసి ఆయన ట్రైనర్ ఫిదా అయ్యారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ (Varanasi) ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు చేస్తున్న కష్టం, చూపిస్తున్న అంకితభావం చూస్తుంటే జక్కన్న మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని టాక్ నడుస్తోంది.

కేరళకు చెందిన యుద్ధ కళ
ముఖ్యంగా వారణాసి చిత్రంలో ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్ర కోసం మహేశ్ బాబు కేరళకు చెందిన పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’ (Kalaripayattu) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ కలరిపయట్టు నిపుణుడు హరి కృష్ణన్ తాజాగా మహేష్ బాబుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అనుభవాన్ని వివరించారు.
మహేష్ అంకితభావానికి ట్రైనర్ ఫిదా!
"భారతీయ సినిమా గ్లోబల్ స్టార్‌కు కలరిపయట్టులో శిక్షణ ఇస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. మహేశ్ బాబు గారి క్రమశిక్షణ, ఆయన జీవనశైలి, అతిథి మర్యాదలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి" అని హరి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ అరుదైన అవకాశం కల్పించినందుకు నటుడు నాజర్, దర్శకుడు రాజమౌళికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏమిటీ కలరిపయట్టు?
కేరళ నుంచి ఉద్భవించిన ‘కలరిపయట్టు’ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, శక్తివంతమైన యుద్ధ విద్యలలో ఒకటి. ఇందులో శారీరక శిక్షణతో పాటు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కూడా ఉంటుంది. జంతువుల భంగిమలు, చురుకైన కదలికలు, కత్తులు, కర్రల వంటి సాంప్రదాయ ఆయుధాల వాడకం ఇందులో ప్రధానంగా ఉంటుంది.
ఇదివరకు కాంతార చాప్టర్ 1లో
గతంలో ‘కాంతార: చాప్టర్ 1’ వంటి సినిమాల్లో కూడా ఈ విద్యను మనం చూశాం. ఇప్పుడు ‘వారణాసి’లో మహేష్ బాబు ఈ విద్యతో చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జేమ్స్ కామెరూన్ సైతం ఫిదా!
కాగా, ఇటీవల రాజమౌళి విజన్‌కు హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరాన్ కూడా ముగ్ధుడయిన విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన ఒక చర్చలో కామెరూన్ మాట్లాడుతూ.. ‘వారణాసి’ సెట్స్‌ను సందర్శిస్తానని, కుదిరితే సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కొన్ని షాట్స్ కూడా తీస్తానని అనడం ఈ ప్రాజెక్ట్ స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టింది.
వారణాసి పాత్రలు
ఇదిలా ఉంటే, వారణా సినిమాలో రుద్రగా మహేష్ బాబు నటిస్తే.. మందాకిని పాత్రలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తోంది. అలాగే, పవర్‌ఫుల్ విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నాడు. కాలంతో పాటు ఖండాలు దాటే ఒక భారీ అడ్వెంచర్ స్టోరీగా ఇది రూపొందుతోంది. 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


