ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- చూసేందుకు 12 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- జియో హాట్‌స్టార్ టు ఈటీవీ విన్!

ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ మూవీస్ 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హాట్‌స్టార్ టు ఈటీవీ విన్, హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Dec 22, 2025, 09:21:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని జోనర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- చూసేందుకు 12 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- జియో హాట్‌స్టార్ టు ఈటీవీ విన్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 15 సినిమాలు- చూసేందుకు 12 చాలా స్పెషల్, 5 ఇంట్రెస్టింగ్- జియో హాట్‌స్టార్ టు ఈటీవీ విన్!

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19

మిసెస్ దేశ్‌పాండే (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

జీ5 ఓటీటీ

నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ కామెడీ సినిమా)- డిసెంబర్ 16

ఫాలౌట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19

రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19

ది గ్రేట్ ఫ్లడ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19

రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 18

దివ్యదృష్టి (తెలుగు హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 19

రూఫ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- డిసెంబర్ 19

ది లాస్ట్ షో (తెలుగు రొమాంటిక్ మ్యాజికల్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 21

ఓటీటీలోకి తెలుగులో 15 సినిమాలు

ఇలా గత వారం (డిసెంబర్ 16 నుంచి 21) తెలుగు భాషలో ఏకంగా 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో ప్రేమంటే, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ది గ్రేట్ ఫ్లడ్, నయనం, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్, దివ్య దృష్టి, ది లాస్ట్ షో, మిసెస్ దేశ్‌పాండే సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ఫార్మా, రాత్ అఖేలీ హై, ఫాలౌట్ సీజన్ 2‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా 6 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More