టీవీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ- ఓటీటీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే బుల్లితెరపైకి- 7.9 రేటింగ్- ఎప్పుడు, ఎక్కడంటే?

టీవీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రానుంది. ఓటీటీ రిలీజ్ అయిన కేవలం పది రోజుల్లోనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ కానుంది. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా తెలిపారు. మరి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ డేట్ ఏంటీ, ఎందులో అనేది తెలుసుకుందాం.

Published on: Dec 11, 2025, 12:14:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుల్లితెరపైకి సూపర్ హిట్ తెలుగు కామెడీ చిత్రం ప్రీమియర్ కానుంది. అయితే, ఇటీవల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవడం, అనతరం టీవీ ప్రీమియర్ కావడం సాధారణంగా జరుగుతున్న విషమయే. కాకపోతే ఓటీటీ రిలీజ్ తర్వాత బుల్లితెరపై ప్రీమియర్ చేసేందుకు కాస్తా ఎక్కువగా టైమ్ తీసుకునేవాళ్లు.

టీవీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ- ఓటీటీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే బుల్లితెరపైకి- 7.9 రేటింగ్- ఎప్పుడు, ఎక్కడంటే?
టీవీలోకి సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ- ఓటీటీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే బుల్లితెరపైకి- 7.9 రేటింగ్- ఎప్పుడు, ఎక్కడంటే?

ఓటీటీ తర్వాత టీవీలోకి

కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా విషయంలో మాత్రం టీవీ ప్రీమియర్ భిన్నంగా జరుగుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన పది రోజుల్లోనే బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది ఆ సూపర్ హిట్ తెలుగు కామెడీ ఫిల్మ్. అంటే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమా టీవీలోకి వచ్చేయనుంది.

ఆ సినిమానే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఎంతో మధురంగా దాచుకోవాల్సిన పెళ్లి నాటి జ్ఞాపకాలను ఫొటోగ్రాఫర్ పోగొడితే వంటి కాన్సెప్ట్‌తో వచ్చి ప్రేక్షకులను బాగా నవ్వించింది ఈ సినిమా. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో హీరోగా తిరువీర్, హీరోయిన్‌గా టీనా శ్రావ్య జంటగా నటించారు.

ఈ ఇద్దరితోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్, నరేంద్ర రవి ఇతర కీలక పాత్రలు పోషించారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కథలోకి వెళితే.. రమేష్ (తిరువీర్), తన స్నేహితుడు రామ్ చరణ్ (మాస్టర్ రోహన్ రాయ్)తో కలిసి ఒక ఫోటో స్టూడియో, జిరాక్స్ షాప్‌ను నడుపుతుంటాడు.

రాజకీయంగా పలుకుబడి

తన షాప్ ఎదురుగా ఉన్న పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ (టీనా శ్రావ్య) పట్ల రమేష్ ప్రేమను పెంచుకుంటాడు. ఒకరోజు, రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) తన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం రమేష్‌ను సంప్రదిస్తాడు.

షూట్ సజావుగా పూర్తవుతుంది. కానీ, రామ్ చరణ్ నిర్లక్ష్యం కారణంగా, ఆ ఫుటేజ్ ఉన్న మెమొరీ కార్డు పోతుంది. పోయిన చిప్‌ను రికవరీ చేయడానికి రమేష్ చేసిన ప్రయత్నాలు, పడ్డ తంటాలు, వాటి వల్ల ఏర్పడిన గందరగోళమే ఈ సినిమా కథాంశం.

ఇలాంటి నవ్వించే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ కానుంది. విభిన్నమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో పాటు బ్లాక్‌ బస్టర్ సినిమా ప్రీమియర్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న టీవీ ఛానెల్ జీ తెలుగు.

జీ తెలుగు ఛానెల్‌లో

ఇప్పుడు సరికొత్త సినిమా వినోదాన్ని అందించడానికి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో సిద్ధమైంది జీ తెలుగు. అద్భుతమైన కామెడీ-డ్రామా చిత్రం 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా డిసెంబర్ 14న ప్రసారం కానుంది. అంటే, జీ తెలుగులో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ కానుంది.

ఆకట్టుకునే కథాంశం, అద్భుతమైన నటన, ఆకర్షణీయమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం తెలుగు సినీ ప్రియులకు మరపురాని అనుభూతిని ఇవ్వడం ఖాయమని జీ తెలుగు నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ డేట్‌ను అధికారికంగా జీ తెలుగు ప్రకటించింది.

ఇదిలా ఉంటే, నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా మంచి అప్లాజ్ అందుకుంది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెల గ్యాప్‌లో డిసెంబర్ 05 జీ5లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

జీ5 ఓటీటీ తర్వాత జీ తెలుగు

ఈ లెక్కన, ఓటీటీ రిలీజ్ అయిన సుమారు పది రోజుల్లోనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీవీ ప్రీమియర్ కానుంది. అంటే, ప్రస్తుతం జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో జీ తెలుగులో డిసెంబర్ 14న టీవీ ప్రీమియర్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More