సుకుమార్‌కు కథలు చెప్పి ఓకే చేయించుకునేవారు, ఉప్పెన పాట కంటే డబుల్ హిట్ అయింది.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన ప్రస్తుతం రామ్ చరణ్‌తో పెద్ది సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగులో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ గర్ల్స్ (కానీ చాలా మంచోళ్లు) మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Dec 19, 2025, 11:30:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ బ్యాడ్ గర్ల్స్. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.

సుకుమార్‌కు కథలు చెప్పి ఓకే చేయించుకునేవారు, ఉప్పెన పాట కంటే డబుల్ హిట్ అయింది.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్
సుకుమార్‌కు కథలు చెప్పి ఓకే చేయించుకునేవారు, ఉప్పెన పాట కంటే డబుల్ హిట్ అయింది.. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా డైరెక్టర్

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి బ్యాడ్ గర్ల్స్ సినిమాకు దర్శకత్వం వహించారు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.

బ్యాడ్ గర్ల్స్ టీజర్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు

ఈ నేపథ్యంలో నిన్న (డిసెంబర్ 18) రామ్ చరణ్ పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా బ్యాడ్ గర్ల్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్యాడ్ గర్ల్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఎమోషనల్‌గా క్లైమాక్స్

పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. "ఈ బ్యాడ్ గర్ల్స్ చిత్ర కథ నాకు మున్నా గారు చెప్పారు. కథ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది" అని తెలిపారు.

సుకుమార్ దగ్గరికి వచ్చేవాడు

"దర్శకుడు సుకుమార్ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు సుకుమార్ గారి దగ్గరకు మున్నా వచ్చేవాడు. సుకుమార్ గారికి తాను రాసుకున్న కథలు చెప్పి ఆయనతో ఓకే చేయించుకునేవారు. మున్నా డైరెక్టర్ అయిపోతున్నాడు మనం కూడా డైరెక్టర్ అవ్వాలి అనుకునేవాడిని" అని బుచ్చిబాబు వెల్లడించారు.

మనం పాటలకు ఫ్యాన్‌ని

"ఉప్పెన చిత్రం లో 'నీ కన్ను నీలి సముద్రం' పాట ఎంత హిట్ అయిందో దానికి డబుల్ హిట్ అయింది 'నీలి నీలి ఆకాశం' పాట. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. 'మనం' సినిమా పాటలకి నేను పెద్ద ఫ్యాన్‌ని" అని బుచ్చిబాబు సాన పేర్కొన్నారు.

రేణు దేశాయ్ ఒప్పుకున్నారంటే

"ఈ చిత్రంలో రేణు దేశాయ్ గారు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రేణు దేశాయ్ గారు ఈ సినిమా ఒప్పుకున్నారు అంటే సినిమా ఎంత బాగుంటుందో తెలుస్తోంది. డిసెంబర్ 25న బ్యాడ్ గర్ల్స్ విడుదల అవుతుంది తప్పక చూడండి" అని దర్శకుడు బుచ్చిబాబు సాన కోరారు.

పెద్ది సినిమా గురించి

ఇదెలా ఉంటే, ఉప్పెన వంటి సూపర్ హిట్ తర్వాత బుచ్చిబాబు సాన చేస్తున్న పెద్ది మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బ్యూటిపుల్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన చికిరీ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More