హారర్ కామెడీ ఫాంటసీ మూవీతో వస్తోన్న మ్యాడ్ హీరో సంగీత్ శోభన్- రాకాస రిలీజ్ డేట్ ఇదే- ఓటీటీ డైరెక్టర్ వెండితెర ఎంట్రీ

తెలుగులో కమిటీ కుర్రోళ్లు వంటి మంచి సినిమాతో నిర్మాతగా ఆకట్టుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల బ్యానర్ నుంచి వస్తోన్న సరికొత్త సినిమా రాకాస. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ కామెడీ ఫాంటసీ మూవీ రాకాస రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Published on: Feb 6, 2026, 10:18:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

‘కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్య‌మైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా అంద‌రి దృష్టిని ఆకర్షించారు మెగా డాటర్ నిహారిక కొణిదెల‌. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’.

హారర్ కామెడీ ఫాంటసీ మూవీతో వస్తోన్న మ్యాడ్ హీరో సంగీత్ శోభన్- రాకాస రిలీజ్ డేట్ ఇదే- ఓటీటీ డైరెక్టర్ వెండితెర ఎంట్రీ
హారర్ కామెడీ ఫాంటసీ మూవీతో వస్తోన్న మ్యాడ్ హీరో సంగీత్ శోభన్- రాకాస రిలీజ్ డేట్ ఇదే- ఓటీటీ డైరెక్టర్ వెండితెర ఎంట్రీ

సోలో హీరోగా

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల‌తో న‌టుడిగా మెప్పించిన సంగీత్ శోభన్ తొలిసారి సోలో హీరోగా ఇందులో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు లేడి డైరెక్టర్ మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించారు. రీసెంట్‌గా రిలీజైన రాకాస సినిమా గ్లింప్స్, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

కామెడీ టైమింగ్‌తో

దీంతో రాకాస సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెరిగింది. సంగీత్ శోభ‌న్ సోలో హీరోగా త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో న‌వ్విస్తూ మెప్పించ‌బోతున్నాడ‌నే ఎగ్జయిట్‌మెంట్‌తో అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే రాకాస వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 3న గ్రాండ్‌గా రిలీజ్ చేయున్నారు మేకర్స్.

చేతిలో కాగడా పట్టుకుని

దీనికి సంబంధించిన రాకాస రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో సంగీత్ చేతిలో కాగ‌డా ప‌ట్టుకుని చీక‌టిలో దేన్నో వెతుకుతున్నాడు. ఇది మ‌రింత క్యూరియాసిటీని పెంచుతోంది.

రాకాస టెక్నికల్ వర్క్

ఇక అనుదీప్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ రాకాస చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. త్వ‌ర‌లోనే మ‌రికొన్ని అప్‌డేట్స్ అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

హీరోయిన్ నయన్ సారిక జోడీ

రాకాస సినిమాలో సంగీత్ శోభ‌న్‌‌కు జోడీగా బ్యూటిఫుల్ న‌య‌న్ సారిక‌ హీరోయిన్‌గా చేస్తోంది. వీరితోపాటు రాకాస సినిమాలో వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (జ‌బర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఇదివరకు కలిసి

ఇదిలా ఉంటే, లేడి డైరెక్టర్ మానస శర్మ, సంగీత్ శోభన్ ఇదివరకు కలిసి పని చేశారు. నిహారిక కొణిదెలనే రూపొందించిన ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభన్ హీరోగా చేస్తే.. మానస శర్మ రైటర్‌గా పని చేశారు.

ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మానస

ఆ త‌ర్వాత మాన‌స శర్మ సోనీ లివ్ ఓటీటీ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. ఈ ఓటీటీ సిరీస్‌తో డైరెక్టర్‌గా పరిచయం అయిన మానస శర్మ ఇప్పుడు రాకాస మూవీతో వెండితెరపై ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా కొత్త కెరీర్ స్టార్ట్ చేయనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More