OTT Rights: ఇవాళ ఉదయమే షూటింగ్ ప్రారంభం-అప్పుడే అమ్ముడుపోయిన హైకూ ఓటీటీ రైట్స్-కోర్టు హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ క్రేజ్

సూపర్ హిట్ మూవీ జో ప్రొడ్యూస‌ర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ ఇవాళ స్టార్ట్ అయింది. అయితే, సినిమా ప్రారంభం కాకముందే హైకూ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడు పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కోర్ట్ మూవీ నటి శ్రీదేవి అపళ్ల హీరోయిన్‌గా చేస్తున్న హైకూ ఓటీటీ హక్కులు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

Published on: Feb 1, 2026, 19:30:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ క‌థ‌లు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు.

ఇవాళ ఉదయమే షూటింగ్ ప్రారంభం-అప్పుడే అమ్ముడుపోయిన హైకూ ఓటీటీ రైట్స్-కోర్టు హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ క్రేజ్
ఇవాళ ఉదయమే షూటింగ్ ప్రారంభం-అప్పుడే అమ్ముడుపోయిన హైకూ ఓటీటీ రైట్స్-కోర్టు హీరోయిన్ శ్రీదేవి తమిళ మూవీ క్రేజ్

నెట్‌ఫ్లిక్స్‌కు ఓటీటీ రైట్స్

అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే హైకూ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే ఓటీటీ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) హైకూ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

ఇవాళ షూటింగ్ ప్రారంభం

త‌మిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు (ఫిబ్రవరి 1) ఉదయం ప్రారంభమైంది. పేరన్బు, తరమణి వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రామ్ ముహూర్త‌పు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు

ఇక హైకూ సినిమాకు యువ‌రాజ్ చిన్న‌సామి దర్శకత్వం వహిస్తున్నారు. విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌పై డా.డి. అరుళ‌నందు, మాథ్యూ అరుళ‌నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూప‌ర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన హ‌రిహ‌రన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వం

ఈ సినిమాకు ప్రియేష్ గురుస్వామి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా.. శక్తి ప్రణేశ్ ఎడిటర్‌గా, ‘బేబీ’, ‘కోర్ట్’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.

హీరోగా ఏగనా, హీరోయిన్‌గా శ్రీదేవి అపల్ల

ఇక హైకూ న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ‘జో’, ‘కోళి ప‌న్నై చెల్ల‌దురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్నారు. ఆయ‌న స‌ర‌స‌న ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ మూవీ ఫేమ్ శ్రీదేవి అపల్ల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్

అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో ‘హైకూ’ సినిమా రూపొందుతోంది. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోవడం చూస్తుంటే.. ఈ కంటెంట్‌పై వాళ్ల నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది.

తదితర వివరాలు త్వరలో

ఇదిలా ఉంటే, హైకూ సినిమా షూటింగ్ డీటెయిల్స్, రిలీజ్ డేట్ తదితర వివరాలను త్వరలో క్ర‌మక్రమంగా వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More