OTT: దేవగుడి ఓటీటీ రైట్స్‌కు మంచి డిమాండ్ ఉంది, భగవద్గీతను మత గ్రంథం అనుకుంటాం కానీ:దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

సింగర్ రఘు కుంచె, అభినవ శౌర్య, నరసింహా, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా దేవగుడి. దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో దేవగుడి ఓటీటీ రైట్స్, భగవద్గీత, హీరో శ్రీకాంత్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు రామకృష్ణా రెడ్డి.

Published on: Jan 29, 2026, 10:20:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.

దేవగుడి ఓటీటీ రైట్స్‌కు మంచి డిమాండ్ ఉంది, భగవద్గీతను మత గ్రంథం అనుకుంటాం కానీ:దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి
దేవగుడి ఓటీటీ రైట్స్‌కు మంచి డిమాండ్ ఉంది, భగవద్గీతను మత గ్రంథం అనుకుంటాం కానీ:దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి కామెంట్స్

"దేవగుడి" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి దేవగుడి మూవీ విశేషాలు, హైలెట్స్ పంచుకున్నారు.

యధాతథం అనే కాన్సెప్ట్‌తో

-నేను ఉద్యోగం చేస్తున్న టైమ్‌లో భగవద్గీత ఆధారంగా యధాతథం అనే కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. భగవద్గీత మత గ్రంథం అనుకుంటారు గానీ అది సైంటిఫిక్‌గా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్‌తో మూవీ నిర్మించాలని శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేశాం.

శ్రీకాంత్ గారు ఎంకరేజ్ చేశారు

-ఆ టైమ్‌లో శ్రీకాంత్ గారు సినిమాలో నా ఇన్వాల్వ్‌మెంట్ చూసి మీలో దర్శకుడు కూడా ఉన్నారు. మీరే డెరెక్ట్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. ఆ మూవీ తర్వాత దృశ్యకావ్యం సినిమాను నా దర్శకత్వంలో తెరకెక్కించాను. ఇప్పుడు "దేవగుడి" సినిమా రూపొందించాను. ఇది దర్శకుడిగా నా రెండో మూవీ

10 శాతం బడ్జెట్ ఎక్కువైంది

-సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లను ఎలా యూజ్ చేసుకుంటారో మీకు తెలుసు. గత చిత్రాల విషయంలో నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ సినిమాను జాగ్రత్తగా రూపొందించాను. నేను ఇంజినీర్‌ను కాబట్టి పక్కా ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లోనే షూటింగ్ కంప్లీట్ చేశాం. జస్ట్ ఓ 10 పర్సెంట్ బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది.

డిజిటల్ వ్యూస్ ఎక్కువ

-ఇటీవల రిలీజ్ చేసిన మా దేవగుడి మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర గారు పాడిన ఆరో ఆరారో పాటకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్‌లో మా చిత్రానికే డిజిటల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి.

రెండు కట్స్‌తో ఏ సర్టిఫికేట్

-సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్‌తో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను.

దేవగుడి ఓటీటీ రైట్స్

-సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దేవగుడి సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దేవగుడి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బిజినెస్ పరంగా మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More