OTT Trending Today: ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ ఆహా అనిపించే 5 సినిమాలు- అన్నీ తెలుగులోనే- బోల్డ్ టు హారర్ థ్రిల్లర్!
OTT Trending Movies Today Telugu: ఓటీటీ ట్రెండింగ్‌లో ఇవాళ ఆహా అనిపించేలా 5 సినిమాలు ఉన్నాయి. వాటిలో బోల్డ్ కామెడీ నుంచి హారర్ థ్రిల్లర్ వరకు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ఐదు సినిమాలన్నీ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ఆహా ఓటీటీలో ఇవాళ (జనవరి 26) ట్రెండింగ్‌లో టాప్ 10 సినిమాలు ఉన్నాయి. అందులో ఆహా అనిపించేలా ఐదు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ వరకు డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

శంబాల ఓటీటీ
ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా వెయ్యేళ్ల చరిత్రగల ఓ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న బండ భూతం చుట్టూ తిరుగుతుంది.
జనవరి 22 నుంచి ఆహాలో శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇవాళ టాప్ 1 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది శంబాల. మంచి మిస్టరీ హారర్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవారికి శంబాల బెస్ట్ ఛాయిస్.
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ ఓటీటీ
ఆహా ఓటీటీలోకే స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్. ముగ్గురి హత్యలు జరుగుతాయని ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో ఇద్దరు ఏసీపీలు వారి రక్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ, వారు ముగ్గురు హత్యకు గురవుతారు.
వారిని చంపిన క్రిమినల్స్‌ను పట్టుకునేందుకు సాగే ఇన్వెస్టిగేషనే ఈ సిరీస్. ఆహా ఓటీటీలో ఇవాళ ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ టాప్ 2 ప్లేసులో ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్ కూడా థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఉత్తమ ఎంపిక.
ఆయలాన్ ఓటీటీ
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ యాక్షన్ డ్రామా చిత్రం ఆయలాన్. తెలుగులో ఆహాలో ఆయలాన్ ఓటీటీ రిలీజ్ కాగా ప్రస్తుతం టాప్ 3 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. మంచి ఎమోషన్స్‌తో కామెడీ చూడాలనుకునేవారికి ఆయలాన్ సినిమా మంచి ఆప్షన్.
3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ
ముంబైలో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ చేసిన అల్లరినే 3 రోజెస్ సీజన్ 2. ప్రేమ, పెళ్లి, కెరీర్ వంటి అంశాలతో ముగ్గురు అమ్మాయిల చుట్టూ సాగే కథగా 3 రోజెస్ 2 ఉంటుంది. బోల్డ్ కామెడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ అయిన 3 రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో టాప్ 4 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.
మారియో ఓటీటీ
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ మారియో. ఒక్క డ్రగ్‌తో గ్యాంబ్లింగ్, డ్రింక్, సెక్స్ వంటి మూడు కోరికలు బలంగా కలుగుతాయి. అలాంటిది డ్రగ్ ఓ పాపులర్ హీరోయిన్ తీసుకుంటే ఎలా ఉంటుందో అనే కథగా మారియో తెరకెక్కింది.
జనవరి 23 నుంచి ఆహాలో మారియో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది మారియో. ఇవాళ (జనవరి 26) ఆహాలో టాప్ 6 ప్లేసులో మారియో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా అడల్ట్స్‌కు బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


