OTT Bold Telugu: 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చిన తెలుగు బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్- ఒక్క డ్రగ్, 3 కోరికలు- 8.6 రేటింగ్!
Today OTT Bold Telugu Movie: 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో తెలుగు బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ మారియో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ సినిమాలో కూడా తన పేరుతో నటించిన ఈ సినిమాకు 8.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉంది. మరి మారియో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీ సినిమాలు అనగానే అన్ని రకాల జోనర్స్‌తో అలరిస్తుంటాయి. ఇక తెలుగులో వచ్చే డిఫరెంట్ జోనర్స్ మూవీస్ ఓటీటీ ప్రియులను ఊరిస్తుంటాయి. అయితే, ఇటీవల కాలంలో తెలుగులో అన్ని రకాల జోనర్ మూవీస్ వచ్చినప్పటికీ బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు తక్కువగా అయ్యాయి.

బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా
కానీ, గతేడాది థియేటర్లలో ఓ తెలుగు బోల్డ్ మూవీ సందడి చేసింది. కానీ, అనుకున్నంత క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆ సినిమానే మారియో. 90స్ కిడ్స్‌కు సూపర్ మారియో గేమ్ ఎంత ఇష్టమో తెలిసిందే. అదే టైటిల్‌తో తెలుగులో బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా మారియో తెరకెక్కింది.
రియల్ లైఫ్ హీరోయిన్ పాత్రలో
మారియో సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్‌గా చేసింది. అంతేకాకుండా రియల్ లైఫ్ హీరోయిన్‌గా హెబ్బా పటేల్ పేరుతోనే మారియో సినిమాలో యాక్ట్ చేసింది ఈ బ్యూటి. అలాగే, ఈ సినిమాలో ప్రముఖ డైలాగ్ రైటర్, లిరిసిస్ట్, నటుడు రాకేందు మౌళి బాబ్ మార్లేగా కీలక పాత్ర పోషించారు.
రాకేందు మౌళి సంగీతం
హెబ్బా పటేల్, రాకేందు మౌళితోపాటు నటి కల్పిక గణేష్, మదీ మానేపల్లి, అనిరుధ్ శ్రీవాత్సవ, యష్నీ, మౌర్య సిద్ధవరం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కల్యాంజి గోగన దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సాయి కార్తీక్‌తోపాటు నటుడు రాకేందు మౌళి సంగీతం అందించడం విశేషం.
మారియో రేటింగ్
సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్, కల్యాంజి కంటెంట్ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన మారియో సినిమా 2025లో డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, పెద్దగా రెస్పాన్స్ అందుకోలేదు. కానీ, ఐఎమ్‌డీబీలో మాత్రం పదికి 8.6 రేటింగ్‌ను మాత్రం దక్కించుకుంది.
బలంగా 3 కోరికలు
మారియో సినిమా ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది. ఆ డ్రగ్ తీసుకున్నవాళ్లకు మూడు కోరికలు బలంగా కలుగుతాయి. డ్రగ్ తీసుకున్నవాళ్లకు గ్యాంబ్లింగ్, డ్రింకింగ్, సెక్స్ వంటి మూడు కోరికలు విపరీతంగా కలుగుతాయి. అలాంటి డ్రగ్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మారియో కథ.
హాట్ అండ్ బోల్డ్ సీన్స్
మారియో హాట్ అండ్ బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. హెబ్బా పటేల్ కిస్సింగ్ సీన్స్‌తో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇలాంటి తెలుగు బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మారియో ఓటీటీలోకి ఇవాళ (జనవరి 23) వచ్చేసింది. అది కూడా రెండు ఓటీటీల్లోకి.
మారియో ఓటీటీ స్ట్రీమింగ్
ఆహాలో నేటి నుంచి మారియో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, మరో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో కూడా మారియో ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఎంచక్కా మారియో సినిమాను ఆహా, అమెజాన్ ప్రైమ్ వంటి రెడు ఓటీటీల్లో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


