నిర్మాతగా మంచి సినిమాలు- నటుడిగా కూడా మెప్పిస్తున్న యశ్ రంగినేని- హీరో శ్రీకాంత్ కొడుకు సినిమాలో గొప్ప పాత్ర!

నిర్మాతగా, నటుడిగా మెప్పిస్తున్నారు యశ్ రంగినేని. హీరో శ్రీకాంత్ కుమారుడు రేషన్ మేక నటించిన లేటెస్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ఛాంపియన్ మూవీలో యశ్ రంగినేని గొప్ప పాత్ర పోషించి ఆకట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై లుక్కేద్దాం.

Published on: Jan 1, 2026, 16:51:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోలుగా, నటులు దర్శకులుగా, హీరోయిన్స్ సింగర్స్‌గా మారి అందరిని ఆశ్చర్యపరచడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఓ నిర్మాత నటుడిగా మారి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించిన ఆయన నటుడిగానూ మెప్పిస్తున్నారు.

నిర్మాతగా మంచి సినిమాలు- నటుడిగా కూడా మెప్పిస్తున్న యశ్ రంగినేని- హీరో శ్రీకాంత్ కొడుకు సినిమాలో గొప్ప పాత్ర!
నిర్మాతగా మంచి సినిమాలు- నటుడిగా కూడా మెప్పిస్తున్న యశ్ రంగినేని- హీరో శ్రీకాంత్ కొడుకు సినిమాలో గొప్ప పాత్ర!

మేనల్లుడైన విజయ్ దేవరకొండతో

ఆయనే ప్రొడ్యూసర్ యశ్ రంగినేని. టాలీవుడ్‌లో ఓ నిర్మాతగా యశ్ రంగినేని మంచి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాతగా యశ్ రంగినేని సినిమాలు

ఆ తరువాత యశ్ రంగినేని నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

ఛాంపియన్ సినిమాలో

ఇక నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూనే నటుడిగా తన సత్తాను ప్రదర్శించుకుంటున్నారు యశ్ రంగినేని. తాజాగా జాతీయ అవార్డ్ గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

వీరయ్య అనే పాత్రలో

సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్ చిత్రంలో యశ్ రంగినేని ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. వీరయ్య అనే అద్భుతమైన రోల్‌లో యశ్ రంగినేని అంతే గొప్పగా జీవించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో యశ్ రంగినేని నటన అందరికీ గుర్తుండిపోయేలా ఉంది.

అణగారిన వర్గాలకు ప్రతినిధిగా

‘ఛాంపియన్’ చిత్రంలో ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రని యశ్ రంగినేని చాలా గొప్పగా పోషించి అందరి చేత మన్నల్ని పొందారు.

మలయాళ బ్యూటి అనస్వర రాజన్

ప్రస్తుతం ఛాంపియన్ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఛాంపియన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రోషన్ మేక నటనకు బాగా మార్కులు పడుతున్నాయి. ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ నటించింది.

మిక్కీ జే మేయర్ సంగీతం

అవంతిక, కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా నిర్మాత అయిన యశ్ రంగినేని పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఛాంపియన్ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More