ఛాంపియన్ రివ్యూ- తెలంగాణ సాయుధ పోరాటంలో ఫుట్‌బాల్ ప్లేయర్ కథ.. శ్రీకాంత్ కొడుకు రోషన్, అనస్వర మూవీ ఎలా ఉందంటే?
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో పీరియాడిక్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాదా తెరకెక్కిన ఛాంపియన్ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఛాంపియన్ రివ్యూలో చూద్దాం.
టైటిల్: ఛాంపియన్

నటీనటులు: రోషన్ మేక, అనస్వర రాజన్, అవంతిక, కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు
కథ: ప్రదీప్ అద్వైతం, రుతమ్ సమర్
దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: మదీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: స్వప్న, ప్రియాంక
విడుదల తేది: 25 డిసెంబర్ 2025
సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ రొమాంటిక్ యాక్షన్ సినిమా ఛాంపియన్. వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ 'స్వప్న సినిమా' పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు.
తెలంగాణ చరిత్రలోని వీరోచిత ఘట్టమైన 'బైరాన్‌పల్లి' సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇవాళ (డిసెంబర్ 25) థియేటర్లలో ఛాంపియన్ సినిమా విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి ఛాంపియన్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్ (రోషన్ మేక)కు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సెటిల్ అవ్వాలన్నది అతని కల. అయితే, మైఖేల్ తండ్రి చేసిన తప్పు కారణంగా మైఖేల్ ఆయుధాలు డెలివరీ చేసే పనిలో ఇరుక్కుంటాడు.
ఈ క్రమంలో తప్పిపోయి తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామానికి చేరుతాడు మైఖేల్. అప్పటికే ఆ గ్రామం నిజాం రజాకార్ల అరాచకాలతో అతలాకుతలం అవుతుంటుంది. ఆ తర్వాత ఏమైంది ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ఈ పోరాటంతో సంబంధం ఏంటి? మైఖేల్ తన కలను నిజం చేసుకున్నాడా? బైరాన్‌పల్లి ప్రజల కోసం అతను చేసిన యుద్ధం ఏమిటి? మైఖేల్ తండ్రి చేసిన తప్పు ఏంటీ? అనేది తెలియాలంటే ఛాంపియన్ చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజాం పరిపాలన, రజాకార్‌ల ఆకృత్యాలు చూపిస్తూ ఛాంపియన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మైఖేల్ పాత్ర పరిచయం, తన కోరిక, అందుకోసం చేసే పనులతో సాగుతుంది. ఆ తర్వాత మైఖేల్ తండ్రి చేసిన పని అడ్డంకిగా మారడం, అందుకు మూల్యం చెల్లించుకునేందుకు ఆయుధాలు డెలివరీ చేయడం వంటి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
బైరాన్‌పల్లికి మైఖేల్ వెళ్లడం, అక్కడ ప్రజలతో గడపడం, ఆ తర్వాత రజాకార్ దాడితో సినిమా మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ తర్వాత కాసేపు సినిమా స్లో అయిన ఫీలింగ్ కలిగిన క్లైమాక్స్ వచ్చేసరికి మంచి హై మూమెంట్స్ ఉన్నాయి. అయితే, సినిమా స్లో అయినట్లు అనిపించినా అదంతా చూసేలా గ్రిప్పింగ్‌గా డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఆ విధానం ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా సినిమాలో వచ్చే లవ్ ట్రాక్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగా కుదిరాయి. అన్ని రకాల ఎమోషన్స్‌తో ఆడియెన్స్‌ను కూర్చొబెట్టేలా సినిమాను తీర్చిదిద్దారు. క్లైమాక్స్ చాలా బాగా మెప్పిస్తుంది. సినిమాలో ఆర్ట్ వర్క్ చాలా హైలెట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ సాయిధ పోరాటం సమయానికి తగినట్లుగా సెట్స్ బాగా కుదిరాయి.
టెక్నికల్ వర్క్
విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా 'గిరగిర' పాట, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. మాధీ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా చూపించడమే కాకుండా, బైరాన్‌పల్లి యాక్షన్ ఎపిసోడ్స్‌ను విజువల్ వండర్‌గా మార్చింది.
ఉన్నతమైన నిర్మాణ విలువలతో సాంకేతింగా బాగుంది ఛాంపియన్. ఇక రోషన్ మేక తన గత సినిమాల కంటే ఇందులో చాలా పరిణతితో నటన కనబరిచాడు. లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ, ఫుట్‌బాల్ ఆడే సన్నివేశాల్లోనూ రోషన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.
ఆకట్టుకునే నటన
ఇక హీరోయిన్ అనస్వర రాజన్ తన పాత్ర (చంద్రకళ)లో ఒదిగిపోయింది. కేవలం అందానికే పరిమితం కాకుండా కథలో కీలకమైన పాత్ర పోషించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. సీనియర్ నటుడు కళ్యాణ్ చక్రవర్తి రీ-ఎంట్రీ కూడా సినిమాకు ఒక బలంగా నిలిచింది. అవంతిక డ్యాన్స్‌తో అట్రాక్ట్ చేసింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే
'ఛాంపియన్' కేవలం ఒక స్పోర్ట్స్ మూవీగానే కాకుండా మట్టి మనుషుల పోరాట గాథగా తెరకెక్కించారు. చారిత్రక అంశాలను, క్రీడా నేపథ్యాన్ని కలిపి చూపించడంలో దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. కథలో కొంత నెమ్మది ఉన్నా, రోషన్ నటన కోసం, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కోసం ఛాంపియన్ సినిమాను కచ్చితంగా చూడవచ్చు.
రేటింగ్: 3.25/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


