శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా- మలయాళ క్రేజీ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ- గ్లింప్స్ రిలీజ్!

సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ కథానాయకుడుగా చేస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఛాంపియన్‌లోని అనస్వర రాజన్ పాత్ర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Published on: Nov 23, 2025, 15:05:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ హీరో శ్రీకాంత్ తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. శ్రీకాంత్ కుమారుడుగా సినిమాల్లో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ హీరో రోషన్ లేటెస్ట్‌గా నటుస్తోన్న సినిమా ఛాంపియన్. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా- మలయాళ క్రేజీ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ- గ్లింప్స్ రిలీజ్!
శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా- మలయాళ క్రేజీ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ- గ్లింప్స్ రిలీజ్!

బ్లాక్ బస్టర్స్ అందించే

జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌ బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్ అని టాక్ ఉంది. దీంతో ఛాంపియన్ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

క్యారెక్టర్ గ్లింప్స్

ఇదివరకు రిలీజ్ చేసిన ఛాంపియన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. వీటితో ద్వారా ఛాంపియిన్ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు.

ఛాంపియన్ టీజర్‌తో

ఛాంపియన్ టీజర్‌తో ప్రేక్షకులకు మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్‌ని పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ పోషించిన చంద్రకళ పాత్రను అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

నాటక కళాకారిణిగా

ఈ గ్లింప్స్‌లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం చేశారు. తన చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం కంటే పెద్ద కలలు కంటూ, మంచి నాటక కళాకారిణిగా ఎదిగి, ఒక రోజు తనకంటూ సొంత నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకు సాగే అమ్మాయి చంద్రకళ.

రోషన్-అనస్వర కెమిస్ట్రీ

అనస్వర రాజన్ పాత్రను ఎంతో అందంగా మలిచారు. ఆమె పాత్ర ఎంత కీలకమో సన్నివేశాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రోషన్–అనస్వరల కెమిస్ట్రీ ఈ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రేమకథ ‘చాంపియన్’లో మనసుని తాకేలా ఉండబోతుంది.

మలయాళ సినిమాలతో

ఇకపోతే ఛాంపియన్ సినిమాతోనే తెలుగులో అనస్వర రాజన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. రేఖాచిత్రం, నెరు, ప్రణయ విలాసం వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అనస్వర రాజన్. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అనస్వర రాజన్‌కు ఛాంపియన్ ఎలాంటి క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి.

రామ్ మిరియాల వాయిస్‌తో

ఇదిలా ఉంటే, అనస్వర రాజన్ చంద్రకళ పాత్ర గ్లింప్స్‌లో మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన ఆహ్లాదకరమైన మెలోడీ కట్టిపడేసింది. రామ్ మిరియాల వాయిస్ మెస్మరైజింగ్‌గా ఉంది. పూర్తి లిరికల్ సాంగ్ నవంబర్ 25న విడుదల కానుంది.

క్రిస్మస్ సందర్భంగా

ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. మధీ వండర్‌ఫుల్ విజువల్ క్యాప్చర్ చేశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఛాంపియన్ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More