కుండెడు రక్తం తాగిన రాక్షసుడు కలబడితే- లుంగీ కట్టి కత్తితో విజయ్ దేవరకొండ యాక్షన్- రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్

విజయ్ దేవరకొండ ఊర మాస్ లుక్‌లో కనిపించిన లేటెస్ట్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రౌడీ జనార్ధన. రవికిరణ్ కోలా దర్శకత్వం వహించిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ (డిసెంబర్ 22) విడుదల చేశారు మేకర్స్. ఇందులో నెత్తురోడిన దేహంతో, లుంగీ కట్టి, కత్తి పట్టిన విజయ్ ‘రౌడీ’ అవతారం నెట్టింట వైరల్ అవుతోంది.

Dec 22, 2025, 21:07:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన మార్క్ ‘రౌడీ’ ఇమేజ్‌ను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ కొత్త సినిమా రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ సోమవారం (డిసెంబర్ 22) సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది.

కుండెడు రక్తం తాగిన రాక్షసుడు కలబడితే- లుంగీ కట్టి కత్తితో విజయ్ దేవరకొండ యాక్షన్- రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్
కుండెడు రక్తం తాగిన రాక్షసుడు కలబడితే- లుంగీ కట్టి కత్తితో విజయ్ దేవరకొండ యాక్షన్- రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్

గుండెడు రక్తం తాగే రాక్షసుడు!

పవర్‌ఫుల్ టైటిల్‌‌తో వచ్చిన రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ లుక్ చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. చింపిరి జుట్టు, దట్టమైన మీస కట్టుతో, ఒంటి నిండా రక్తపు మరకలతో విజయ్ గుర్తుపట్టలేనంతగా కనిపించాడు.

"బండెడు అన్నం తిని కుండెడు రక్తం తాగే రాచ్చసుడి గురించి ఎప్పుడైనా విన్నావా. నేను చూశాను. కొమ్ములతో ఆడి కథను ఆడే రాసుకున్నాడు. కన్నీళ్లను ఒంటికి నెత్తుటిలా పూసుకున్నాడు. సావు కళ్లముందుకు వచ్చి నిలబడితే.. గత్తేరేసి కలబడినోడు. కలబడ్డాడు.. నా లోపల.." అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

ఆ తర్వాత లుంగీ కట్టి, చేతిలో పెద్ద కత్తితో శత్రువులపై వేటు వేస్తూ వయోలెంట్ యాక్షన్‌తో విధ్వంసం సృష్టించాడు విజయ్ దేవరకొండ. “కళింగపట్నంలో ఇంటికొక XXXXకు నేను రౌడీని అని చెప్పుకుని తిరుగుతున్నాడు.. కానీ ఇంటిపేరునే ‘రౌడీ’గా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ మాసీగా ఉంటూ విజిల్స్ వేసేలా ఉంది.

ఈస్ట్ గోదావరి మాండలికంలో!

విజయ్ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా ఉండే తెలంగాణ యాసను పక్కనపెట్టి ఈ సినిమా కోసం తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ యాసను ట్రై చేశారు. ఇది ఆయన పాత్రకు మరింత సహజత్వాన్ని ఇస్తోంది. ఇకపోతే గ్లింప్స్‌లోనీ బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది.

ఇదిలా ఉంటే, రౌడీ జనార్ధన సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాన్-ఇండియా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ డ్రామా రౌడీ జనార్ధన 2026 డిసెంబర్‌లో విడుదల కానుంది.

అభిమానుల కోసం

రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి ముందే హైదరాబాద్‌లోని ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్ ఒక వీడియో సందేశాన్ని పంపారు.

రాహుల్ సాంకృత్యన్ సినిమా షూటింగ్‌లో తన ‘న్యూ లుక్’ రివీల్ అవ్వకుండా చేత్తో ముఖాన్ని దాచుకుంటూనే తన సంతోషాన్ని పంచుకున్నారు విజయ్ దేవరకొండ. “ప్రపంచం కంటే ముందే నా రౌడీస్ ఈ గ్లింప్స్ చూడాలని నేను దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాను” అని విజయ్ పేర్కొన్నారు.

రౌడీ రీడెంప్షన్ అంటూ

ఈ రౌడీ జనార్ధన గ్లింప్స్‌ను చూసిన అభిమానులు, నెటిజన్స్ ఇది ‘రౌడీ రీడెంప్షన్’ (రౌడీ పునరుజ్జీవం) అని అభివర్ణిస్తున్నారు. విజయ్ దేవరకొండ మళ్లీ తన పాత మాస్ ట్రాక్‌లోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More