ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చేసిన కీర్తి సురేష్ సరికొత్త కామెడీ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ఇవాళ నేరుగా కీర్తి సురేష్ కామెడీ మూవీ ఉప్పు కప్పురంబు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సుహాస్ హీరోగా చేసిన ఉప్పు కప్పురంబు ఓటీటీలోకి ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తొలిసారిగా సుహాస్-కీర్తి సురేష్ కలిసి నటించిన ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Jul 4, 2025, 11:14:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎన్నో వివిధ రకాల జోనర్స్‌తో కంటెంట్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. థియేటర్లలో చిన్న, పెద్ద సినిమాలు ఆడినట్లుగానే ఓటీటీలోకి సైతం బిగ్ స్టార్స్ ఎంట్రీ ఇస్తూ ఒరిజినల్ కంటెంట్స్ చేస్తున్నారు. అలా కీర్తి సురేష్ డైరెక్ట్ ఓటీటీ సినిమాలను ఎప్పటి నుంచో చేస్తోంది.

ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చేసిన కీర్తి సురేష్ సరికొత్త కామెడీ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ నేరుగా వచ్చేసిన కీర్తి సురేష్ సరికొత్త కామెడీ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

కీర్తి సురేష్‌తోపాటు హీరో

ఇక తాజాగా ఇవాళ (జూలై 4) నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ కామెడీ మూవీ ఉప్పు కప్పురంబు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు హీరో సుహాస్ కూడా యాక్ట్ చేశాడు. వరుసగా థియేట్రికల్ సినిమాలతో అలరించే సుహాస్ మరో ఓటీటీ సినిమా అయిన ఉప్పు కప్పురంబుతో ఆడియెన్స్‌ను పలకరించాడు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

కీర్తి సురేష్-సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహించారు. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మాతగా నిర్మించారు. ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ ఉప్పు కప్పురంబు ఓటీటీ రిలీజ్ అయింది.

ఐదు భాషల్లో స్ట్రీమింగ్

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం వంటి ఐదు భాషల్లో ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసంది కీర్తి సురేష్-సుహాస్‌ల ఉప్పు కప్పురంబు మూవీ.

సెటైరికల్ కామెడీ మూవీ

సరికొత్త కాన్సెప్ట్‌తో ఉప్పు కప్పురంబు తెరకెక్కింది. 1990 కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ సెటైరికల్ కామెడీ చిత్రంగా ఉప్పు కప్పురంబు సినిమాను నిర్మించారు దర్శకనిర్మాతలు. ఓ పల్లెటూరి గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానంలో స్థలం ఉండదు.

శ్మశానం కోసం పాట్లు

ఈ సమస్యను తీర్చడానికి కీర్తి సురేష్ ఆ విలేజ్‌లోకి అడుగుపెడుతుంది. శ్మశానంను రెండు భాగలుగా ఊరి ప్రజలు పంచుకుంటారు. అందరికి న్యాయం చేసేందుకు, శ్మశానంలో అంత్రక్రియలు జరిపేందుకు కీర్తి సురేష్ నానా పాట్లు పడుతుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

కీర్తి సురేష్ ఆ సమస్యను ఎలా తీర్చింది? అసలు తీర్చిందా? ఈ క్రమంలో ఆమెకు సుహాస్ ఎలా సహాయం చేశాడు? అనేదే ఉప్పు కప్పురంబు సినిమా కథ. మరి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంచక్కా చూసేయండి మరి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More