ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో యాంకర్ సుమ కొడుకు రోషన్ మోగ్లీ- రామాయణం, కర్మతో లింక్- 7.1 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ యాక్షన్ డ్రామా ‘మోగ్లీ’ (Mowgli 2025) స్ట్రీమింగ్ కానుంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న మోగ్లీ ఓటీటీ రిలీజ్ కానుంది. 7.1 రేటింగ్ సాధించిన మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 31, 2025, 22:45:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ యాంకర్ సుమ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ కలయికలో వచ్చిన వినూత్న ప్రేమకథ ‘మోగ్లీ’. థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సినీ ప్రియులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు మరికొన్ని గంటల్లోనే మోగ్లీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో యాంకర్ సుమ కొడుకు రోషన్ మోగ్లీ- రామాయణం, కర్మతో లింక్- 7.1 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో యాంకర్ సుమ కొడుకు రోషన్ మోగ్లీ- రామాయణం, కర్మతో లింక్- 7.1 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

అడవిలో అపురూప ప్రేమకథ

“ప్రతీ హీరో నగరంలోనే పుట్టడు.. కొందరు అడవి నుంచి ఉద్భవిస్తారు” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అనాథగా అడవిలోనే పెరుగుతూ, అక్కడి ప్రకృతిని తన తల్లిగా భావించే ఒక యువకుడు.. అనుకోకుండా షూటింగ్ కోసం అడవికి వచ్చిన ఒక మూగ అమ్మాయితో ప్రేమలో పడతాడు.

వీరిద్దరి స్వచ్ఛమైన ప్రేమకథలోకి ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసర్ ప్రవేశించడంతో కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? తన ప్రేమను కాపాడుకోవడానికి ఆ ‘మోగ్లీ’ ఎంతటి సాహసం చేశాడనేది ఈ చిత్ర ప్రధానాంశం.

రామాయణం, కర్మకు లింక్

రామాయణం కథకు, కర్మ సిద్దాంతానికి లింక్ చేస్తూ ఫారెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా మోగ్లీ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైన మోగ్లీ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.1 రేటింగ్ కూడా దక్కించుకుంది.

అలాగే, రోషన్ కనకాల, విలన్‌గా చేసిన బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి. అలాంటి మోగ్లీ ఓటీటీలోకి మరికొన్ని గంట్లలో అంటే జనవరి 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. కేవలం 17 రోజుల్లో మోగ్లీ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win)లో మోగ్లీ ఓటీటీ రిలీజ్ కానుంది. 2026 జనవరి 1వ తేదీ (అర్ధరాత్రి నుంచి) మోగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ సినిమాపై ఓటీటీలో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో బండి సరోజ్ కుమార్‌కు సంబంధించిన సీన్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే, మోగ్లీ సినిమాలో రోషన్ కనకాల సరసన హీరోయిన్‌గా సాక్షి మడోల్కర్ నటించింది. వెర్సటైల్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ విలన్‌గా మెప్పించారు. ‘కలర్ ఫోటో’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సందీప్ రాజ్ దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే.

ఈటీవీ విన్ ఓటీటీలో

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో వైవా హర్ష, కృష్ణ భగవాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. హీరో సుహాస్ అతిథి పాత్రలో మెరిశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో మంచి యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీ చూడాలనుకునే వారికి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మోగ్లీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More