ఓటీటీలోకి యాంకర్ సుమ కనకాల తెలుగు రొమాంటిక్ కామెడీ- ఐఎమ్‌డీబీలో ఏకంగా 8 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రియదర్శి, బ్యూటిఫుల్ ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో యాంకర్ సుమ కీలక పాత్ర పోషించింది. 8 రేటింగ్ సాధించిన ఈ సినిమా 4 భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుంది. మరి ఈ ప్రేమంటే ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 15, 2025, 12:58:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాల సందడి సాగుతూనే ఉంటోంది. కొత్త వారంలోకి ఎంట్రీ ఇవ్వగానే వచ్చే లేటెస్ట్ ఓటీటీ రిలీజెస్‌పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అందులోనూ తెలుగు కంటెంట్ ఓటీటీ సినిమాలకు మరింత క్రేజ్ ఉంటోంది. ఈ క్రమంలోనే ఈ వారం ఓటీటీలోకి తెలుగు సినిమా రానుంది.

ఓటీటీలోకి యాంకర్ సుమ కనకాల తెలుగు రొమాంటిక్ కామెడీ- ఐఎమ్‌డీబీలో ఏకంగా 8 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి యాంకర్ సుమ కనకాల తెలుగు రొమాంటిక్ కామెడీ- ఐఎమ్‌డీబీలో ఏకంగా 8 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

రొమాంటిక్ కామెడీ జోనర్

ఆ మూవీనే ప్రేమంటే. థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది మూవీ క్యాప్షన్. తెలుగులో రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి, బ్యూటిఫుల్ భామ ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు.

కీలక పాత్రలో యాంకర్ సుమ

స్టార్ యాంకర్ సుమ కనకాల కీలక పాత్ర పోషించి నవ్వించిన ఈ సినిమాలో ఆమెతోపాటు వెన్నెల కిశోర్, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ సైతం కామెడీతో ఆకట్టుకున్నారు. ప్రేమంటే సినిమాకు నవనీత్ శ్రీరామ్ కథ అందించి దర్శకత్వం వహించారు. రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు.

సమర్పకులుగా రానా దగ్గుబాటి

అంటే ప్రేమంటే సినిమాకు టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సమర్పకులుగా ఉన్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ప్రేమంటే సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. అయితే, ప్రేమంటే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ, కామెడీ పరంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రేమంటే ఓటీటీ స్ట్రీమింగ్

ఈ నేపథ్యంలోనే ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది ప్రేమంటే సినిమా. ఇదిలా ఉంటే, ఇప్పుడు ప్రేమంటే ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ వారమే ప్రేమంటే ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేమంటే ఓటీటీ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

4 భాషల్లో రిలీజ్

అంతేకాకుండా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లోనూ ప్రేమంటే ఓటీటీ ప్రీమియర్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎంచక్కా చూసి నవ్వేసుకోవచ్చు.

ప్రేమంటే కథ

ఇకపోతే ప్రేమంటే సినిమా కథ విషయానికొస్తే.. వివాహంపై మది అలియాస్ మధుసూదన్ (ప్రియదర్శి), రమ్య (ఆనంది)కి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. ఓరోజు అనుకోకుండా ఇద్దరు ఒకరి వివాహంలో కలుసుకుంటారు. వారి పరిచయం, సంభాషణల తీరుతో ఇద్దరు ప్రేమలో పడతారు. ఇద్దరికి పెళ్లి కూడా అవుతుంది.

ప్రేమంటే ట్విస్టులు

ఆ తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన మది, రమ్యల జీవితం ఎలా సాగిందనేదే ప్రేమంటే సినిమా కాన్సెప్ట్. లవ్ లైఫ్ తర్వాత పెళ్లి జీవితం ఎలా ఉంది?, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఏంటీ? ఒకరినొకరు ఎలా చూసుకోవాలి?, ఈ ఇద్దరి మధ్య తలెత్తిన సమస్యలు ఏంటీ?, వాటి పరిష్కారాలు ఏంటీ? అనే విషయాలను కామెడీ, రొమాన్స్ అంశాలను మేళవించి డైరెక్టర్ తెరకెక్కించారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి

ప్రతి భార్యాభర్తకు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రేమంటే సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 19 నుంచి వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More