సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర హనీ- చిత్రీకరణ కాకముందే ఓటీటీ డీల్- థియేట్రికల్ రిలీజ్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. చిత్రీకరణ కాకముందే హనీ ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. ఈ విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి హనీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, థియేట్రికల్ రిలీజ్ డేట్ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తెలుగులో విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న హీరో, నటుడు నవీన్ చంద్ర. హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తూనే మరోవైపు నటుడిగా మెప్పించే పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి నవీన్ చంద్ర నటించిన మరో లేటెస్ట్ మూవీనే హనీ.

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాకు కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించారు. హనీ మూవీని తెలుగు సైకలాజికల్ హారర్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఓవీఏ (OVA) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి హనీ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
నిజ జీవిత సంఘటనలతో
హనీ సినిమాను నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తీర్చి దిద్దారు. ఫిబ్రవరి 6న ఈ హనీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హనీ నటీనటులు
హనీ మూవీలో హీరో హీరోయిన్ల నవీన్ చంద్ర, దివ్య పిళ్లైతోపాటు బిగ్ బాస్ దివి వాద్యా, నటుడు రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. అజయ్ అరసాడ హనీ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
హనీ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఇదిలా ఉంటే, హనీ మూవీ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అప్పుడే హనీ ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. హనీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగులో చేసింది. అంటే, థియేట్రికల్ రిలీజ్ అనంతరం అమెజాన్ ప్రైమ్‌లోనే హనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
హారర్ అంశాల సమ్మేళనం
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హనీ మూవీపై ఎంత క్రేజ్ ఉందో. ఇకపోతే సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
మాస్ జాతరలో విలన్‌గా
కాగా, నవీన్ చంద్ర ఇటీవలే రవితేజ-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ జాతర సినిమాలో విలన్‌గా మెప్పించాడు. అంతకుముందు పలు ఓటీటీ సిరీస్‌లు, సినిమాలతో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నవీన్ చంద్ర సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌లోనే ఓటీటీ రిలీజ్ అవడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే
నవీన్ చంద్ర డిఫరెంట్ థ్రిల్లర్స్ జోనర్లలో నటించిన లెవెన్, బ్లైండ్ స్పాట్, 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమాలతోపాటు ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్‌లన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


