సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్- వరలక్ష్మితో నవీన్ చంద్ర పోలీస్ కంప్లెయింట్- చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ కాన్సెప్ట్
హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ పోలీస్ కంప్లెయింట్. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను చైన్ రియాక్షన్ ఆఫర్ కర్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్‌తో రానున్న పోలీస్ కంప్లెయింట్ వివరాలు చూద్దాం.
గ్లామర్ పాత్రలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గానూ పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసే క్యారెక్టర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘పోలీస్ కంప్లెయింట్’.

పవర్‌ఫుల్ పాత్రలో
డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన పోలీస్ కంప్లెయింట్ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో వరలక్ష్మి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని నిర్మాతలు తెలిపారు.
సినిమాకే హైలెట్‌గా కృష్ణ స్పెషల్ సాంగ్
అలాగే, సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఎమ్ఎస్‌కే ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహరాణా నిర్మిస్తున్నారు.
సంజీవ్ మేగోటి సినిమాలు
అఘోర (తెలుగు–తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మరో అట్రాక్షన్ అని నిర్మాతలు చెబుతున్నారు.
ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో
పోలీస్ కంప్లెయింట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’ సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం" అని తెలిపారు.
అప్పుడే విడుదలకు సన్నాహాలు
"చిత్ర యూనిట్ అందరి సపోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం. సినిమా అవుట్‌ఫుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగానే విడుదలకు సన్నాహాలు చేస్తాము" అని డైరెక్టర్ సంజీవ్ మేగోటి వెల్లడించారు.
పోలీస్ కంప్లెయింట్ ముఖ్య పాత్రలు
ఇకపోతే హారర్ థ్రిల్లర్ మూవీ పోలీస్ కంప్లెయింట్‌లో నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్ కుమార్‌తోపాటు కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, అమిత్, దిల్ రమేష్, యానిమల్ ఫేమ్ పృథ్వీ బబ్లూతదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతి
వీరితోపాటు , రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, జబర్దస్త్ నవీన్, బేబీ తనస్వి (పొట్టేలు ఫేమ్), కృతి వర్మ, సత్తన్న, దేవి శ్రీ ప్రభు, ప్రీతి సుందర్, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, అనిల్ రాజ్, విజయ భాస్కర్ నటించారు. ‘పోలిస్ కంప్లెయింట్’ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని అందించబోతోందని చిత్రయూనిట్ చెబుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












