కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన డ్రింకర్ సాయి హీరో ధర్మ మహేష్.. కొడుకుపై ప్రేమతో 'జిస్మత్ జైలు మండి' పుట్టిందంటూ ఎమోషనల్!
సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో ఆకట్టుకున్న హీరో ధర్మ మహేష్. ఇటీవల పర్సనల్ ఇష్యూలతో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాడు. అయితే, హీరో ధర్మ మహేష్ తాజాగా అమీర్‌పీట్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. తన కొడుకుపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుంచి జిస్మత్ జైలు మండి పుట్టిందంటూ ఎమోషనల్ అయ్యాడు ధర్మ మహేష్.
సినిమాలతో అలరించే హీరో, హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతుంటారు. ఇది సినీ ఇండస్ట్రీలో చాలా సాధారణంగా జరిగే విషయమని తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు చూసుకుంటున్నారు.

గామా బెస్ట్ డెబ్యూ అవార్డ్
అలా తెలుగులో సినిమాలతోపాటు రెస్టారెంట్స్‌ను నిర్వహిస్తున్న యంగ్ హీరో ధర్మ మహేష్. సింధూరం సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధర్మ మహేష్ ఇటీవల డ్రింకర్ సాయి మూవీతో అలరించాడు. సింధూరం సినిమాకు గామా బెస్ట్ డెబ్యూ అవార్డ్ కూడా అందుకున్నాడు ధర్మ మహేష్.
అయితే, ధర్మ మహేష్ తాజాగా కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. నాన్‌వెజ్ ఇష్టపడే వారిలో మండి కూడా ఒక ఫేవరెట్ ఐటమ్. అలాంటి మండి ప్రియుల కోసం వైవిధ్యమైన రుచులను అందించేందుకే 'జిస్మత్' అధినేత, హీరో ధర్మ మహేష్ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
కొడుకు పుట్టినరోజు సందర్భంగా
అమీర్‌పేట్‌లో 'జిస్మత్ జైల్ మండి' పేరుతో ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌ను ధర్మ మహేష్ తనయుడు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మండీ అనగానే భోజన ప్రియులకు 'జిస్మత్' ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామని ధర్మ మహేష్ తెలిపారు.
అందుకే మెనూలో నిరంతరం కొత్తదనాన్ని అందిస్తూ, చికెన్, మటన్, చేపలు, పన్నీర్ వంటి శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ అత్యుత్తమ రుచులను అందుబాటులో ఉంచుతున్నామని హీరో వివరించారు.
కొడుకుపై ప్రేమకు ప్రతిరూపంగా 'జిస్మత్'
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ.. "జిస్మత్ రెస్టారెంట్ నా కుమారుడు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుంచి పుట్టింది. ప్రస్తుతం 'Gismat' నుంచి 'Jismat'కు బ్రాండ్‌ను మార్చడం వెనుక నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను ఇది సూచిస్తుంది" అని ఎమోషనల్ అయ్యాడు.
ఈ పరివర్తన కేవలం పేరు మార్పు మాత్రమే కాదని, దీనికి మరింత లోతైన భావోద్వేగ బంధం ఉందని ధర్మ మహేష్ వివరించారు. ధర్మ మహేష్ కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నారు హీరో. అంటే తన కొడుకు కోసం బిజినెస్ మొత్తం జగద్వాజ పేరు మీదకు మార్చనున్నారు.
కేవలం పర్యవేక్షకుడిగా
అయితే, ఈ యాజమాన్యం బదిలీ పూర్తయ్యే వరకు, ఆయన కార్యకలాపాలు, విస్తరణను ధర్మ మహేష్ కేవలం పర్యవేక్షులుగా ఉంటారు. "ఇక్కడ వడ్డించే ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మేము అందించే రుచి, నాణ్యత మరియు ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి" అని ధర్మ మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే దశాబ్దాల పాటు ఈ పరిణామం బ్రాండ్‌ను మరింత బలోపేతం చేస్తుందని హీరో ధర్మ మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన రెస్టారెంట్స్ అన్నింటిని కొడుకు పేరు మీదకు మార్చి కేవలం సినిమాలపైనే ధర్మ మహేష్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


