ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు, రవితేజ కాలి, చేతులకు గాయాలయ్యాయి.. మాస్ జాతర డైరెక్టర్ భాను బోగవరపు కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాతో డైరెక్టర్‌గా భాను బోగవరపు పరిచయం అయ్యారు. ఇవాళ (అక్టోబర్ 31) థియేటర్లలో మాస్ జాతర సినిమా రిలీజ్ అయింది. మాస్ జాతర రిలీజ్‌కు ముందు నిర్వహించిన మీడియా ప్రెస్ మీట్‌లో దర్శకుడు భాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 31, 2025, 16:17:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల మరోసారి జంటగా నటించిన సినిమా మాస్ జాతర. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా వచ్చిన మాస్ జాతరను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు, రవితేజ కాలి, చేతులకు గాయాలయ్యాయి.. మాస్ జాతర డైరెక్టర్ భాను బోగవరపు కామెంట్స్
ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు, రవితేజ కాలి, చేతులకు గాయాలయ్యాయి.. మాస్ జాతర డైరెక్టర్ భాను బోగవరపు కామెంట్స్

ఇవాళ రిలీజ్

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇవాళ అంటే అక్టోబర్ 31న థియేటర్లలో మాస్ జాతర సినిమా విడుదలైంది. అయితే, మాస్ జాతర రిలీజ్‌కు ముందు మీడియాతో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

మాస్ జాతర ట్రైలర్‌లో రవితేజ గారి వెంకీ, ఇడియట్ సినిమాల రిఫరెన్స్‌లు కనిపించడానికి కారణం?

-రవితేజ గారి ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిఫరెన్స్‌లు పెట్టడం జరిగింది. అలా అని అవి కథకి అడ్డుగా ఉండవు. అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి.

మిగతా పాత్రల గురించి?

-రవితేజ గారితో పాటు శ్రీలీల గారు, నవీన్ చంద్ర గారు, రాజేంద్రప్రసాద్ గారు ఇలా అందరి పాత్రలు బాగుంటాయి. అన్ని పాత్రల మధ్య డ్రామా చక్కగా కుదిరింది. అందుకే రాజేంద్రప్రసాద్ గారితో సహా.. ఈ సినిమా ఫలితంపై అందరూ అంత నమ్మకంగా ఉన్నారు.

భీమ్స్ గారి సంగీతం గురించి?

-భీమ్స్ గారి పేరుని రవితేజ గారు సూచించారు. వారి కాంబినేషన్‌లో ధమాకా లాంటి చార్ట్ బస్టర్ వచ్చింది. అందుకే నేను కూడా భీమ్స్ గారు సంగీత దర్శకుడు అయితే బాగుంటుంది అనుకున్నాను. 'తు మేరా లవర్' అంటూ ఆయన స్వరపరిచిన మొదటి గీతమే నాకు ఎంతగానో నచ్చింది.

యాక్షన్ సీన్స్ గురించి?

-యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ గారు ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ గారి సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.

నిర్మాత నాగవంశీ గారి గురించి?

-దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నాగవంశీ గారు ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.

మాస్ జాతర గురించి ప్రేక్షకులకు ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు?

-రవితేజ గారి సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటూనే 'మాస్ జాతర' చిత్రం కొత్తగా ఉంటుంది. హాస్య సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించాము.

తదుపరి ప్రాజెక్ట్‌లు?

-రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More