రవితేజ 75వ సినిమా అని ముందు తెలియదు.. ఆ పాత్ర కోసం వేరే ఇద్దరు ముగ్గురిని అనుకున్నాం: మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మాస్ జాతర. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. మాస్ జాతర అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Oct 30, 2025, 11:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.

రవితేజ 75వ సినిమా అని ముందు తెలియదు.. ఆ పాత్ర కోసం వేరే ఇద్దరు ముగ్గురిని అనుకున్నాం: మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరపు
రవితేజ 75వ సినిమా అని ముందు తెలియదు.. ఆ పాత్ర కోసం వేరే ఇద్దరు ముగ్గురిని అనుకున్నాం: మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరపు

దర్శకుడిగా పరిచయం

తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

మాస్ జాతర ఎలా ఉండబోతుంది? ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?

-ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.

-'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్‌ప్రైజ్‌లు చూడబోతున్నారు.

ఏదైనా ప్రేరణతో ఈ రైల్వే పోలీస్ కథను రాసుకున్నారా?

-ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.

రవితేజ గారి 75వ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?

-ఇది రవితేజ గారి 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజ గారికి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.

నవీన్ చంద్ర గారి పాత్ర గురించి?

-నవీన్ చంద్ర గారు శివుడు అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాము. కానీ, సంతృప్తి లేదు. అలాంటి సమయంలో నవీన్ చంద్ర గారిని కలిసి కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు.

-నవీన్ గారు గొప్ప నటుడు. అందులో సందేహం లేదు. అయితే ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేయడం జరిగింది. ఆ లుక్ నిర్మాత నాగవంశీ గారితో సహా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More