దివాళి క్రాకర్స్‌పై నిర్మాత నాగవంశీ, మీనాక్షి చౌదరి ఫొటోలు.. డిఫరెంట్‌గా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు స్పెషల్ ప్రోమో
జాతి రత్నాలు సినిమాతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసిన అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా స్పెషల్‌గా అనగనగా ఒక రాజు ప్రోమోను రిలీజ్ చేశారు.
తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి మరో సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు. నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా 'అనగనగా ఒక రాజు'.

అనగనగా ఒక రాజు దివాళి ప్రోమో
తాజాగా ఈ చిత్రం నుంచి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్‌ను కూడా ఈ ప్రోమో ద్వారా ప్రకటించారు.
2026 సంక్రాంతికి రిలీజ్
2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ప్రోమోలో హీరో నవీన్ పొలిశెట్టి క్రాకర్స్ అమ్ముతూ కనిపిస్తాడు. షాప్‌లో ఎలాంటి క్రాకర్స్ ఉన్నాయో చెబుతు హాస్యం పండిస్తాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, మోదీ ప్రస్తావన వస్తుంది. అదంతా చాలా కామెడీగా ఉంటుంది.
నిర్మాత నాగవంశీ ఫొటో
అలాగే, అందులో చూపించే దివాళి క్రాకర్స్ బాక్స్‌పై నిర్మాత నాగవంశీ ఫొటో కనిపించి ఆకట్టుకుంటుంది. నాగవంశీ ధమాకా అనే టైటిల్‌తో ఆ క్రాకర్స్ ఉన్నాయి. అలాగే, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫొటో కూడా ఉంది. మీనాక్షి చౌదరి ఫొటో ఉండి దానిపై పటాకా అని రాసి ఉంది.
నవీన్ పొలిశెట్టి కామెడీ
వీటితోపాటు నవీన్ పొలిశెట్టి అద్భుతమైన హాస్య చతురత, అప్రయత్నమైన ఆకర్షణ ప్రతి ఫ్రేమ్‌లో ప్రకాశించింది. తెరపై నవీన్ ఉత్సాహంగా కనిపించిన తీరు కట్టిపడేసింది. ఈ దీపావళి ప్రోమో వినోదాల విందులా ఉంది. నవీన్ పొలిశెట్టి శైలి హాస్యాన్ని ప్రేక్షకులు ఎందుకు అంతలా ఇష్టపడతారో ఈ ప్రోమో మరోసారి గుర్తుచేసింది.
2 నిమిషాల నిడివితో ప్రోమో
రెండు నిమిషాల నిడివితో రూపొందిన ఈ దీపావళి అనగనగా ఒక రాజు ప్రోమో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అభిమానులు దీనిని "ఒక నవ్వుల అల్లరి", "వినోదాల విందు", "అసలైన పండుగ సినిమా" అని పిలుస్తున్నారు.
మరింత ఉత్సహాన్ని పెంచుతూ
ఇదే కాకుండా ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ అనగనగా ఒక రాజు సినిమా నుంచి మొదటి సాంగ్‌ను త్వరలో విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
దర్శకుడిగా మారి పరిచయం
ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. ఈ చిత్రానికి జె యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


