హై రేంజ్ ఎలివేషన్, ఆఖరికి కామెడీతో ఎండ్, థ్రిల్లింగ్ ట్విస్ట్- సంగీత్ శోభన్ రాకాస గ్లింప్స్ రిలీజ్-నవ్విస్తూ భయపెట్టేలా!
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా చేస్తున్న సినిమా రాకాస. కామెడీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ (జనవరి 23) రాకాస గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీతో పాటు థ్రిల్లింగ్‌గా రాకాస గ్లింప్స్ సాగింది.
సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’.

సోలో హీరగా సంగీత్ శోభన్
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంతో మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రానున్నాడు. హారర్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు.
రాకాస సినిమాను ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రాకాస టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిన విషయమే. ఇక తాజాగా ఇవాళ (జనవరి 23) ‘రాకాస’ గ్లింప్స్ వదిలి అందరిలోనూ చిత్రం మీద ఆసక్తిని రేకెత్తించారు.
వీరుడు ఎవరో తెలిసేలోపు
‘యుగయుగాలుగా ప్రతీ కథలో ఒక సమస్య.. ఆ సమస్యను ఛేదించడానికి ఓ వీరుడు పుడతాడు.. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా పని ముగిస్తాడు.. ఈ కథలో ఆ వీరుడు నేనే’ అంటూ సంగీత్ శోభన్ గురించి ఓ రేంజ్ లెవెల్ ఎలివేషన్ ఇస్తూ రాకాస గ్లింప్స్ సాగింది.
అయితే ఆ తరువాత ఒక్కసారిగా అది కామెడీ, సెటైరికల్ టర్న్ ఇచ్చుకుంది. మరోవైపు పక్కనే అన్ని ఎముకల గూడులు ఉండి కామెడీతోపాటు భయపెట్టేలా ఉంది. గ్లింప్స్ చివరిలో ఓ ఆయుధం సంగీత్ శోభన్ వైపు వచ్చే ట్విస్ట్ ఉత్కంఠను క్రియేట్ చేసింది.
కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఇందులో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మళ్లీ మెప్పిస్తాడని, అందరినీ ఆకట్టుకుంటాడని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు. రాకాస సినిమాను కామెడీతో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భయపెడతారని తెలుస్తోంది.
ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కథతోనే మరో ప్రయోగం చేస్తున్నట్టుగా రాకాస గ్లింప్స్ చెబుతోంది. ఇక ఇందులో సంగీత్ శోభన్ తనలోని మరో కోణాన్ని చూపించేలా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కామెడీనే ప్రధాన బలం అని ఈ గ్లింప్స్ చెప్పకనే చెబుతోంది.
రాకాస నటీనటులు, సాంకేతిక వర్గం
కామెడీతో పాటుగా ఓ కొత్త పాయింట్‌ను, కొత్తదనాన్ని చూపించేలా కనిపిస్తోంది. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
కాగా, రాకాస సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ అమ్మ, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












