OTT Horror Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్- 8.1 రేటింగ్- బండ భూతానికి బలయ్యే ఊరు!

OTT Horror Telugu Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.1 రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ మూవీలోని హీరో హిట్ కొట్టాడు. మరి బండ భూతానికి బలయ్యే ఊరు కథతో వచ్చిన ఆ మూవీ ఏంటో చూద్దాం.

Jan 22, 2026, 12:12:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో ప్రతి వారం డిఫరెంట్ జోనర్లతో వివిధ భాషల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తుంటాయి. అయితే, వీటిలో ఏపీ, తెలంగాణ ఓటీటీ ఆడియెన్స్ మాత్రం తెలుగు సినిమాలు కోసం ఎదురుచూస్తుంటారు. ఇందులోనూ హారర్ థ్రిల్లర్ జోనర్స్‌లో వచ్చే సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్- 8.1 రేటింగ్- బండ భూతానికి బలయ్యే ఊరు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్- 8.1 రేటింగ్- బండ భూతానికి బలయ్యే ఊరు!

ఓటీటీలో మాత్రం

ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్లలో ఎలాంటి టాక్ తెచ్చుకున్న కానీ ఓటీటీలో మాత్రం విడిచిపెట్టకుండా చూస్తున్నారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తుందంటే చాలు అమితమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.

ఆది సాయి కుమార్ హిట్ మూవీ

ఓటీటీ హారర్ థ్రిల్లర్ లవర్స్ కోసమే ఇవాళ ఓ సినిమా వచ్చేసింది. ఆ మూవీనే శంబాల. చాలా కాలం తర్వాత ఆది సాయి కుమార్ హిట్ కొట్టిన సినిమా ఇది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలోని హారర్ ఎలిమెంట్స్‌కు ఆడియెన్స్ అట్రాక్ట్ అయ్యారు.

8.1 ఐఎమ్‌డీబీ రేటింగ్

ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి ఏకంగా 8.1 రేటింగ్ కూడా సాధించుకుంది శంబాల మూవీ. అయితే, బాక్సాఫీస్ పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది శంబాల. ఈ మూవీకి ప్రశంసలు వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో కలెక్షన్స్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

శంబాల కలెక్షన్స్

రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన శంబాల సినిమాకు వరల్డ్ వైడ్‌గా 20.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, ఇండియాలో రూ. 14.94 నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అంటే ఈ లెక్కన బడ్జెట్‌కు కాస్తా మించి దాదాపుగా హిట్ టాక్ తెచ్చుకుంది శంబాల మూవీ.

బండ భూతానికి బలయ్యే ఊరు

ఇకపోతే శంబాల కథ 80వ దశకంలో జరుగుతుంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న శంబాల గ్రామంలో ఓ ఉల్క పడటంతో అక్కడ పరిస్థితులన్నీ మారుతాయి. ఊరి జనం హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడంతో ఊరికి బండ భూతం పట్టిందని జనం అనుకుంటారు. వరుసగా మనుషులు చస్తూ బండ భూతానికి ఊరంతా బలి అవుతూ ఉంటుంది.

బండ భూతం నేపథ్యం

ఈ క్రమంలోనే ఉల్కని పరిశోధించేందుకు ప్రభుత్వం పంపడంతో వచ్చిన విక్రమ్ (ఆది సాయి కుమార్) ఏం తెలుసుకున్నాడు, సైన్స్‌కు మూఢ నమ్మకాలకు ఉన్న డిఫరెన్స్ ఎలా చూపించాడు, గ్రామంలోని హత్యలు, ఆత్మహత్యలను ఎలా ఆపగలిగాడు, అసలు బండ భూతం నేపథ్యం ఏంటీ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో శంబాల తెరకెక్కింది.

శంబాల ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి శంబాల ఓటీటీలోకి ఇవాళ (జనవరి 22) వచ్చేసింది. జనవరి 22 నుంచి ఆహాలో శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన శంబాలపై ఎంచక్కా లుక్కేయవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More