లేచిపోదామన్న మగాడా! అమల నుంచి ఐశ్వర్య రాయ్ దాకా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన మరో హీరోయిన్- రోహిణి భర్త ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, సింగర్‌గా అలరించారు సీనియర్ నటి రోహిణి. లేచిపోదామన్న మగాడ అనే డైలాగ్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటి రోహిణి భర్త, ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇక్కడ ఓ లుక్కేద్దాం.

Published on: Jan 13, 2026, 14:30:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినీ ఇండస్ట్రీలో కేవలం నటనకు మాత్రమే పరిమితం కానీ నటీనటులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరే రోహిణి మొల్లెటి. ఐదేళ్లకు తెలుగు చిత్రసీమలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి హీరోయిన్‌గా నటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.

లేచిపోదామన్న మగాడా! అమల నుంచి ఐశ్వర్య రాయ్ దాకా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన మరో హీరోయిన్- రోహిణి భర్త ఎవరో తెలుసా?
లేచిపోదామన్న మగాడా! అమల నుంచి ఐశ్వర్య రాయ్ దాకా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన మరో హీరోయిన్- రోహిణి భర్త ఎవరో తెలుసా?

అనాకపల్లిలో జననం

ఆంధ్రప్రదేశ్‌లోని అనాకపల్లిలో జన్మించిన రోహిణి 1974 నుంచి ఇప్పటి వరకు వెండితెరపై నటిగా రాణిస్తున్నారు. కేవలం నటిగానే కాకుండా రోహిణి ఇదివరకు హీరోయిన్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, సింగర్‌గా కూడా వర్క్ చేశారు.

1995లో వచ్చిన స్త్రీ అనే సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ మెన్షన్) అందుకున్న రోహిణి ఉత్తమ నటనకు గానూ స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా తీసుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ నటిగా 2017లో వనిత ఫిల్మ్స్ అవార్డ్, సీపీసీ అవార్డ్స్ గెలుచుకున్నారు రోహిణి. ఎక్కువగా తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన రోహిణి కన్నడలో కూడా యాక్ట్ చేశారు.

130 సినిమాల్లో నటిగా

సౌత్ సినిమాలన్నీ కలిపి దాదాపుగా 130 చిత్రాల్లో నటించారు రోహిణి. ఇష్క్ మూవీలో నితిన్‌కు ఆంటీగా, 3 చిత్రంలో శ్రుతి హాసన్‌కు, కోర్ట్ మూవీలో హీరోయిన్‌ శ్రీదేవి అపల్లకు తల్లిగా, పలు సినిమాల్లో హీరోకు తల్లిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇంకా వాయిస్ ఇస్తున్నారు రోహిణి. పాపులర్ పీరియాడిక్ ఓటీటీ సిరీస్ హీరామండిలో మనీషా కోయిరాల పాత్రకు రోహిణినే డబ్బింగ్ చెప్పారు. మణిరత్నం గీతాంజలి సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి 'లేచిపోదామన్న మగాడా' అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.

నాగార్జునతో చెప్పే డైలాగ్

గీతాంజలి సినిమాలో హీరో నాగార్జునతో హీరోయిన్ చెప్పే ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయింది. అలా తన వాయిస్‌తో హీరోయిన్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన రోహిణి ఫేమస్ అయింది. ఆ తర్వాత శివ సినిమాలో అమలకు పట్టుబట్టి మరి రోహిణితో డబ్బింగ్ చెప్పారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.

శివ సినిమా చూసిన తర్వాత డబ్బింగ్ చెబుతానని, మూవీ చూశాక ఓకే చెప్పానని, అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక కొత్త డైరెక్టర్ మాత్రమే అని, ఆ తర్వాతే ఆయన ఆర్జీవీ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో రోహిణి చెప్పారు. అంతేకాకుండా శివ సినిమాలో విలన్‌ భవాని పాత్రతో క్రేజ్ తెచ్చుకున్న రఘువరన్ రోహిణి భర్త కావడం విశేషం.

2004లో విడాకులు- హీరోయిన్స్ లిస్ట్

1996లో నటుడు రఘువరన్‌ను వివాహం చేసుకున్న రోహిణికి రిషి అనే కుమారుడు ఉన్నారు. అనంతరం 2004లో రఘువరన్‌తో రోహిణికి విడాకులు అయ్యాయి. అయితే, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది స్టార్ హీరోయిన్స్‌కు రోహిణి వాయిస్ ఇచ్చారు. వాటిలో ఐదు సినిమాలు ఒక్క మణిరత్నం డైరెక్ట్ చేసిన మూవీస్ కావడం విశేషం.

గీతాంజలిలోని గిరీజా శెట్టర్, శివలో అమల నుంచి రేవతి, నిరోషా, ఆర్కే రోజా, శోభన, మధుబాల, నగ్మా, రంజిత, గౌతమి, ఇంద్రజ, రంభ, కీర్తి రెడ్డి, టబు, మీరా జాస్మిన్, జ్యోతిక, ఆండ్రియా, శ్రియా రెడ్డితోపాటు హిందీ హీరోయిన్స్ జూహీ చావ్లా, ఊర్మిల, సొనాలి కులకర్ణి, మనీషా కోయిరాల, పూజా భట్, శిల్పా శెట్టి, ఐశ్వర్య రాయ్ వరకు ఎంతోమంది నటీమణులకు రోహిణి డబ్బింగ్ చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More