గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలును రెచ్చగొట్టిన మీనా- రోహిణి ప్రభావతికి మనోజ్ సర్‌ప్రైజ్- తండ్రికి మాత్రం తుండు

గుండె నిండా గుడి గంటలు జనవరి 13 ఎపిసోడ్‌లో పిల్లల కోసం బాలును అందంతో రెచ్చగొడుతుంది మీనా. డాబాపై ఇద్దరు రొమాంటిక్‌గా పడుకుంటారు. రోహిణి, ప్రభావతికి గిఫ్ట్స్ తీసుకొచ్చి సర్‌ప్రైజ్ ఇస్తాడు మనోజ్. తనకు రూ. 51 వేల వాచ్ తీసుకుని తండ్రికి మాత్రం తుండు కొంటాడు మనోజ్. దానికి బాలు కోప్పడుతాడు.

Published on: Jan 13, 2026, 07:59:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లికి ముందు రోహిణి గతం మనకు తెలియదు. నువ్వు అన్ని దాంతో చెప్పావ్. కానీ, అది అన్నీ నీతో చెప్పిందని గ్యారెంటీ ఏంటీ. అన్ని వైపుల ఆలోచించు. తను నీ దగ్గర ఏదో దాస్తుందని అనిపిస్తుంది. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో అని ప్రభావతి సలహా ఇచ్చి వెళ్లిపోతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 13 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 13 ఎపిసోడ్‌

బాలు చిరాకు

మరోవైపు బాలు డబ్బు లెక్కపెడుతుంటాడు. మీనా వస్తుంది. రాత్రి అయింది, చల్లగాలి వస్తోంది అని రొమాంటిక్‌గా అడుగుతుంది మీనా. కానీ, బాలు ఏంటీ గోల అని చిరాకు పడతాడు. రోహిణి పిల్లల కోసం పరీక్ష చేసుకుంది కదా. మనకు వాళ్లకంటే ముందు పెళ్లి అయిందిగా. మనకేగా ముందు పిల్లలు పుట్టాలి అని మీనా అంటుంది.

దానికి షాక్ అయిన బాలు పిల్లలు అంటే డైపర్స్ వాటికే డబ్బు అయిపోతుంది. వద్దని బాలు అంటాడు. దాంతో మీనా వెనక్కి తిరిగి మల్లెపూలతో, అందంతో రెచ్చగొడుతుంది. దాంతో బాలు టెంప్ట్ అయిపోతాడు. ఇక నన్ను ఏ ఈఎమ్ఐ ఆపలేదు అని మీనా వెంట పడతాడు. మీనాను వెనుక నుంచి హగ్ చేసుకుంటాడు. డాబాపై మీనా, బాలు రొమాన్స్ చేసుకుంటారు.

మరుసటి రోజు ఉదయం సత్యం, బాలు మాట్లాడుకుంటారు. ఇంతలో మనోజ్ వచ్చి షాపింగ్ చేశానని, గురూజీ ఆశీర్వాదం అంటాడు. ఇందులో నీ పుస్తెలు ఉన్నాయి. విడిపించి తీసుకొచ్చాను. మాటిచ్చినట్లు తీసుకొచ్చాను అని మనోజ్ అంటాడు. దానికి రోహిణి, ప్రభావతి సంతోషంతో ఆశ్చర్యపోతారు. రోహిణి మెడలో నీ చేత్తో వేయమని ప్రభావతిని అంటాడు మనోజ్.

నీ చేత్తోనే వేయాలిరా

దాంతో అంతా నవ్వుతారు. అది నీ చేత్తోనే వేయాలిరా అని ప్రభావతి అంటుంది. వీడి వాలకం చూస్తుంటే ఎక్కడో ఏదో మింగినట్లు అనిపిస్తుందని బాలు మీనాతో అంటాడు. సైలెంట్‌గా ఉండమని మీనా చెబుతుంది. రోహిణి మెడలో తాళి వేస్తాడు మనోజ్. మొదటిసారి పోగొట్టుకోవడం కాకుండా నీ భార్యకు బంగారం తీసుకొచ్చావ్. ఇలాగే ఎదుగు అని సత్యం అంటాడు.

తర్వాత ప్రభావతి కోసం పట్టుచీర తీసుకొచ్చినట్లు మనోజ్ ఇస్తాడు. ఇది పాతికవేలు ఉంటుందా అని ప్రభావతి అంటే అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు అమ్మ అని మనోజ్ అంటాడు. నీ లెవెల్‌కు తక్కువ తీసుకోవుగా అని ప్రభావతి అంటుంది. మరి నాన్న కోసం ఏం తేలేదా అని బాలు అంటే.. వాచ్ చూపిస్తాడు. నాన్న రిటైర్ అయిపోయారుగా వాచ్‌తో ఏం చేసుకుంటారు అని ప్రభావతి అంటుంది.

ఇప్పుడు నాకెందుకురా వాచ్ అని సత్యం అంటే.. అందుకే నీకు తీసుకురాలేదు నాన్న ఇది నాకోసం అంటాడు మనోజ్. అంతా అవాక్కవుతారు. ఆ వాచ్ ఖరీదు 51 వేలు అని మనోజ్ చెబుతాడు. దాంతో అంతా ఆశ్చర్యపోతారు. మరి మావయ్య కోసం ఏం తేలేదా అని రోహిణి అడుగుతుంది. దాంతో టవల్ తీసి ఇస్తాడు. అందరికేమో అంత ఖరీదైనవి తీసుకొచ్చి నాన్నకు మాత్రం 50 రూపాయల తుండు తీసుకొస్తావా అని బాలు కోప్పడుతాడు.

ఏడవడం కాదు

అన్నింట్లో ఎందుకు తప్పు వెతుకుతావ్. ముందు మీనాకు పుస్తెల తాడు చేయించు. మనోజ్ మీద పడి ఏడవటం కాదు అని రోహిణి అంటుంది. అన్నో.. అన్నో.. మనోజ్ అన్నా.. అని చనిపోయినట్లుగా మనోజ్ మీద పడి ఏడుస్తాడు బాలు. రేయ్ మీరు వెళ్లండి అని రోహిణి, మనోజ్‌ను పంపిస్తుంది ప్రభావతి. నాకు చాలా సంతోషంగా ఉంది. బాలు మొహం వాడిపోయిందని రోహిణి, మనోజ్ అనుకుంటారు. రోహిణి, ప్రభావతికి మనోజ్ సర్‌ప్రైజ్ చేయడం గురించి మాట్లాడుకుంటారు.

తర్వాత ఈ వస్తువులకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుందిగా. ఎక్కడిదా డబ్బు అని రోహిణి అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఈరోజే వచ్చింది. క్రెడిట్ కార్డ్‌తో కొన్నా. మన వాల్యూ, హంగామా ఏంటో తెలియాలిగా అని మనోజ్ అంటాడు. ముందు కొనేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత ఇంట్రెస్ట్‌తో కట్టాలి అని రోహిణి హెచ్చరిస్తుంది. నేను చూసుకుంటా. ప్రతి నెల కొంచెం కొంచెం కట్టొచ్చు అని మనోజ్ అంటాడు.

దాంతో ఒక్కసారిగా డల్ అయిపోతుంది రోహిణి. నేను తప్పు చేశానా. సారీ రోహిణి అని మనోజ్ ఫీల్ అవుతాడు. అనవసరంగా ఈయన్ను బాధపెట్టానా. ఏదైనా నాకోసమేగా అనుకున్న రోహిణి తప్పేం చేయలేదు అని కూల్ చేస్తుంది. మంగళసూత్రం తీసుకురావడంపై రోహిణి సంతోషంగా ఉంటుంది. ఇంతలో రోహిణి చేయి ముద్దు పెట్టుకుంటాడు మనోజ్.

డబ్బుల కోసం గుణ

మరోవైపు బాబురావు ఇంటికి గుణ, శివ వెళ్లి డబ్బుల గురించి అడుగుతారు. బాబురావు ఉండడు. దాంతో బాబురావుకు భార్య గుణ వచ్చినట్లు చెబుతుంది. దాంతో బాబురావు బాలు కారులో ఇంటికి వస్తాడు. కంగారులో బ్యాగ్ మర్చిపోతాడు బాబురావు. దాంతో ఆ బ్యాగ్ ఇవ్వడానికి బాబురావు ఇంట్లోకి వెళ్తాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More