గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు ఇంటికి 4 లక్షలు- ప్రభావతి నగలు తాకట్టు- భర్త వల్లే పందెంలో ఓడిపోయిన మీనా!

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 31 ఎపిసోడ్‌లో ఇంటికి మేస్త్రీని తీసుకొస్తాడు బాలు. మొత్తం కొలతలు చూసి నాలుగు లక్షలు అవుతుందని, మొత్తం ఒకేసారి ఇస్తే పని త్వరగా అవుతుందని చెబుతాడు. డబ్బు కోసం తల్లి ప్రభావతి నగలు తాకట్టు పెడదామని బాలు చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అయిపోతుంది.

Published on: Dec 31, 2025, 09:17:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట మీనాపై పడిపోతుంటాడు బాలు. మీనా ఆపుతుంది. ఇంతకుముందు వాడు ఎలా ఉండేవాడు. అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడు అని బాలు అంటాడు. మీకు అన్ని దుర్గుణాలు లేవు. తాగేవారు. దాంతో గొడవ పడేవారు. అది లేకుంటే అని మీనా అంటే.. అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడిని. ఏం లేదంటూనే అన్ని అన్నావుగా అని మీనాకు చక్కిలిగింతలు పెడతాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 31 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 31 ఎపిసోడ్‌

మేస్త్రీని మాట్లాడుకుందాం

మావయ్య సంతోషించేలా ఉండాలి. రూమ్ కట్టుకుందామండి. ఇంజినీర్ వద్దు మేస్త్రీని మాట్లాడుకుందామని మీనా అంటుంది. అప్పుడు మనం మన రూమ్‌లో అని ఇద్దరు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తుంటారు. ఇంతలో ప్రభావతి వచ్చి చూస్తుంది. మీనా ఆగిపోతుంది. బాలు కూడా ఆగిపోతాడు. ఊకే ఇలా విజిల్ ఊదుకుంటూ వస్తే మాకు కాళరాత్రి తప్పా ఇంకేం మిగులుతుంది అని బాలు అంటే.. ప్రభావతి కోపంగా వెళ్తుంది.

మరుసటి రోజు ఉదయం మేస్త్రీని తీసుకొస్తాడు బాలు. పైన బాలు చూపిస్తాడు. అదంతా దొంగతనంగా చూస్తుంది ప్రభావతి. మొత్తం కొలతలు తీసుకున్న మేస్త్రీ నాలుగు లక్షల దాకా అవుతుంది. పాతికేవలు అటు ఇటు కావచ్చు అని చెబుతాడు. అడ్వాన్స్ లక్ష ఇస్తాను. మిగిలింది కొద్దికొద్దిగా ఇస్తానని బాలు అంటే.. అలా కుదరదు, మెటీరియల్ అంతా ఒకేసారి కొనాలి. దానికే మూడు లక్షలు అవుతుందని మేస్త్రీ చెబుతాడు.

డబ్బు మొత్తం చేతిలో ఉంటే పని త్వరగా అయిపోతుంది అని మేస్త్రీ అంటే.. బాలు అడ్వాన్స్‌గా కొంత ఇస్తాడు. ఇప్పుడు డబ్బు ఎలా అని మీనా అంటే.. ఉందిగా మా అమ్మ. మా నాన్న మాట్లాడి ఆవిడ నగలన్నీ తెచ్చి ఇస్తాడు అని బాలు అంటాడు. అత్తయ్య నగలు తాకట్టు పెడతారా అని మీనా అంటే.. సరిపోకపోతే అమ్మేస్తాం. మనోజ్ గాడు చేసినట్లు అని బాలు అంటాడు.

మీనాకు పొగడ్తలు

ఆ మాటలు విని భయపడి వెళ్లిపోతుంది. అమ్మ చూస్తుందని కావాలనే అలా అన్నాను అని బాలు అంటాడు. తర్వాత ప్రైజ్ మనీ గెలవడంపై మీనాను పొగుడుతారు చుట్టు పక్కలవాళ్లు. పెళ్లాం వంటలు బాగున్నాయని చెబుతారా భర్తలు అని మాట్లాడుకుంటారు. నేను పూరీ కుర్మా చేస్తే మా ఆయన మెచ్చుకుంటారు అని మీనా అంటుంది.

అయితే, పందెం వేసుకుందాం. బీట్ రూమ్ కుర్మా చేసి పెట్టు. మీ ఆయనకు నచ్చితే ఐదు వందలు పందెం అని చుట్టు పక్కలవాళ్లు అంటారు. సరే రెడీ అని మీనా పందెం కాస్తుంది. అలాగే మీనా బీట్ రూట్ దోశ చేస్తుంది. చాలా బాగుందని సత్యం మెచ్చుకుంటాడు. మనోజ్ తెగ మొక్కుతుంటాడు. ఇంటిల్లిపాది బీట్ రూట్ దోశ బాగుందని మెచ్చుకుంటారు.

ఫోన్‌లో బాలు కోపంగా మాట్లాడుతుంటాడు. మీనా వెళ్లి దోశ ఇస్తుంది. ట్రిప్ డబ్బులు మింగి చచ్చాడు అని కోప్పడుతూనే ఉంటాడు బాలు. అలా హడావిడిగా బాలు తినేసి ఏం చెప్పకుండా వెళ్లిపోతాడు. క్యారేజ్ కట్టియమని చెప్పి వెళ్లిపోతాడు బాలు. దాంతో ఏం చెప్పలేదని మీనా నిరాశ పడుతుంది. అలా పందెంలో మీనా ఓడిపోతుంది. మరోవైపు రోహిణి కొడుకు చింటూ బర్త్ డేను చేయమంటాడు.

చింటు బర్త్ డే

రోహిణి చేస్తానంటుంది. అమ్మమ్మ డ్రెస్ కొంటానంటే వద్దన్నాను. అమ్మ కొనిచ్చిన డ్రెస్ ఉంటే బాగుంటుందిగా. నాకు ఏం తీసుకొస్తావ్ అని షర్ట్, జీన్స్ అని బట్టల గురించి చెబుతాడు చింటూ. తీసుకొస్తాను అని రోహిణి సంతోషంగా కాల్ కట్ చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావని మనోజ్ అనుమానంగా అడుగుతాడు. క్లైంట్ పుట్టినరోజు ఉంది. వెంటనే వెళ్లాలి అని రోహిణి కవర్ చేస్తుంది.

ఈ మధ్య ఎవరిని చూసిన నమ్మబుద్ధి కావట్లేదు. వీళ్లందరిని వదిలేసి దూరంగా ఎక్కడికైనా వెళ్లేసి వద్దామా. మనం కూడా తొందరగా బేబీని కంటే బాగుంటుంది కదా అని మనోజ్ అంటాడు. సరే ప్లాన్ చేద్దాం అని రోహిణి సిగ్గుపడుతుంది. మరోవైపు మీనా పందెంలో ఓడిపోవడం గురించి అంతా అంటారు. అందరు మొగుళ్లు ఒక్కటే అని అనుకుంటారు.

మా ఆయన అలా కాదు అని మీనా అంటే.. సరే నీకు ఇంకో అవకాశం ఇస్తాం. అందులో ఓడిపోతే ఐదు వందలు తీసుకుంటాం అని పక్కింటివాళ్లు చెబుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More