గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని రోహిణిని నిలదీసిన ప్రభావతి.. ఇరికించిన బాలు, మీనా

గుండె నిండా గుడి గంటలు సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ లో బాలు, మీనా గెలవడాన్ని ప్రభావతి జీర్ణించుకోలేకపోతుంది. దీంతో మనోజ్, రోహిణిలను బాలు ఇరికిస్తాడు. అది రోహిణిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది.

Published on: Dec 29, 2025 6:51 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 585వ ఎపిసోడ్ లో బెస్ట్ కపుల్ గా బాలు, మీనా నిలుస్తారు. అది చూసి ప్రభావతితోపాటు మనోజ్, రోహిణి కుళ్లుకుంటారు. వాళ్లపై పడి ఏడుస్తారు. దీంతో బాలు తనదైన స్టైల్లో రోహిణిని అడ్డంగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని రోహిణిని నిలదీసిన ప్రభావతి.. ఇరికించిన బాలు, మీనా
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని రోహిణిని నిలదీసిన ప్రభావతి.. ఇరికించిన బాలు, మీనా

మనోజ్, రోహిణిలకు క్లాస్ పీకిన జడ్జీలు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ బెస్ట్ కపుల్ పోటీలో బాలు, మీనా చిన్న కల్లు కట్టే సీన్ తో మొదలవుతుంది. ఎందుకు అంత చిన్న ఇల్లు కట్టారని అడిగితే.. ఇంట్లో తమకు బెడ్ రూమ్ కూడా లేని విషయం చెప్పి.. ఇది తమ కలల ఇల్లు అని అంటారు.

ఆ తర్వాత విజేతను ప్రకటించే ముందు మనోజ్, రోహిణిల పేర్లు ముందుగా పిలుస్తారు. దీంతో తానే గెలిచానని మనోజ్ మురిసిపోతాడు. కానీ జడ్జీలు మాత్రం అతనికి క్లాస్ పీకుతారు. బ్రేక్ టైమ్ లో రోహిణితో మాట్లాడిన వీడియోను చూపించి పరువు తీస్తారు. దీంతో డబ్బు, పరువు రెండూ పోయాయని వాళ్లు బాధపడతారు. ఇక రవి, శృతి గురించి చెబుతూ ఇప్పటికీ మీరు లవర్స్ లాగే ఉన్నారని, అయితే భవిష్యత్తులో మంచి దంపతులు అవుతారని మెచ్చుకుంటారు.

బెస్ట్ కపుల్ బాలు, మీనా.. మెచ్చుకున్న జడ్జీలు

చివరిగా బాలు, మీనా గురించి జడ్జీలు తెగ మెచ్చుకుంటారు. మీరు ఆదర్శ దంపతుల్లాగా కనిపించారని, అన్ని లక్షణాలు మీలో ఉన్నాయని, ప్రతి మాటా మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు అనిపించిందని అంటారు. చివరిగా విజేత పేరును అనౌన్స్ చేస్తారు. మనోజ్, రోహిణి ముఖాలు వాడిపోతాయి. బాలు, మీనా వెళ్లి ప్రైజ్ మనీ అందుకుంటారు. ఇద్దరూ సంతోషంతో మురిసిపోతారు. రవి, శృతి కూడా చాలా సంతోషిస్తారు.

ఉసూరుమన్న ప్రభావతి.. ఊరేగింపుగా బాలు, మీనా

ఇటు ఇంటి దగ్గర రోహిణి, మనోజ్ గెలుస్తారన్న ఆశతో హారతి పట్టుకొని రెడీగా ఉంటుంది ప్రభావతి. కానీ తాము గెలవలేదని చెప్పడంతో ఉసూరుమంటుంది. తర్వాత రవి, శృతి వస్తారు. వాళ్లే గెలిచి ఉంటారని మరోసారి హారతి సిద్ధం చేస్తుండగా తామూ గెలవలేదని చెబుతారు. ఆ వెంటనే పార్వతి, సుమతి వస్తారు. వాళ్లను చూసి వీళ్లెందుకు వచ్చారు అని ప్రభావతి అంటుంది.

అప్పుడే బాలు, మీనా మేళతాళాలతో ఊరేగింపుగా వస్తుంటారు. అది చూసి బాలు, మీనాలే గెలిచారని పార్వతి చెబుతుంది. దీంతో ప్రభావతి ముఖం మాడిపోతుంది. రవి, శృతి కూడా వెళ్లి వాళ్లతో డ్యాన్స్ చేస్తారు. తర్వాత పార్వతి తెచ్చిన దండలను బాలు, మీనా మార్చుకుంటారు. ఇష్టం లేకపోయినా శృతి, పార్వతితో కలిసి ప్రభావతి వాళ్లకు హారతి ఇస్తుంది.

మనోజ్‌కు క్లాస్ పీకిన ప్రభావతి.. ఆట పట్టించిన బాలు

ఇంట్లోకి వెళ్లిన తర్వాత మనోజ్ కు ప్రభావతి క్లాస్ పీకుతుంది. ఇన్ని డిగ్రీలు చదివి ఏం లాభం.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదా అని నిలదీస్తుంది. భార్యాభర్తలు గొడవలు పడాలట.. తాము గొడవ పడము కాబట్టి ఇవ్వలేదని మనోజ్ అంటాడు. ముగ్గురూ కలిసి కుళ్లుకుంటున్న సమయంలో బాలు, మీనా అక్కడికి వస్తారు. బాలు వాళ్లను మరింత ఆట పట్టిస్తాడు.

వారానికోసారి వీళ్లు గొడవ పడతారని వాళ్లకు తెలియక వీళ్లను విజేతలుగా చేశారని మనోజ్ అంటాడు. అలా గొడవపడకపోతే ఇద్దరి మధ్యా ఏదో దాపరికం ఉంటుందట అని బాలు చెబుతాడు. దీంతో మనోజ్, రోహిణి ఒకరి ముఖాలు మరొకరు అనుమానంగా చూసుకుంటారు. ప్రభావతి కూడా రోహిణిని నిలదీస్తుంది. మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని అంటుంది. రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.