గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు కట్టిన బాలు, మీనా.. బెడ్‌రూమ్ లేదంటూ ఎమోషనల్.. కంటతడి పెట్టిన రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ కూడా బెస్ట్ కపుల్ ఈవెంట్ చుట్టే తిరిగింది. ఈ ఎపిసోడ్ లో ప్రభావతి డ్యాన్స్ చేయడంతో నడుము కూడా విరగ్గొట్టుకోగా.. బాలు, మీనా తమ డ్రీమ్ హౌజ్ కడతారు.

Dec 25, 2025, 07:04:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 583వ ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. బెస్ట్ కపుల్ పోటీలో గెలవడానికి సత్యం ఫ్యామిలీలోని జంటలన్నీ గట్టిగానే పోటీ పడతాయి. ఈ క్రమంలో ప్రభావతి తన నడుము విరగ్గొట్టుకోగా.. బాలు, మీనా తమ కలల ఇంటిని కట్టి జడ్జీలను భావోద్వేగానికి గురి చేస్తారు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు కట్టిన బాలు, మీనా.. బెడ్‌రూమ్ లేదంటూ ఎమోషనల్.. కంటతడి పెట్టిన రోహిణి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు కట్టిన బాలు, మీనా.. బెడ్‌రూమ్ లేదంటూ ఎమోషనల్.. కంటతడి పెట్టిన రోహిణి

స్టేజ్‌పై ప్రభావతి డ్యాన్స్.. పూలు అల్లిన మీనా

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ స్టేజ్ పై మీనా తన టాలెంట్ చూపే సీన్ తో మొదలవుతుంది. ఆమె కళ్లకు గంతలు కట్టుకొని మూడు నిమిషాల్లోనే నాలుగు మూరల పూలు అల్లుతుంది. దీంతో అందరూ ఆమెను మెచ్చుకుంటారు.

మీనాను చూసి కుళ్లకునే ప్రభావతి తన టాలెంట్ చూపిస్తానంటూ స్టేజ్ పైకి వెళ్తుంది. భరతనాట్యం చేసి చూపిస్తుంది. ఆమె డ్యాన్స్ కు అందరూ ఫిదా అవుతారు. సత్యం ముసిముసిగా నవ్వుతుంటాడు.

మనోజ్ ఇంటి దొంగ.. ప్రభావతి గడసరి అత్త..

ఆ తర్వాతి రౌండ్ లో మూకాభినయం చేయాల్సి వస్తుంది. జంటలు ఒకరికొకరు ఓ మూవీ పేరును మూకాభినయంతో చేసి చూపిస్తే అవతలి వాళ్లు దానిని సరిగ్గా గెస్ చేయాలి. ఇందులో ముందుగా మనోజ్, రోహిణి వెళ్లగా.. మనోజ్ కు ఇంటిదొంగ అని వస్తుంది. ఇది మా బాలు గాడు రాశాడా అనుకొని చేసి చూపిస్తాడు. రోహిణి కరెక్ట్ గా గెస్ చేస్తుంది.

తర్వాత రవి, శృతి కూడా ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రభావతి, సత్యం వెళ్తారు. ఆమెకు గడసరి అత్త సొగసరి కోడలు వస్తుంది. ప్రభావతి చేసి చూపిస్తే.. సత్యం సరిగ్గా గెస్ చేస్తాడు. చివరిగా మీనా, బాలు వెళ్తే వాళ్లకు ప్రేమకు వేళాయెరా వస్తుంది. ఇందులోనూ వాళ్లు గెలుస్తారు.

కపుల్స్ రొమాంటిక్ గేమ్

మూడో రౌండ్ లో కపుల్స్ రొమాంటిక్ గేమ్ ఉంటుంది. ఇందులో భాగంగా అందరూ తమ భార్యలను ఎత్తుకుంటే వాళ్లు పైన ఉన్న పువ్వును నోటితో తెంచి తమ భర్తలకు ఇవ్వాలి. ఇందులో రవి, శృతి ముందుగా వెళ్లగా.. శృతి పువ్వును అందుకున్నా.. దానిని రవికి ఇవ్వలేకపోతుంది. దీంతో ఆమె అతన్ని తిడుతుంది.

తర్వాత రోహిణి, మనోజ్ వెళ్తారు. రోహిణి సక్సెస్ అవుతుంది. తర్వాత బాలు, మీనా వెళ్తారు. మీనా కూడా నోటితో గులాబీని అందుకొని బాలుకి ఇస్తుంది. దీంతో ఈ రౌండ్ లో వాళ్లు కూడా విజేతలుగా నిలుస్తారు.

విరిగిన ప్రభావతి నడుము

వాళ్లందరినీ చూసి ప్రభావతి కూడా సత్యాన్ని తీసుకొని వెళ్తుంది. అయితే తను హార్ట్ పేషెంట్ అని, తనను ఎత్తుకోలేడని, కుర్చీపైకి ఎక్కి తీసుకుంటానని జడ్జీలను వేడుకుంటే వాళ్లు సరే అంటారు. పువ్వును కూడా చేత్తో తీసుకుంటానని అనడంతో దానికీ ఓకే చెబుతారు. కుర్చీపైకి ఎక్కి ప్రభావతి పువ్వును పట్టుకోగా.. కింద సత్యం తుమ్ముతాడు. దీంతో ప్రభావతి కింద పడుతుంది. ఆమె నడుము విరుగుతుంది. అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు.

నాలుగో రౌండ్లో భార్యాభర్తలు ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ ఒకరి గురించి మరొకరు చెప్పాలి. ఈ రౌండ్లో రోహిణి ఎమోషనల్ అవుతుంది. కంటతడి పెడుతుంది. చివరి రౌండ్ లో అందరికీ కొన్ని బ్లాక్స్ ఇచ్చి తమ కలల ఇల్లు కట్టాలని చెబుతారు. బాలు, మీనా ఒకే గది ఉన్న ఇల్లు కడతారు. అదేంటని అడిగితే తమ ఇంట్లో తమకు కనీసం బెడ్ రూమ్ కూడా లేదని అనడంతో జడ్జీలు కూడా ఎమోషనల్ అవుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More