గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి క్యాట్ వాక్- పూల సుందరిగా మీనా- రవి శ్రుతి బల ప్రయోగం- లక్ష ప్రైజ్ మనీ

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 23 ఎపిసోడ్‌లో బెస్ట్ కపుల్ పోటీలో పాల్గొనేందుకు సత్యం ఇంటిల్లిపాది మాట్లాడుకుంటారు. ప్రభావతి క్యాట్ వాక్ ప్రాక్టీస్ చేస్తుంది. రవి, శ్రుతి ఫిజికల్‌గా తలపడతారు. లక్ష ప్రైజ్ మనీ కోసం ఒక్కో కారణంతో ఒకరికి తెలియకుండా మరొకరు పోటీలో పాల్గొనేందుకు సత్యం ఫ్యామిలీ వెళ్తుంది.

Published on: Dec 23, 2025, 08:41:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బెస్ట్ కపుల్ పోటీలో కచ్చితంగా గెలుస్తామని, లక్ష వస్తే బాలు గాడికి రెండు నెలల డబ్బు ఇవ్వొచ్చని రోహిణిని ఒప్పిస్తాడు మనోజ్. ఇంట్లో చెబుతామా అని రోహిణి అంటే.. వద్దు. వాళ్లు కూడా వస్తారు. చెప్పకు అని మనోజ్ అంటాడు. మరోవైపు రవి, శ్రుతి కూడా కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 23 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 23 ఎపిసోడ్‌

తలపడిన రవి, శ్రుతి

ముందు వెళ్లి పాల్గొందాం. ప్రైజ్ రాని రాకపోని. నాకు ఇలాంటివి అంటే ఇష్టం అని శ్రుతి అంటాడు. మరి ఫిజికల్ టాస్క్‌లు పెడితే ఎలా. ప్రాక్టీస్ చేయొద్దా అని రవి అంటే.. నేను రోజు ఎక్సర్‌సైజ్ చేస్తానుగా. చాలా స్ట్రాంగ్ అని శ్రుతి అంటుంది. అయితే చూద్దామా అని రవి, శ్రుతి ఇద్దరు ఫిజికల్‌గా తలపడి బల ప్రయోగం చేసుకుంటారు. మరోవైపు పడుకున్న సత్యంను లేపి బెస్ట్ కపుల్ పోటీ గురించి చెబుతుంది.

ఆదర్శ దంపతుల పోటీల్లో గెలవడానికి మనకంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉంది అని ప్రభావతి అంటుంది. ఆదర్శం అనేదానికి నీకు అర్థమే తెలియదు. ఎందుకు పోటీ అని సత్యం అంటాడు. నాకు వెళ్లాలని ఉందండి అని ఆశగా ప్రభావతి అడిగితే.. సత్యం కూడా ఒప్పుకుంటాడు. లక్ష రూపాయలంటూ ప్రభావతి మెలికలు తిరుగుతూ పులకరించిపోతుంది.

మరోవైపు ఆ మంచాల మనోజ్ గాడు మనల్ని తక్కువ చూస్తున్నాడని బాలు అంటే.. అది తప్పు అని నిరూపించాలంటే పోటీలో పాల్గొనలాని మీనా అంటుంది. అక్కడ గెలిస్తే లక్ష వస్తుంది. ఆ డబ్బుతో ఇల్లు కట్టొచ్చు అని మీనా అంటుంది. దాంతో వెంటనే బాలు ఒప్పేసుకుంటాడు. ఎలాంటి పోటీలు పెడతారు అని ఆలోచిస్తుంటారు. డ్యాన్స్ గురించి చెప్పి ఊహల్లో తేలిపోతాడు బాలు.

కారు వీరుడు-పూల సుందరి

ఎక్కడికి వెళ్లారు అని మీనా అడిగితే.. జగదేకవీరుడు అతిలోక సుందరి అని బాలు అంటే.. కానీ మనం కారు వీరుడు పూల సుందరి కదా అని మీనా అంటుంది. ఈ పేరేదో బాగుంది పూలసుందరి అని బాలు అంటాడు. రేపు పొద్దున రవి, శ్రుతికి చెప్పి వెళ్దామని బాలు అంటాడు. మరుసటి రోజు ఉదయం బాలు, మీనా కాంపిటీషన్‌కు రెడీ అవుతారు.

రవి, శ్రుతికి చెబుదామంటే లేరని బాలు అంటాడు. మరోవైపు అటు ఇటు నడిచిన ప్రభావతి క్యాట్ వాక్ చేస్తుంది. ఏనుగు నడకలా ఉందని సత్యం అంటాడు. ఎవరికి తెలియకుండా వెళ్లాలి అని ప్రభావతి అంటుంది. మరోవైపు బ్లాక్ షర్ట్ రోహిణి ఇస్తే ఈరోజు ఇది వేసుకోకూడదు అని మనోజ్ అంటాడు. ఏదోటి చెప్పి మనోజ్‌ను ఒప్పిస్తుంది రోహిణి.

హాల్లో అంతా రెడీ అయి కనిపిస్తే కాంపిటీషన్‌కు వెళ్తున్నారా అని బాలు అడుగుతాడు. గుడికి అని ప్రభావతి, పార్లర్, ఫర్నిచర్ షాప్‌కు అని రోహిణి, రవి అబద్ధం చెప్పి వెళ్లిపోతారు. రవి వాళ్లు వెళ్తారు. వచ్చేవాళ్ల పేర్లను బుక్‌లో రాయమని రిసెప్షన్ దగ్గర రవి, శ్రుతిని రిక్వెస్ట్ చేస్తాడు ఈవెంట్ ఆర్గనైజర్. దాంతో వాళ్లు ఒప్పుకుంటారు.

బాలు, మనోజ్ ఛాలెంజ్

రవి, శ్రుతిని మనోజ్, రోహిణి షాక్ అవుతారు. ఏదో ట్రై చేద్దామని వచ్చామని నలుగురు చెప్పుకుంటారు. తర్వాత సత్యం, ప్రభావతి, కామాక్షి, రంగ వస్తారు. అందరూ పోటీలోకి ఒకరికి తెలియకుండా మరొకరు వస్తారు. బాలు, మీనా వస్తారు. పోటీలో ఎవరు గెలుస్తారో అని బాలు, మనోజ్ ఛాలెంజ్ చేసుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More