గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నన్ను కన్నది నా సంపాదన తినడానికా, తల్లితో మనోజ్- ప్రభావతి కన్నీళ్లు తుడిచిన బాలు!
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 15 ఎపిసోడ్‌లో సత్యం, ప్రభావతి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చే ప్రయత్నం చేస్తుంది సుశీల. చాలా సమయం తర్వాత సత్యంకు ప్రభావతి క్షమాపణ చెబుతుంది. తర్వాత మనోజ్‌ను ప్రభావతి తిడుతుంది. నన్ను కన్నది నా సంపాదన తిని కూర్చోడానికా అని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి కన్నీళ్లతో చూస్తుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా మొహం మీద ప్రభావతి తన చేతి గాజులు విసిరికొట్టిందని సత్యం చెబుతాడు. ఇంతా చేసిందా. అదంతా నేను తర్వాత మాట్లాడుతా. కానీ, మీనాకు ప్రభావతిని క్షమించమని అడగకండి. దాంతో మరింత కోపం పెట్టుకుని మీనాను సాధిస్తుందని సుశీల చెబుతుంది.

ఒంటరి అయ్యేది నువ్వేరా
ఇప్పుడు ప్రభావతి చేసిన తప్పుకు శిక్ష లేదా అని సత్యం అంటాడు. అదేరా కుటుంబం అంటే. తను మాట్లాడను అని కూర్చొంటే ఒంటరి అయ్యేది నువ్వేరా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న ప్రభావతితో మాట్లాడు అని సుశీల కిందకు సత్యంను తీసుకొస్తుంది. మనోజ్ గాజు చేసిన తప్పును నిలదీయకండా కవర్ చేసి ముద్దాయిలా నిలబడటం బాగుందా అని కోప్పడుతుంది సుశీల.
నీ భర్తకు తెలియకుండా ఇంకోసారి చేయకు అని సుశీల అంటుంది. జరిగిందే మళ్లీ చెబుతుంది ప్రభావతి. సరే ఇప్పుడు ఏం ఒరిగింది. ఇక ఇద్దరు రాజీకి వచ్చి మాట్లాడుకోండి అని సుశీల అంటుంది. అంతా తెలిసి నీ మీద, మీనా వాళ్ల పుట్టింటి మీద నింద వేసింది. అక్కడ మండుతోంది నాకు. మీ ఇద్దరికి క్షమాపణ చెప్పాలని సత్యం అంటాడు.
నా అత్తగారు కాబట్టి మీకు చెబుతాను. దానికి చెప్పడం నా వల్ల కాదు అని ప్రభావతి అంటుంది. ఇంకా దాని పొగరు చూశావా. క్షమించమని అడగాల్సిందే అని సత్యం అంటాడు. కోడళ్ల ముందు నా కోడలి పరువు ఎలా తీస్తాను. క్షమించమని అడగకున్న మీనా ఏం అనుకోదు అని సుశీల అంటుంది. ఇలా అవ్వదు. వాళ్లిద్దరిని గదిలోకి పంపి గడియ పెట్టేద్దాం అని బాలు అంటాడు.
ఫస్ట్ నైట్ గదిలోకి
ఆ పని చేద్దామని ఇద్దరిని గదిలోకి పంపించి గడియ పెడతారు. ఫస్ట్ నైట్ గదిలోకి పంపించినట్లు ఉందని శ్రుతి నోరు జారుతుంది. గదిలో ప్రభావతి సిగ్గు పడుతుంది. ఇంతలో సత్యంకు దగ్గు వస్తుంది. దాంతో నీళ్లు ఇస్తుంది ప్రభావతి. కానీ, సత్యం మాత్రం కోపంగా చూస్తాడు. ఏవండి అని చేయి వేస్తే ఏ ఛీ.. చేయి వేయకు అని సత్యం విసుక్కుంటాడు.
తర్వాత కాసేపటికి డోర్ తీస్తారు సుశీల, బాలు. రాజీ కుదర్లేదని అర్థమవుతుంది. అది మాట్లాడిన మాటలు మర్చిపోలేకపోతున్నాను. ఆ మొహం చూడాలంటేనే కంపరంగా ఉందని సత్యం అంటాడు. ఇదంతా నీ వల్లే మనోజ్. నువ్వు సారీ చెప్పు అని రోహిణి చెబుతుంది. దాంతో అమ్మ తప్పేం లేదని మనోజ్ చెబుతాడు. మనోజ్‌ను పిలిచి సుశీల ఒక్కటి కొడుతుంది.
ఇదే చెంపదెబ్బ నా కొడుకు కష్టాజీతాన్ని ఎత్తుకెళ్లినప్పుడు మీ అమ్మ కొట్టి ఉంటే నువ్వు ఇలా అయిండేవాడివి కాదు. ఏ ప్రభా వాడు ఇలా అవడానికి నువ్వే కారణం. ఇదంతా నీ పెంపకం వల్లే. ఒక్కొక్కరిని ఒక్కోలా చూసి నీ కాపురాన్ని నువ్వే సమస్యగా మార్చుకున్నావ్. దోషిగా నిలబడ్డావ్. కనీసం సత్యంకు అయినా సారీ చెప్పమని సుశీల అంటుంది. దాంతో ఏడుస్తూ క్షమాపణ చెబుతుంది ప్రభావతి.
ప్రభావతి కన్నీళ్లు
అయ్యో అమ్మ ఏడుస్తున్నావా. ఏడవకు. మమ్మల్ని తిడుతుంటూనే బాగుంటుంది అని బాలు తల్లి కన్నీళ్లు తుడుస్తాడు. పోరా. చేసిందంతా చేసి కన్నీళ్లు తుడుస్తున్నావా అని ప్రభావతి అంటుంది. ఆ ఇది మా అమ్మ గయ్యాలి గంపావతి అని బాలు అనేసరికి అంతా నవ్వుతారు. సత్యం క్షమిస్తాడు. మనోజ్ అంతా నీవల్లే ఇకనైనా బుద్ధిగా ఉండమని సుశీల అంటుంది.
వాడు దారిలోకి రావాలంటే మా నాలుగు లక్షలు ఇస్తే సరిపోతుంది. ఒకేసారి కాకుండా నెల నెల 50 వేలు ఇస్తే చాలు అని బాలు ఐడియా ఇస్తాడు. ఐడియా బాగుందని శ్రుతి అంటుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకండని, కావాలంటే హెల్ప్ చేస్తానంటుంది రోహిణి. ప్రభావతిని ఒప్పించమని సుశీల చెబుతుంది. దాంతో ప్రభావతి ఒప్పుకోమ్మని చెబుతుంది.
మనోజ్ సరేనని ఒప్పుకుంటాడు. ప్రతి నెల 50 వేలు ఇప్పించే బాధ్యత నీదే అని సుశీల ఆర్డర్ వేస్తుంది. తర్వాత గదిలోకి వెళ్లి రోహిణి, మనోజ్ మాట్లాడుకుంటారు. వాళ్లు కలవాలని వచ్చి నన్ను ఇరికించారు అని మనోజ్ అంటాడు. నువ్వు అన్ని మింగేస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను. ఆఫీస్‌లో గుర్రుపెట్టి నిద్ర పెట్టకుండా బాగా పని చేసి ఇవ్వు అని రోహిణి అంటుంది.
తల్లిని అన్న మనోజ్
ఇంతలో ప్రభావతి వచ్చి మనోజ్‌ను ఎడాపెడా తిడుతుంది. అన్నింటికి కారణం మీనా అని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను ఎడాపెడా తిడుతుంది. రోహిణి నువ్వే ఏదోటి చేయాలి. మీ నాన్నకు చెప్పి డబ్బు ఏర్పాటు చేయు అని ప్రభావతి అంటుంది. నీ వల్ల ఎవరికి శాంతి లేదని ప్రభావతి వెళ్లిపోతుంటే.. మరి నిన్ను ఏమనాలి అని మనోజ్ అంటాడు.
దాంతో ఆగిపోయిన ప్రభావతి వెనక్కి చూస్తుంది. నన్ను కన్నది నా నుంచి వచ్చే సంపాదన తిని కూర్చోడానికా అని మనోజ్ అంటాడు. దాంతో కన్నీళ్లతో చూస్తుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


