గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బిడ్డ విషయంలో రోహిణిని నిలదీసిన మీనా, శృతి.. అలక వీడని సత్యం.. బాలు మరో కారు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ లో బాలుకి రోహిణి డబ్బు ఇచ్చినా మాటలు పడుతుంది. అటు సత్యం అలక కొనసాగుతుండగా.. రోహిణి ఇచ్చిన డబ్బుతో మరో కారు కొనడానికి బాలు ప్లాన్ చేస్తాడు. అయితే చివర్లో బిడ్డ విషయంలో మీనా, శృతిలకు రోహిణి అడ్డంగా దొరికిపోతుంది.

Dec 10, 2025, 06:55:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 572వ ఎపిసోడ్ లో బిడ్డను కనడం ఎంత కష్టంగా ఉంటుందో మీనా, శృతిలకు చెప్పి అడ్డంగా ఇరుక్కుంటుంది రోహిణి. అటు నగలు, డబ్బు, సత్యం అలక వంటి సీన్లు ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగాయి. మొత్తంగా ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బిడ్డ విషయంలో రోహిణిని నిలదీసిన మీనా, శృతి.. అలక వీడని సత్యం.. బాలు మరో కారు
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బిడ్డ విషయంలో రోహిణిని నిలదీసిన మీనా, శృతి.. అలక వీడని సత్యం.. బాలు మరో కారు

డబ్బు తీసుకొచ్చిన రోహిణి.. బాలు సందేహం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ రోహిణి, మనోజ్ ఇంటికి డబ్బు తీసుకొచ్చి హడావిడి చేసే సీన్ తో మొదలవుతుంది. రోహిణి వచ్చి అందరినీ పిలవమంటుంది. ప్రభావతి వస్తే తాను వెళ్లిపోతానని సత్యం చెప్పినా.. అందరూ ఉండాలని అంటుంది.

మీనా, బాలు, ప్రభావతి వస్తారు. నగలు మింగాడని మనోజ్ ను బాలు నానా మాటలు అంటున్నాడు కదా అందుకే డబ్బు తీసుకొచ్చానని చెబుతుంది. అంత డబ్బు ఎక్కడిది అని ప్రభావతి అడిగితే మా నాన్న పంపించాడని అంటుంది. ఆయన జైల్లో ఉన్నాడు కదా అని సత్యం అడుగుతాడు. జైల్లోనూ బ్యాంకు ఉంటుందని బాలు ఎగతాళి చేస్తాడు.

డబ్బు వద్దన్న బాలు.. మొత్తం 4 లక్షలు కావాల్సిందే అంటూ..

ఆ డబ్బేదో తానే తీసుకొచ్చినట్లుగా బిల్డప్ ఇస్తున్న మనోజ్ ను బాలు, సత్యం తిడతారు. ఇక్కడ జరిగిదంతా మీ నాన్నతో చెప్పావా అని ప్రభావతి అడిగితే.. ఏమీ లేదని రోహిణి అంటుంది. మనోజ్ డబ్బు ఇవ్వబోతే బాలు తనకు వద్దంటాడు. మొదట రోహిణి డబ్బు అవసరం లేదని, ఇది తమ అన్నదమ్ముల మధ్య సమస్య అని అంటాడు.

ఆ తర్వాత అవి రూ.2 లక్షలే ఉన్నాయని, తనకు మొత్తం డబ్బు కావాలని స్పష్టం చేస్తాడు. ప్రస్తుతానికి ఇవి తీసుకోమనండి.. త్వరలోనే అవి కూడా ఇస్తామని రోహిణి, మనోజ్ కలిసి సత్యంని బతిమాలుతారు. సరే అని బాలు తీసుకుంటాడు. ఇలా వీళ్లు దొంగతనం చేసినప్పుడల్లా డబ్బు తీసుకొచ్చి ఇస్తుంటే.. తల్లీ కొడుకులు మరింత చెలరేగుతారని రోహిణిని హెచ్చరించి సత్యం వెళ్లిపోతాడు.

నగలు వద్దు.. గది కడదామన్న మీనా

ఉదయాన్నే ఆ డబ్బు తీసుకొని వెళ్లి నగలు కొందామని మీనాతో అంటాడు బాలు. కానీ ఆమె మాత్రం వద్దని వారిస్తుంది. మరి గది కడదామా అని బాలు అంటాడు. వద్దు పునాది వేద్దాం.. ఆ గది కట్టడానికి కావాల్సిన డబ్బుకు పునాది వేద్దాం.. మరో సెకండ్ హ్యాండ్ కారు కొని దానిని అద్దెకు ఇస్తే రెండు ఆదాయాలతో చిట్టీ వేసి తర్వాత గది కడదామని మీనా అంటుంది. బాలు సరే అంటాడు.

ప్రభావతి గదిలోకి వెళ్లే ప్రసక్తే లేదన్న సత్యం

ఇక సత్యం హాల్లో పడుకోవడానికి సిద్ధమవుతుండగా.. బాలు, మీనా వెళ్లి వారిస్తారు. గదిలోకి వెళ్లి పడుకోమంటారు. డబ్బు సమస్య తీరిపోయింది కదా.. దాని గురించి పట్టించుకోకుండా ఇక అత్తయ్యతో మాట్లాడండి అని మీనా అంటుంది. కానీ సత్యం వినడు.

సమస్య డబ్బు కాదు.. ఆమె బుద్ధి.. అది మారదు అని అంటాడు. ఆ గదిలోకి వెళ్లబోనని, ఇక్కడే పడుకుంటానని మొండికేస్తాడు. ఇంతలో ప్రభావతే అక్కడికి వస్తుంది. తానే ఇక్కడ పడుకుంటానని అంటుంది. కానీ సత్యం మాత్రం గదిలోకి వెళ్లిపోతాడు. దీంతో ప్రభావతి మరోసారి మీనాను తిట్టి అక్కడే పడుకుంటుంది.

ముగ్గురు కోడళ్ల కాఫీ ముచ్చట్లు.. మనోజ్‌ను తిట్టిన శృతి

మరుసటి రోజు ఉదయం ముగ్గురు కోడళ్లు కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. అత్తయ్యకు కాఫీ ఇచ్చావా అని మీనాను రోహిణి అడిగితే.. ఇచ్చినా తీసుకెళ్లి సింకులో పారపోసిందని అంటుంది. దీంతో శృతి జోక్యం చేసుకొని నగలు మింగినోడు మనోజ్ వల్లే ఇదంతా అని తిడుతుంది. తప్పు అతడు చేస్తే ఆంటీ ఫలితం అనుభవిస్తోందని అంటుంది.

ఇక చివర్లో శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది. అందులో ఓ మహిళ ప్రసవ వేదనకు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అది ఎంత వేధనతో కూడుకున్నదో శృతికి అర్థమవుతుంది. అదే విషయం ఇంటికి వచ్చి మీనా, రోహిణిలతో చెబుతుంది. అప్పుడు బిడ్డను కనడం ఎంత కష్టమో వాళ్లకు రోహిణి పూసగుచ్చినట్లు వివరిస్తుంది. దీంతో నువ్వు ముందే బిడ్డను కన్నావా.. ఇంత కచ్చితంగా ఎలా చెబుతున్నావని మీనా, శృతి ఆమెను నిలదీస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More