గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్:స్వామిజీ దగ్గరికి ప్రభావతి మనోజ్-బాలు నిమ్మకాయ శక్తి తగ్గేలా మంత్రించిన మరో నిమ్మకాయ

గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 1 ఎపిసోడ్‌లో బాలు మంత్రించి తీసుకొచ్చిన నిమ్మకాయ గురించి కామాక్షికి చెబుతుంది ప్రభావది. స్వామిజీ దగ్గరికి వెళ్దామని మరుసటి రోజు ఉదయమే ప్రభావతి, మనోజ్, కామాక్షి వెళ్తారు. జరిగింది తెలుసుకున్న స్వామిజీ బాలు నిమ్మకాయ శక్తి తగ్గేలా మరో మంత్రించిన నిమ్మకాయ ఇస్తాడు.

Published on: Dec 1, 2025, 08:11:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తీసుకొచ్చిన నిమ్మకాయ గురించి, తమకు ఏదో అవుతుందని భయమేస్తుందని, దాని నుంచి బయటపడే మార్గం చెప్పమని కామాక్షికి చెబుతుంది ప్రభావతి. నాకు తెలిసిన స్వామిజీ ఉన్నాడు. రేపు ఉదయమే రండి అని ధైర్యం చెప్పి కాల్ కట్ చేస్తుంది కామాక్షి. ఫోన్ స్విచాఫ్ పెట్టుకుంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 1 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ 1 ఎపిసోడ్‌

ఆరున్నరకే మనోజ్ రెడీ

మరుసటి రోజు ఉదయం ఆరున్నరకే మనోజ్ రెడీ అవ్వడం చూసి రోహిణి షాక్ అయి అడుగుతుంది. నిజం చెప్పకుండా ప్రభావతి, కామాక్షి ఇద్దరిని డ్రాప్ చేయాలట అని చెబుతాడు. తనను కూడా పార్లర్ దగ్గర డ్రాప్ చేయమని రోహిణి అడిగితే కుదరదని చెబుతాడు మనోజ్. బయట ప్రభావతి ఎదురుచూచ్తుంది. ఇంతలో సత్యం వచ్చి ఎక్కడికి అని అడుగుతాడు.

ప్రభావతి చెప్పకుండా తప్పించుకుంటుంది. బాలు వచ్చి సెటైర్లు వేస్తాడు. ఇంతలో మనోజ్ వస్తాడు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా దాస్తున్నారని మీనా అంటుంది. కామాక్షికి బాగా లేకపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నట్లు ప్రభావతి చెబుతుంది. మీరు ఫంక్షన్‌కు వెళ్తున్నట్లు మనోజ్ చెప్పాడని రోహిణి అంటుంది. ఫంక్షన్‌కు అనుకున్నాం కానీ, ఇంతలో ఇలా అయిందని ప్రభావతి అబద్ధం చెబుతుంది.

స్వామిజీ దగ్గరికి ప్రభావతి, మనోజ్

బాలు తెగ ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు ఒక్కో కారణం చెబుతారు. మనోజ్, ప్రభావతి వెళ్లిపోతారు. బాలు, మీనా వాళ్లు చెబుతున్నది అబద్ధమని, త్వరలోనే బయటపడతారని అనుకుంటారు. ప్రభావతి, మనోజ్, కామాక్షి స్వామిజీని కలుస్తారు. బాలు చేసింది చెబుతారు. మీరు ఇద్దరే భయపడుతున్నారంటే మీరు ఏదో పెద్ద తప్పు చేశారని అర్థమవుతోంది అని స్వామిజీ అంటాడు.

ముందు ఒప్పుకోని ప్రభావతి, మనోజ్ తర్వాత నగలు అమ్మిన విషయం చెబుతారు. బాలు చెప్పిందంతా అబద్ధమేగా అని మనోజ్ అంటే.. కాదు నిజమే. నిమ్మకాయను మంత్రిస్తే మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది. చచ్చిన శవంలా మార్చేస్తుంది. నిమ్మకాయకు అంత పవర్ ఉందని స్వామిజీ అంటాడు. మాకు ఏం జరగకుండా చూడమని కోరతారు.

నిమ్మకాయ ఇచ్చిన స్వామిజీ

వాళ్ల మీద విభూది కొట్టి ఓ నిమ్మకాయ ఇస్తాడు స్వామిజీ. దీన్ని నేను మంత్రించాను. ఆ నిమ్మకాయకు ఎడమ వైపు పెట్టండి. ఆ నిమ్మకాయ శక్తి తగ్గిపోతుందని, తెల్లారేసరికి ఏ నిమ్మకాయ తెల్లగా మారుతుందో దానికి తక్కువ శక్తి ఉన్నట్లు అని స్వామిజీ అంటాడు. స్వామిజీకి డబ్బు ఇచ్చి వెళ్లిపోతారు ప్రభావతి, మనోజ్. ఇంట్లోకి ప్రభావతి, మనోజ్ దొంగచాటుగా వెళ్తారు.

నిమ్మకాయను ఒకరినొకరు పెట్టమని అనుకుంటారు. పూజ గదిలో నిమ్మకాయని పైనుంచి పడేస్తుంది. దాంతో అది కింద పడిపోతుంది. అది చూసి స్పృహ కోల్పోతాడు మనోజ్. నీళ్లు కొట్టి లేపుతుంది. తర్వాత మనోజ్‌తోనే ఆ నిమ్మకాయను పెట్టిస్తుంది ప్రభావతి. ఇద్దరు మొక్కుకుంటారు. బాలు వెళ్లి రెండో నిమ్మకాయను చూసి నవ్వుతాడు. మీనాను అడిగితే తాను పెట్టలేదంటుంది.

మీనాను కొట్టబోయిన అత్త

దాంతో అందరిని పిలుస్తాడు బాలు. రెండో నిమ్మకాయను చూపిస్తాడు బాలు. అదెక్కడిది అని రోహిణి అడుగుతుంది. నిమ్మకాయ డెలీవరి అయిందని బాలు అంటాడు. తర్వాత నిమ్మకాయలను ప్రభావతి, మనోజ్ తీసుకెళ్తుంటే అంతా పట్టుకుంటారు. మీరే కదా ఆ నగలు అమ్మించిందని మీనా అంటే ప్రభావతి కొట్టబోతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More