గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు డబ్బిచ్చి ఇరుక్కున్న రోహిణి.. మనోజ్‌కు పోలీసుల షాక్.. ప్రభావతికి సత్యం దూరం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ లో బాలుకి డబ్బు ఇచ్చినా రోహిణి అడ్డంగా ఇరుక్కుంటుంది. అటు మనోజ్ కు పోలీసులు మరో షాక్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: Dec 09, 2025 7:55 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 571వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వాళ్ల దెబ్బకు ప్రభావతి, మనోజ్, రోహిణి మొహాలు మాడిపోతాయి. పౌరుషానికి పోయి డబ్బులు ఇవ్వబోయిన రోహిణి ఇరుక్కుంటుంది. అటు ప్రభావతిని సత్యం పూర్తిగా దూరం పెట్టేస్తాడు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు డబ్బిచ్చి ఇరుక్కున్న రోహిణి.. మనోజ్‌కు పోలీసుల షాక్.. ప్రభావతికి సత్యం దూరం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుకు డబ్బిచ్చి ఇరుక్కున్న రోహిణి.. మనోజ్‌కు పోలీసుల షాక్.. ప్రభావతికి సత్యం దూరం

మనోజ్, రోహిణి, ప్రభావతిలకు మీనా క్లాస్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ మనోజ్, రోహిణి, ప్రభావతిలకు మీనా క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. ఆ ముగ్గురూ టిఫిన్ చేయడానికి నిరాకరించడంతో మీనా వాళ్లకు చురకలు అంటిస్తుంది. మీరు దోచుకున్న రూ.4 లక్షలే అడిగింది.. అది తెలుసుకొని మాట్లాడితే అందరికీ మర్యాదగా ఉంటుంది.. ఈ ఇంట్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మేమేం మూసుకున్నాం.. కాసేపట్లో మా ఆయన వస్తాడు.. అప్పుడు మాట్లాడండి అంటూ మీనా నానా మాటలు అనడంతో రోహిణి రెచ్చిపోతుంది. వాళ్ల డబ్బు వాళ్లకు పడేద్దాం అనడంతో ఎవరి డబ్బు ఎవరికి పడేస్తావ్.. గుడి ముందు అడుక్కునే పరిస్థితిలో ఇక్కడ ఎవరూ లేరు అని మీనా వెళ్లిపోతుంది.

డైనింగ్ టేబుల్ దగ్గరా గొడవ

మీనా అన్ని మాటలు అన్నా కూడా మనోజ్ మాత్రం ఈ ఇంట్లో తినడం మన హక్కు అంటూ టిఫిన్ చేయడానికి వెళ్తాడు. అటు రోహిణి, ప్రభావతి కూడా వెళ్తారు. ముగ్గురూ కూర్చొని తింటుండగా బాలు, శృతి, రవి, సత్యం వస్తారు. వాళ్లను కూడా తినడానికి రావాలని మీనా అడుగుతుంది. ఆ గ్రహాల మధ్య కూర్చొని తినలేనని, తాను బయటకు వెళ్లి వస్తానని సత్యం వెళ్లిపోతాడు.

ఇటు బాలు, శృతి, రవి తినడానికి వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గరా ఆ ముగ్గురితో ఈ ముగ్గురూ ఓ ఆటాడుకుంటారు. దీంతో ఆ మాటలు వినలేక ప్రభావతి సగంలోనే లేచి వెళ్లిపోతుంది. రోహిణి కూడా లేచి మనోజ్ ను తీసుకెళ్లిపోతుంది.

మనోజ్‌కు రోహిణి హామీ.. పోలీసుల షాక్

అటు షాపుకు వెళ్లిన మనోజ్ బాధపడుతూ ఉంటాడు. దీంతో రోహిణి వచ్చి అతన్ని ఓదారుస్తుంది. తన వల్లే నాన్న అమ్మతో మాట్లాడటం లేదని అంటాడు. అప్పుడే ఆ విషయం తనకు చెప్పి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదని రోహిణి అంటుంది. ఇప్పటికైనా ఏదో ఒకటి చేద్దామంటూ మనోజ్ కు సర్ది చెబుతుంది. ఇంతలో పోలీసు ఓ వ్యక్తిని తీసుకొని మనోజ్ దగ్గరికి వస్తాడు.

నీ షాపులో వస్తువులు పోయావని ఫిర్యాదు చేశావు కదా.. అందులో కొన్ని ఈ వ్యక్తి కొన్నాడు అని చెబుతాడు. దీంతో మనోజ్ ఆ వ్యక్తి మండిపడతాడు. తక్కువ ధరకు వస్తే చాలు కొనేస్తావా అని అంటాడు. ఆ వ్యక్తి కూడా ఎదురు తిరుగుతాడు. అయితే పోలీసు జోక్యం చేసుకొని.. ఆ వస్తువులను తిరిగి ఇవ్వడానికి తీసుకొచ్చానని, అతడు ఎంత ఇచ్చి కొన్నాడో ఆ మొత్తం ఇచ్చేయండని అనడంతో మనోజ్, రోహిణి షాక్ తింటారు.

తమ వస్తువులకు తాము డబ్బు ఎందుకివ్వాలని అడుగుతారు. అతడు కూడా డబ్బు ఇచ్చే కొన్నాడు కదా.. తక్కువకే కొన్నాడు కాబట్టి.. ఆ మొత్తం ఇచ్చి తీసుకోండని పోలీసు అంటాడు. దీంతో రూ.లక్ష ఇస్తే తాను కొన్నవి ఇచ్చేస్తానని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. రోహిణి సరే అంటుంది.

ప్రభావతి చేత్తో మంచి నీళ్లూ ముట్టని సత్యం

ఇటు సత్యం ఇంట్లో ఏదో బుక్కు తీసుకోబోయి దానికి దుమ్ము ఉండటంతో దగ్గు, తుమ్ములతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటాడు. అది చూసి ప్రభావతి నీళ్లు తెచ్చి ఇస్తుంది. అయినా సత్యం ఆమె చేత్తో మంచి నీళ్లు కూడా ముట్టడు. దీంతో వెంటనే బాలు, మీనా వచ్చి ఏం జరిగిందంటూ అడిగి.. నీళ్లు తెచ్చి ఇస్తుంది. దీంతో అతడు ఆ నీళ్లు తాగుతాడు. అది చూసి ప్రభావతి మండి పడుతూ తన చేతిలో గ్లాసును నేలకు కొట్టి వెళ్లిపోతుంది.

అత్త, మామ అలా ఎడమొహం పెడమొహంగా ఉండటంతో వాళ్లను ఎలాగైనా దగ్గర చేయాలని బాలుతో అంటుంది మీనా. ఇటు రోహిణి చెప్పినట్లుగానే డబ్బుతో ఇంటికి వస్తుంది. సత్యం ముందే ఆ డబ్బును బాలుకు ఇస్తుంది. ఈ డబ్బు ఎక్కడిది అని ప్రభావతి అడగడంతో మా నాన్న పంపించారని అంటుంది. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా అని సత్యం అడగడంతో రోహిణి కంగారు పడుతుంది. జైల్లోనూ బ్యాంకు ఉంటుందిలే అంటూ బాలు దెప్పి పొడుస్తాడు. డబ్బు ఇవ్వడానికి వెళ్లి రోహిణి అలాం ఇరుక్కుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.