గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతికి సోకిన గాలి- సత్యం, ప్రభావతిని కలిపేందుకు సుశీల- మీనాకు ప్రభావతి క్షమాపణలు
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 12 ఎపిసోడ్‌లో డెలివరి డబ్బింగ్ చెప్పిన శ్రుతి ఎమోషనల్ అవుతుంది. పిచ్చిదానిలా చేస్తే మీనా బెదిరించి నార్మల్ అయ్యేలా చేస్తుంది. సత్యం, ప్రభావతిని కలిపేందుకు సుశీల ఎంట్రీ ఇస్తుంది. మీనాకు ప్రభావతి క్షమాపణలు చెబితేనే మాట్లాడతానని సత్యం గట్టిగా నిలబడతాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం, ప్రభావతి మాట్లాడుకున్నాక ఇంకో కారు కొందామని, నాకు తప్పు చేసినట్లుగా ఉందని మీనా అంటుంది. దానికి సరే అన్న బాలు వాళ్లను కలుపుతానంటాడు. మరోవైపు డెలివరీ సీన్ చాలా హైలెట్ అని, చాలా ఎమోషన్‌గా చేయాలని శ్రుతికి కో ఆర్డినేటర్ చెబుతాడు. ఆ వీడియో చూసిన శ్రుతి అచ్చం అలాగే చేస్తుంది.

హ్యాట్సాఫ్ చెప్పాలి
కో ఆర్డినేటర్ చప్పట్లు కొడతాడు. శ్రుతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగా చాలా ఎమోషనల్‌గా ఉందని, ఈ ఒక్క విషయంలో లేడిస్ హ్యాట్సాఫ్ చెప్పాలని బాధపడుతుంది శ్రుతి. వెంటనే తల్లికి కాల్ చేసి సారీ చెబుతుంది. నన్ను కనేటప్పుడు చాలా బాధపడి ఉంటావుగా. అందుకు సారీ చెప్పాలనిపించింది అని డబ్బింగ్ గురించి చెబుతుంది శ్రుతి.
నిజంగానే ఆ టైమ్‌లో కష్టంగా ఉంటుంది. కానీ, తల్లి కావడం అనేది ఆడదానికి దేవుడు ఇచ్చిన వరం. దీని గురించి ఇంతలా మాట్లాడుతున్నావ్. ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతుంది శోభన. అలా ఏం లేదు. ఇదంతా చూస్తే భయంగా ఉందని శ్రుతి అంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇది చూసి ఆలోచనలు మార్చుకోకు అని సలహా ఇస్తుంది శోభన.
మరోవైపు రోహిణి అలసిపోయి వస్తుంది. శ్రుతి కూడా డల్‌గా వస్తుంది. కాఫీ తీసుకొస్తానని మీనా అంటే వెళ్లి నొప్పులు పడాలని శ్రుతి అంటుంది. దానికి షాక్ అయిన మీనా, రోహిణి వెళ్లి కాఫీ తీసుకొస్తుంది. పురిటి నొప్పుల గురించి మాట్లాడుతుంది. దాంతో ఒక్కసారిగా ఏయ్ అని అరుస్తుంది మీనా. దానికి శ్రుతి, రోహిణి దడుసుకుంటారు. ఏదో గాలి సోకినట్లుందని మీనా అంటుంది.
పురిటి నొప్పుల గురించి
తర్వాత డెలివరి డబ్బింగ్ గురించి చెబుతుంది శ్రుతి. కడుపు అయినప్పుడు ఎలా ఉంటుందో రోహిణి మొత్తం చెబుతుంది. అదంతా చూసి మీనా, శ్రుతి షాక్ అవుతారు. నువ్వు నొప్పులు పడి బిడ్డను కన్నట్లు చెబుతున్నావని శ్రుతి అంటుంది. దానికి కంగారు పడిన రోహిణి మా క్లయింట్స్ చెప్పేవాళ్లు అంటుంది. మీనా మాత్రం డౌట్‌గా చూస్తుంది. తల్లి కావడం అనేది భయపడే విషయం కాదు అది ఒక అనుభూతి అని బిడ్డకు జన్మనివ్వడం గొప్ప వరమని చెబుతుంది మీనా.
నేను నొప్పులు పడను. కావాలంటే రవిని నొప్పులు పడమంటాడు. నేను కంటాను అని శ్రుతి అంటుంది. ఇంతలో సుశీలను తీసుకొస్తాడు బాలు. సత్యం, ప్రభావతి గొడవను తాను తీరుస్తానని సుశీల చెబుతుంది. సమస్యకు పరిష్కారంగా షీల డార్లింగ్‌ను తీసుకొచ్చా అని మీనాకు బాలు చెబుతాడు. ఇంట్లోకి ప్రభావతి అంటూ అరుస్తూ వస్తుంది సుశీల.
నీ సమస్య ఏంటో చెప్పు నాకు అని ప్రభావతిని నిలదీస్తుంది సుశీల. మనోజ్ గాడి చేతకనం గురించి తిడుతుంది. వాడిని పరమసుంటలా తయారు చేసింది నువ్వు. సరే సత్యంను పిలువు నేను మాట్లాడాలని అంటుంది సుశీల. ఆయన మేడ మీద ఉన్నారని ప్రభావతి చెబుతుంది. నా కొడుకుతో మాట్లాడాలి, ఎవరు రాకండి అని పైకి వెళ్తుంది సుశీల.
నిలదీసిన సుశీల
భార్యతో గొడవ పడి మాట్లాడుకుండా ఉండటం ఏంట్రా అని నిలదీస్తుంది సుశీల. నిజం ఒప్పుకోకుండా ఆ నిందను మీనా మీద, తల్లి మీద వేసింది. అదే తట్టుకోలేకపోతున్నాను. ఇంకెన్నాళ్లు సర్దుకుపోవాలి. పెళ్లయినప్పటి నుంచి సర్దుకుపోతున్నాను. ఓపిక నశించిపోతుంది. చెబితే వినేరకమా తను అని సత్యం అంటాడు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆదర్శంగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోవాలిరా. ప్రభావతితో మాట్లాడురా అని సుశీల అంటుంది.
ప్రభావతి వెళ్లి మీనాకు క్షమాపణ చెబితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సారీ చెప్పమంటే పౌరుషంగా గాజులు తీసి మీనా మొహం మీద కొట్టిందని సత్యం చెబుతాడు. దాంతో సుశీల మరింత షాక్ అవుతుంది. తర్వాత అందరిముందు పంచాయితీ పెడుతుంది సుశీల.
మీనాకు, మీనా పుట్టింటి మీద నింద మోపినందుకు క్షమాపణ కచ్చితంగా చెప్పాల్సిందే అని సత్యం అంటాడు. ఈ విషయంలో ఎక్కడా తగ్గడు. దాంతో మీనాకు ప్రభావతి క్షమాపణ చెబుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


