గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: భార్యతో సత్యం తెగదెంపులు-తలుపేసుకుని ప్రభావతి అఘాయిత్యం-కలిపేందుకు బాలు మీనా ప్లాన్
గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 3 ఎపిసోడ్‌లో మనోజ్ మోసం బయటపడిన ఇంకా మీనానే అంటుంది ప్రభావతి. దాంతో భార్యపై చేయి ఎత్తి ఆగిపోతాడు సత్యం. ఇకనుంచి నేను నీకు భర్తను కాదు అని తెగదెంపులు చేసుకుంటాడు సత్యం. అందరూ నన్ను వెలేయండి అని తలుపేసుకుంటుంది ప్రభావతి. అఘాయిత్యం చేసుకుంటుందేమో అని మీనా భయపడుతుంది.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ చేసిన మురికిని ఎలా కడగాలో చెప్పండి అని మీనా అంటుంది. అమ్మలానే వీడు తయారయ్యాడు అని బాలు అంటాడు. నాలుగు రోజులు నీ నగలు నీ మొహాన పడేస్తాను అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని ఏం పడేస్తావ్. దొంగతనం చేసి అమ్ముకుంది కాక అంటున్నావా అని తెగ కొడతాడు సత్యం.

ప్రభావతిపై చేయి ఎత్తిన సత్యం
ప్రభావతి ఆపడానికి వస్తే తనను తోసేసి ఇంకా ఫైర్ అవుతాడు. నన్ను ముట్టుకోకు. అసలు నిన్ను కొట్టాలి అని ప్రభావతిపై చేయి ఎత్తుతాడు సత్యం. మళ్లీ ఆగిపోతాడు. ఎందుకింతా చేశావ్ అని నిలదీస్తాడు సత్యం. జరిగిన మోసాన్ని ఇలా దాస్తావా అని చివాట్లు పెడతాడు సత్యం. మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావ్. నా భార్య నగలు ఎలా దొంగతనం చేశావురా అని బాలు కొడతాడు.
రవి ఆపుతాడు. ఎందుకు వాన్ని ఆపుతున్నారు అని సత్యం అంటాడు. అందరు మనోజ్‌ను కొట్టి చంపేస్తారా అని రోహిణి అంటుంది. అందరికంటే కోపం నీకే కదా రావాలి. నిజం ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని శ్రుతి అంటుంది. నిన్ననే తెలిసింది అని రోహిణి చెబుతుంది. అంతా షాక్ అవుతారు. శుభం అందరూ తోడుదొంగలే అని బాలు అంటాడు.
ఏదో మోసపోయి ఇలా చేశాడు. నాకు ముందు తెలిస్తే ఇలా చేయించేదాన్ని కాదు అని రోహిణి అంటుంది. మోసపోవడం తప్పు కాదు మోసం చేయడం తప్పు అని మీనా అంటుంది. ఏయ్ అంటూ ప్రభావతి వేలెత్తితే.. ఏయ్.. అంటూ అత్తపై వేలెత్తుతూ రివర్స్ అవుతుంది మీనా. కానీ, సత్యంను చూసి ఒక్కసారిగా ఆగిపోతుంది.
ముష్టి కింద పడేశారు
క్షమించండి అత్తయ్య. మీ కొడుకును దొంగలా పెంచిందే మీరు. అందుకే ఒక్క క్షణం గౌరవం పోయిందని మీనా అంటుంది. మాట్లాడితే నీ నగలంటున్నావ్. మీ అమ్మ చేయించిందా. మా అత్తగారు మా ఆయన ముష్టికింద పడేశారు అని ప్రభావతి అంటుంది. ఏంటీ ముష్టి కింద పడేశారా. మరి ఆ ముష్టినే ఎత్తుకెళ్లిన మీ తల్లికొడుకులను ఏమనాలి అని సత్యం అంటాడు.
వాడికి ఏమైన మంచి లక్ష్మణాలు నేర్పావా. వాడికి ఏనాడైన నీతి, నిజాయితి నేర్పావా. వాడు మోసపోవడం, నగలు అమ్మడం అన్ని తెలిసి మీనా అమ్మ బంగారం కొట్టేసింది అంటావా. మా అమ్మ గిల్ట్ నగలు పెట్టిందని నింద వేస్తావా. అమ్మో ఇన్నాళ్లు పక్కన పామును పెట్టుకుని బతికినట్లు నీతో ఉన్నానంటేనే ఒళ్లు జలదరిస్తుంది. నీలాంటి దాంతో ఇంతకాలం కాపురం చేసినందుకు నా మీదే నాకే అసహ్యం వేస్తుంది అని సత్యం అంటాడు.
నువ్వు నా భార్యవి కావు నేను నీ భర్తను కాదు. ఇలాంటి దొంగబుద్ధి ఉన్న నీకు నేను భర్తగా ఉండలేను. నీతో పచ్చి మంచినీళ్లు కూడా తాగను. అభిమానం గల ఆడదానివి అయితే నాకు ఎదురు పడకు అని సత్యం అంటాడు. ఇప్పుడేం చేశాను. కొడుకు కోసమేగా చేశాను. నాతో మాట్లాడరు కదా. సరే అందరూ నన్ను వెలేయండి అని లోపలికి వెళ్లి తలుపేసుకుంటుంది ప్రభావతి.
గెంటేస్తారన్న భయంతో
నిన్ను క్షమించడం తప్ప నాకు ఇంకోదారి లేదు. నిజానికి ఇలాంటి వాడిని ఏ భార్య క్షమించదు. మీ వాళ్ల తప్పు లేదు. మావయ్య గారు ఎక్కడ నిన్ను గెంటేస్తారో అని కాపాడాను. అత్తయ్య చాలా మాటలు పడ్డారు. నువ్వు తలుపు తీయమని అడుగు అని రోహిణి చెబుతుంది. మనోజ్ తలుపు తీయమంటాడు. సారీ చెబుతాడు. రవి, శ్రుతి వచ్చి మనోజ్‌ను అంటారు.
నువ్వు ఒక్కడివి మిగిలావా అని రోహిణి అంటే.. ఇంకా మనోజ్‌ను వెనకేసుకొస్తున్నావా. రవి చేస్తే నేను అయితే ఎగిరి తన్ని పుట్టింటికి వెళ్లేదాన్ని అని శ్రుతి అంటుంది. తర్వాత అంతా కలిసి ప్రభావతిని పిలుస్తారు. ఒక్క శ్రుతి మాత్రం పట్టించుకోదు. అంతా కలిసి సత్యంను రిక్వెస్ట్ చేస్తారు. తప్పు చేసి దొరికిపోయినప్పుడు మా అమ్మ వాడే ఆయుధం ఇదే అని బాలు అంటాడు.
సత్యంను క్షమించమని మనోజ్ అడుగుతాడు. ప్రభావతిని క్షమించి పిలవమని చెబుతారు. నాకు సంబంధం లేని వాళ్ల గురించి నన్ను అడగకండి అని సత్యం అంటాడు. బాలు చెప్పిన వినడు. అదంతా నాటకం, తను మారదు అని సత్యం అంటాడు. ప్రభావతి ముందు నుంచి చేసిన తప్పులన్ని చెప్పిన సత్యం క్షమించలేను అంటాడు. ఇంట్లో ఉండాలా లేదా గుడి అరుగు మీద పడుకోవాలా అని సత్యం అంటాడు.
బాలు, మీనా ప్లాన్
దాంతో ఏం మాట్లాడకుండా అంతా వెళ్లిపోతారు. అత్తయ్య అఘాయిత్యం చేసుకుంటారో అని మీనా భయపడితే అలా ఏం చేయదని బాలు అంటాడు. మరుసటి రోజు మావయ్య, అత్తయ్యను ఎలాగైనా కలపాలని మీనా, బాలు అనుకుంటారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


