నిన్ను కోరి డిసెంబర్ 12 ఎపిసోడ్: గుడిలో రాజ్‌, శ్రుతి పెళ్లి-పెన్ కెమెరా క‌నిపెట్టిన శాలిని-మరో ప్లాన్ వేసిన చంద్ర‌

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 12 ఎపిసోడ్ లో అమ్మ పెళ్లికి ఒప్పుకోదు కాబట్టి గుడిలో పెళ్లి చేసుకుందామని రాజ్ కు చెప్తుంది శ్రుతి. మరోవైపు నిజాలు అన్నీ చెప్పేసిన శాలిని పెన్ కెమెరాను కనిపెడుతుంది. విరాట్, చంద్ర మరో ప్లాన్ వేస్తారు. 

Published on: Dec 12, 2025 7:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 12 ఎపిసోడ్ లో అమ్మ నన్ను కొట్టిందని రాజ్ తో శ్రుతి చెప్తుంది. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఏంటీ? అని పూర్తిగా అడకుండానే కొట్టింది. మన పెళ్లికి అమ్మ అసలు ఒప్పుకోదు. నా లైఫ్ లో రెండో ముఖ్యమని నిర్ణయం తీసుకుంటా. నిన్నే పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుని వెళ్లి ముందు నిలబడితే అమ్మనే ఒప్పుకుంటుందని శ్రుతి అనడంతో రాజ్ కు షాక్ తగులుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

గుడిలో పెళ్లి

సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకుందాం. అమ్మ రాంగ్ అని ప్రూవ్ చేయాలి. రేపే రామాలయంలో పెళ్లి అని రాజ్ తో శ్రుతి అంటుంది. శ్రుతిని ఫాలో చేసిన మధు శాలినికి కాల్ చేస్తాడు. రేపు రామాలయంలో పెళ్లి చేసుకుందామని శ్రుతి చెప్పిందని మధు చెప్పాడు.

కెమెరా చూసేసిన శాలిని

పెన్ కెమెరా ముందుకు శాలిని వచ్చిందని చూసి చంద్రకళ కావాలని రెచ్చగొడుతుంది. నిన్ను రాక్షసిలా మార్చింది మీ అమ్మే కదా అని అని చంద్ర అంటుంది. దీంతో రెచ్చిపోయిన శాలిని మా అమ్మ కోసమే ఇదంతా చేస్తున్నా. ఈ ఇంట్లో జరిగే గొడవలన్నింటినీ కావాలనే క్రియేట్ చేస్తున్నా అని చెప్తూ శాలిని పెన్ కెమెరా చూస్తుంది. వెంటనే మాట మారుస్తుంది. కెమెరా తీసి ఆఫ్ చేస్తుంది. నాకు తెలియకుండా ట్రాప్ చేస్తున్నావా చంద్ర? నాతో పెట్టుకోకు చంద్ర అంత ఈజీ కాదు అని శాలిని అంటుంది.

పెళ్లి కోసం

మరోవైపు రూ.300 తిరిగి ఇవ్వమని సరోజాను అడుగుతుంది లక్ష్మి. నువ్వు, నీ కొడుకు వేసే వేషాలు నాతో పాటు కాలనీలోని వాళ్లందరికీ తెలుసు. రేపటి లోగా డబ్బు ఇవ్వకపోతే అంతేనని లక్ష్మి వెళ్లిపోతుంది. శ్రుతి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని రాజ్ చెప్తాడు. ఆ పిల్ల తింగరిది రేపు వచ్చి పెళ్లి వద్దని అంటుందని సరోజా అంటుంది. పెళ్లి కోసం అప్పు మాత్రం చేయలేనని తేల్చి చెప్పేస్తుంది.

చంద్ర మరో ప్లాన్

ఎన్ని ప్లాన్ లు వేసినా అన్ని మనకే రివర్స్ అవుతున్నాయి. ఆ శాలిని దొరకట్లేదు. త్వరగా ప్లాన్ చేయాలని విరాట్ అంటాడు. శాలిని ప్లాన్ ఏంటో మనం ముందుగా కనిపెట్టి, క్రాంతికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేలా చేయాలని చంద్రకళ చెప్తుంది. అప్పుడు క్రాంతి నమ్ముతాడని విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు శాలిని నెక్ట్స్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలని చంద్ర అంటుంది.

రూ.2 లక్షలు

శ్రుతి సంతోషంలో మునిగిపోతుంది. రేపు నా పెళ్లి కదా అని శ్యామలకు చెప్తుంది. కానీ శ్యామల మాత్రం నమ్మదు. రాజ్ ఫోన్ చేసి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు కంపెనీల పైకి వస్తారని అకౌంట్లు అన్ని ఫ్రీజ్ చేశామని అంటాడు. రేపటి లోపు రూ.2 లక్షలు అరెంజ్ చేయాల్సింది నువ్వే అని రాజ్ అంటాడు. నేను చూసుకుంటాలే అని శ్రుతి అంటుంది. కానీ ఆ రూ.2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలని శ్రుతి ఆలోచిస్తుంది.

శాలినిని హెల్ప్ చేయాలని అనుకుంటుంది శ్రుతి. శాలిని దగ్గరకు వెళ్లి రూ.2 లక్షలు కావాలని అడుగుతుంది. అంత డబ్బు ఎందుకు అంటే నాకు కాదు నా ఫ్రెండ్ కు అని శ్రుతి అబద్ధం చెప్తుంది. నేను ఇవ్వలేను చంద్రను అడుగు అని శాలిని చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.