నిన్ను కోరి డిసెంబర్ 6 ఎపిసోడ్: జాలి రాజ్ ఫ్రాడ్ అని తెలుసుకున్న శాలిని- డాక్టర్‌లా మారిన రఘురాం- నోరు జారిన శ్రుతి లవర్
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు ఇంట్లోవాళ్లు. అక్కడ శాలినితో డ్రామా ఆడిన డాక్టర్‌ను చంద్ర చూసి ఫాలో అవుతుంది. మరోవైపు శ్రుతిని రాజ్‌తో చూసిన శాలిని ఫాలో అవుతుంది. రాజ్ పెద్ద ఫ్రాడ్ అని నిజం తెలుసుకుంటుంది శాలిని. రఘురాం డాక్టర్‌లా మారిపోతాడు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం పిజ్జా ఆర్డర్ చేస్తాడు. క్రాంతి, విరాట్‌ను వచ్చి కూర్చోమంటాడు. ఇద్దరికి ఇస్తే తినరు. రఘురామే ఇద్దరికి పిజ్జా తినిపిస్తాడు. అందరికి ఇస్తారు. శ్రుతి మాత్రం పిజ్జా తినకుండా వెళ్లిపోతుంది. విరాట్, క్రాంతి సీరియస్‌గా ఉంటే ఏమైందిరా, గొడవ జరిగిందా అని రఘురాం నిలదీస్తాడు.

విరాట్ క్రాంతి నటన
మళ్లీ ప్రాంక్ చేస్తున్నారా అని చంద్రకళ అంటుంది. దాంతో ఏం గొడవలు జరగనట్లు విరాట్, క్రాంతి నటిస్తారు. ఎంత బాగా నటిస్తున్నారా అని మనసులో అనుకున్న రఘురాం చిన్నప్పుడు వాళ్లు చేసిన అల్లరి గుర్తు చేస్తాడు రఘురాం. విరాట్‌కు కాల్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లాలని అంటాడు.
క్రాంతి ఫోన్ వచ్చిందని వెళ్లిపోతాడు. రఘురాంకు ఏం గుర్తు లేదని కామాక్షి, శ్యామల మాట్లాడుకుంటుంటే తనకు అంతా గుర్తుందని రఘురాం అంటాడు. విరాట్, క్రాంతిని కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడు రఘురాం. దాంతో శ్యామల, కామాక్షి సంతోషిస్తారు. తర్వాత రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ శాలినితో ప్రెగ్నెన్సీ డ్రామా ఆడిన డాక్టర్ చంద్రకళకు కనిపిస్తుంది.
రాజ్‌ను ఫాలో అయిన శాలిని
దాని గురించి విరాట్‌కు చెబుతుంది చంద్రకళ. మరోవైపు శ్రుతి, జాలి రాజ్ మాట్లాడుకుంటారు. పెళ్లి గురించి ఇంట్లో ఒప్పించాలని రాజ్ అంటాడు. నాకు రోజు రోజు ఇబ్బంది అవుతుంది. అక్కడ అప్పు కుప్పలు కుప్పలు అవుతుందని నోరు జారుతాడు రాజ్. దాంతో శ్రుతి నిలదీస్తుంది. నీ మీద చూపించే ప్రేమ అప్పుగా పెరిగిపోతుందని కవర్ చేస్తాడు రాజ్.
రాజ్‌తో బైక్‌పై వెళ్తున్న శ్రుతిని శాలిని చూస్తుంది. నీలాంటి పిచ్చి మొహాన్ని ప్రేమిస్తున్నాడంటే ఏదో ఉంది అని ఫాలో అవుతుంది శాలిని. తర్వాత రాజ్ ఒక్కడినే ఫాలో అవుతుంది శాలిని. రఘురాంను యూరిన్ టెస్ట్‌కు తీసుకెళ్లినట్లు చేసి డాక్టర్ ఉందో లేదో చంద్రను చూడమంటాడు విరాట్. చంద్ర వెళ్లి చూస్తే అక్కడ డాక్టర్ ఉంటుంది. రఘురాంను డాక్టర్ దగ్గరికి పంపించి తాము వెళ్లి లేడి డాక్టర్‌ను ఒప్పించాలనుకుంటారు విరాట్, చంద్ర.
తప్పిపోయిన రఘురాం
ఇంతలో సౌండ్ రావడంతో రఘురాం ఇరిటేట్ అవుతాడు. అంతా మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలి అనుకుంటాడు. డాక్టర్‌తో మాట్లాడాలని లోపలికి వెళ్తారు చంద్ర, విరాట్. ఈవిడ శాలిని తోటి కోడలులా ఉందని డౌట్ పడిన డాక్టర్ పేషంట్ ఉందిగా తర్వాత వచ్చి మాట్లాడండి అని చెబుతుంది. మరోవైపు రాజ్ తన ఫ్రెండ్‌కు బైక్ ఇచ్చి అద్దె ఇవ్వడం గురించి మాట్లాడుతాడు.
అదంతా శాలిని చూస్తుంది. వెళ్లి రాజ్ ఫ్రెండ్‌ను శాలిని ఆరా తీస్తుంది. దాంతో రాజ్ పెద్ద ఫ్రాడ్ అని, అమ్మాయిలను పడేసేందుకు బైక్స్, కారులు అద్దెకు తీసుకుంటాడని చెబుతాడు రాజ్ ఫ్రెండ్. అదంతా చూసిన శాలిని భలే క్యాండేట్‌ను పట్టావ్ శ్రుతి. వీన్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ చేపలు పట్టాల్సిందే అని నవ్వుకుంటుంది శాలిని.
డాక్టర్‌లా రఘురాం
మరోవైపు డాక్టర్ రూమ్‌లోకి వెళ్లిన రఘురాం అక్కడ డాక్టర్ కోట్ వేసుకుంటాడు. డాక్టర్‌లా చైర్‌లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషంట్ వచ్చి డాక్టర్ డాక్టర్ అంటాడు. దానికి నేను ఇక్కడ డాక్టర్‌నా. నాకు ఆ విషయం తెలియదే అని రఘురాం అనుకుంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


