నిన్ను కోరి డిసెంబర్ 5 ఎపిసోడ్: కొడుకులను కలుపుతానన్న రఘురాం-శాలిని నిజస్వరూపం బయటపెట్టేలా విరాట్, చంద్ర ప్లాన్
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 5 ఎపిసోడ్ లో రఘురాం అంతా మర్చిపోయినట్లు డ్రామా ఆడతాడు. కానీ జగదీశ్వరికి మాత్రం అంతా గుర్తుందని చెప్పి షాక్ ఇస్తాడు. శాలిని నిజ స్వరూపం బయట పెడతానని చంద్ర ఛాలెంజ్ చేస్తుంది. విరాట్, చంద్ర కలిసి అదే పని మీద ఉంటారు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో కళ్లు తెరిచిన రఘురాం ఏం జరగనట్లుగా అన్నీ మర్చిపోయి మాట్లాడతాడు. ఈ రోజు నా పుట్టిన రోజా? అందరూ విష్ చేయండని అడుగుతాడు. రాత్రి ఏమైనా జరిగిందా? అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదని అందరూ అబద్దం చెప్తారు.

రఘురాం షాక్
అందరిని వెళ్లిపోమ్మని చెప్తాడు రఘురాం. అప్పుడు అంత పెద్ద గొడవను తేలిగ్గా ఎలా మర్చిపోయానని చూస్తున్నావా?అంతా గుర్తుంది అని జగదీశ్వరికి షాక్ ఇస్తాడు రఘురాం. శాలిని కడుపు పోవడానికి కారణం నువ్వే అని క్రాంతి, కడుపులో బిడ్డ లేదని విరాట్ గొడవ పడ్డారు. తండ్రిగా ఆ ఇద్దరిని కలుపుతానని చెప్తాడు రఘురాం.
అందరినీ నమ్మించా
చంద్రకళ దగ్గరకు వచ్చి శాలిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మామయ్య మతిమరుపు నీకు వరం. ఆయనకు అన్ని గుర్తొచ్చిన రోజు నీ పాపం పండుతుందని చంద్ర అంటుంది. లేని ప్రెగ్నెన్సీని నువ్వే పొగొట్టావని డ్రామా ఆడాను. ఇంటికి నువ్వే శత్రువు అని నా భర్తను, శ్యామల, కామాక్షిలను నమ్మించా. వీళ్లంతా నాకు రక్షణ కవచంలా ఉంటారని శాలిని అంటుంది.
చంద్ర ఛాలెంజ్
ఇంటిని సర్వనాశనం చేస్తానని శాలిని అంటుంది. నేను అది చేయనివ్వనని చంద్రకళ చెప్తుంది. నువ్వుంటేనే నా పని ఇంకా ఈజీ అవుతుంది చంద్ర. నేను చేసేవన్ని చేసి ఆ నిందలు నీపై వేయొచ్చని శాలిని అంటుంది. ఇన్ని రోజులు నిన్ను మార్చి ఇంటిని బాగు చేద్దామనుకున్నా. కానీ కుక్క తోక వంకర అన్నట్లు నీ బుద్ధి మారదని తెలిసొచ్చింది. తులసి వనంలో గంజాయి మొక్క చేరితే పీకేయాలి. అదే నా ధ్యేయం. ఈ రోజు నువ్వు కొత్త చంద్రను చూస్తావని వార్నింగ్ ఇస్తుంది చంద్ర.
నీ గురించి క్రాంతికి తెలిసేలా చేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపిచేస్తానని చంద్ర ఛాలెంజ్ చేస్తుంది. చూసుకుందామని శాలిని అంటుంది.
విరాట్, చంద్ర ప్లాన్
ప్రూఫ్స్ ఉన్నా కూడా శాలినిని ఏం చేయలేకపోయామని విరాట్ అంటాడు. శాలిని నోటితోనే నిజాలన్నీ బయటకు వచ్చేలా చేస్తా. ఆమె మారదని అర్థమైంది. శాలిని ఉంటేనే క్రాంతి జీవితం నాశనమైపోతుంది. అందుకే శాలిని నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలని చంద్ర అంటుంది. ఇంకా తన గురించి తెలిసేలా చేస్తానని విరాట్ చెప్తాడు.
క్రాంతిని రెచ్చగొట్టేలా
మరోవైపు క్రాంతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది శాలిని. మీ అన్న, వదినల్లో మార్పు రాదు. మామయ్యను కొట్టింది నేనే అని ఒప్పుకునేంత వరకూ టార్చర్ చేస్తూనే ఉంటారు. బిడ్డ పోయిన బాధలో ఉన్నా కూడా వదల్లేరని శాలిని మళ్లీ డ్రామా ఆడుతుంది. మన జోలికి వాళ్లు రాకుండా చేస్తానని క్రాంతి అంటాడు. రఘురాం పిజ్జా ఆర్డర్ చేస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


