నిన్ను కోరి డిసెంబర్ 4 ఎపిసోడ్: ఇంట్లోంచి వెళ్లిపోతామన్న విరాట్- చేతులెత్తి మొక్కి ఆపిన తల్లి- చంద్రకళ, శాలిని ఛాలెంజ్
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో శాలినికి అసలు ప్రెగ్నెన్సీనే కాలేదని రిపోర్ట్స్ చూపిస్తాడు విరాట్. రఘురాంపై మరింత స్ట్రెస్ పెట్టి స్పృహ తప్పేలా చేస్తుంది శాలిని. దాంతో తాము ఇంట్లోంచి వెళ్లిపోతామని జగదీశ్వరి అంటే మీరు కాదు మేము వెళ్తామని విరాట్ అంటాడు. కానీ, తల్లి జగదీశ్వరి ఆపుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను నిజం దాచడం వల్ల నాన్న ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని విరాట్ అంటాడు. అసలు ఆరోజు నిన్ను తల మీద కొట్టింది శాలినినే. తన బండారం ఎక్కడ బయటపడుతుందేమో అని ప్రెగ్నెంట్ అని కొత్త నాటకం ఆడిందని విరాట్ అంటాడు. అసలు శాలినికి ప్రెగ్నెన్సీయే లేదు అని విరాట్ గట్టిగా చెబుతాడు.

అడ్వాంటేజ్‌గా తీసుకుని
మాటలు ఉంటే సరిపోతుందా. సాక్ష్యాలు ఉండక్కర్లేదా అని కామాక్షి అంటుంది. ఉంది అని విరాట్ రిపోర్ట్స్ చూపిస్తాడు. ఆ రిపోర్ట్స్ చూసి నిజమే అంటుంది కామాక్షి. రఘురాం మరింత స్ట్రెస్ అవుతాడు. అది అడ్వాంటేజ్‌గా తీసుకుని బయటపడదామని మరింత ఒత్తిడి పెంచుతుంది శాలిని. ఎమోషనల్ డ్రామా చేస్తుంది.
నా తల పగలిపోతుంది. నరాలు చిట్లుపోతున్నాయి. ఇంట్లో అంతా కలిసి ఉన్నారనుకున్నా. కానీ లేదు. నా వల్ల కావట్లేదు అని రఘురాం అంటాడు. మాట మాట పెరిగి తండ్రి ముందే విరాట్, క్రాంతి కాలర్ పట్టుకుని కొట్టుకుంటారు. ఇప్పుడు వీడి వీక్‌నెస్ మీద కొడితే దెబ్బకు ఫెయింట్ అయిపోతాడు అని ఓ వస్తువు కింద పడేస్తుంది శాలిని.
దగ్గరికి రావొద్దన్న తల్లి
ఆ సౌండ్‌కు రఘురాం స్పృహ కోల్పోతాడు. తండ్రి దగ్గరికి కొడుకులు వెళ్తే జగదీశ్వరి ఆపుతుంది. దగ్గరికి రావద్దని చెబుతుంది. తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. ప్రశాంతంగా ఉంచమని చెప్పాను. ఇలా గొడవ పడితే ఎలా. ఇప్పుడు స్పృహ మాత్రమే కోల్పోయారు. ఇలాగే జరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతాడు.
ఓసారి హాస్పిటల్‌కు తీసుకొస్తే టెస్టులు చేస్తే ట్రీట్‌మెంట్ మారుస్తాను అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. మళ్లీ విరాట్, క్రాంతి వాదులాడుకుంటారు. జగదీశ్వరి ఆపుతుంది. మీ గొడవల వల్ల ఆయన ప్రాణాలకు ప్రమాదం అని తెలిశాక ఇంకా ఆలోచించనను. ఆయన్ను తీసుకోని నేను బయటకు వెళ్లిపోతాను అంటుంది జగదీశ్వరి. ఇప్పుడు నీకు బాగుందా. అన్నదమ్ములను విడగొట్టావ్ అని చంద్రను అంటుంది శ్యామల.
నిందలు పడాల్సిన అవసరం లేదు
మీరు కాదమ్మా వెళ్లాల్సింది మేము. చంద్రకళ ఈ ఇంటికి ఎంతో చేసింది. కానీ, ఎవరు తనను అర్థం చేసుకోరు. ఇక్కడ ఉంటు నిందలు పడాల్సిన అవసరం లేదు. మనమే వెళ్దామని విరాట్ అంటాడు. హమ్మయ్యా మొత్తానికి నాకు చంద్రకళ బాధ తప్పిపోతుంది అని శాలిని అనుకుంటుంది. చంద్ర ఎంత చెప్పిన విరాట్ ఆగడు.
రిపోర్ట్స్ చూపించిన ఫేక్ అనుకుంటున్నారు కానీ, శాలినిని ప్రశ్నించట్లేదు అని క్రాంతి అంటాడు. ఇప్పుడు అన్నయ్య స్పృహ లేచాక విరాట్ లేడని తెలిస్తే మరింత స్ట్రెస్ అవుతాడు అని శ్యామల చెబుతుంది. మనం వెళ్తే శాలిని మరింత రెచ్చిపోతుంది. తనను ఎవరు నిలదీయరు. తను మారుతుందని ఆగాను. ఇకనుంచి అదేం చూడను అని చంద్రకళ అంటుంది.
చేతులెత్తి మొక్కిన జగదీశ్వరి
చంద్రకళను కనిపెట్టుకుంటూ ఉంటాను అని శ్యామల అంటుంది. విరాట్ వస్తాడు. నువ్వెళ్లడానికి వీళ్లేదు అని చేతులెత్తి మొక్కుతుంది జగదీశ్వరి. ఎక్కడికి వెళ్లట్లేదు అని విరాట్ అంటాడు. మరుసటి రోజు ఉదయం జగదీశ్వరి పూజ చేసి రఘురాం బాగు పడాలని దేవుడిని కోరుకుంటుంది.
తర్వాత ఈ ఇంటిని కూల్చేస్తానని శాలిని అంటే.. నీ గురించి క్రాంతికి తెలిసేలా చేసి ఇంటి నుంచి పంపించేలా చేస్తానని చంద్ర అంటుంది. ఇద్దరు చూసుకుందామని ఛాలెంజ్ చేసుకుంటారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


