నిన్ను కోరి నవంబర్ 29 ఎపిసోడ్: శాలిని పీక పట్టుకున్న చంద్రకళ- శ్రుతి లవ్‌లో విలన్- తప్పిపోయిన రఘురాం- జగదీశ్వరి ఏడుపు
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 29 ఎపిసోడ్‌లో శాలిని కావాలనే బొప్పాయి ముక్కలు తినడం చూసిన చంద్రకళ హాస్పిటల్‌కు ఎంక్వైరీ చేస్తుంది. శాలినికి ప్రెగ్నెన్సీ రాలేదని తెలుసుకుంటుంది చంద్రకళ. మరోవైపు శ్రుతిని ఫాలో అయిన రఘురాం పార్క్‌లో తప్పిపోతాడు. భర్త కనిపించకపోవడంతో జగదీశ్వరి ఏడుస్తుంటుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం మెదడులోని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకునిపోయేలా చేస్తాను. ఎలాగు నిందలు నీ మీదే పడతాయి అని శాలిని అంటుంది. ఒక్కటిచ్చానంటే షేప్ పోతుంది. కడుపుతో ఉన్నావని ప్రతిసారి క్షమించను. నీ పనులకు అడ్డు పడతాను అని చంద్రకళ అంటుంది. ఛాలెంజ్ చేస్తున్నాయు. చేయు ఆల్ ది బెస్ట్ అని వెళ్లిపోతుంది శాలిని.

శ్రుతిని ఫాలో అయిన రఘురాం
మరోవైపు చేపలు అమ్ముతుంటాడు రాజ్. శ్రుతి కాల్ చేస్తుంది. కలవడం గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు రఘురాం వింటాడు. అరగంటలో పార్క్‌లో కులుద్దామనుకుంటారు. ఈ పొట్టిది ఏదో పిచ్చి పని చేస్తుంది. ఫాలో అయి కనిపెడదామని ఫాలో అవుతాడు రఘురాం. మరోవైపు శాలిని ఫ్లవర్ పాట్ కింద పడేయడం గురించి చంద్రతో మాట్లాడుతాడు విరాట్.
ఇంట్లోనే నాన్న మీద అటాక్ చేసింది. ఏం జరిగినా నీ మీద తోసేయొచ్చు అనే. మళ్లీ నాన్న మీద అటాక్ ప్లాన్ చేస్తుంది. శాలిని ప్రతి అడుగు కనిపెట్టాలి. అందుకే ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టించాలనుకుంటున్నాను. అప్పుడు శాలిని ఏం చేయదు. చేసిన తెలిసిపోతుంది అని విరాట్ అంటాడు. కానీ, దానివల్ల మరింత గొడవలు ఎక్కువ అవుతాయని చంద్ర వద్దంటుంది.
తనపై ప్రేమ చూపిస్తున్న విరాట్‌కు ముద్దు పెడుతుంది చంద్రకళ. దానికి విరాట్ ఆశ్చర్యపోతాడు. తర్వాత కిచెన్‌లో శాలిని బొప్పాయి ముక్కలు తినబోతుంటే కామాక్షి ఆపుతుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్లు తినకూడదుగా అని చెబుతుంది కామాక్షి. సరే అని చెప్పిన శాలిని కామాక్షి వెళ్లిపోయిన తర్వాత బొప్పాయి ముక్కలు తింటుంది. కానీ, అది చూస్తుంది చంద్రకళ.
శాలిని ప్రెగ్నెన్సీ అబద్ధమా
తర్వాత క్రాంతి వచ్చి శాలినిని తీసుకెళ్లిపోతాడు. అన్ని గుర్తు చేసుకున్న చంద్రకళ ఆలోచిస్తుంది. శాలినికి బిడ్డపై ప్రేమ లేదా అసలు కడుపులో బిడ్డే లేదా. ఒకవేళ ప్రెగ్నెన్సీ అబద్దం అయితే శాలిని పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిందే అని చంద్రకళ అనుకుంటుంది. ఆఫీస్‍కు అని చెప్పి చంద్రకళ వెళ్లిపోతుంది.
రఘురాం కోసం జగదీశ్వరి వెతుకుతుంది. ఆఫీస్‌కు అని చెప్పిన చంద్రకళ హాస్పిటల్‌కు వెళ్తుంది. డాక్టర్‌ను అడగలేను. శాలిని, డాక్టర్ కలిసి డ్రామా ఆడుతున్నట్లే అనుకున్న చంద్రకళ రిసెప్షన్‌లో శాలిని రిపోర్ట్స్ గురించి అడుగుతుంది చంద్రకళ. డీటేల్స్ చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతుంది. అందులో శాలిని పేరు లేదని రిసెప్షనిస్ట్ లేదని చెబుతుంది.
మరోసారి చూడమని చంద్ర అంటే.. ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్‌మెంట్ తీసుకున్న వాళ్ల లిస్ట్‌లో ఉంది. కానీ, ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని రిసెప్షనిస్ట్ చెబుతుంది. దానికి చంద్రకళ షాక్ అవుతుంది. ఆ రిపోర్టే కావాల్సిందే అని చంద్రకళ తీసుకుంటుంది. ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది చంద్రకళ. మరోవైపు రఘురాం కనిపించట్లేదని జగదీశ్వరి టెన్షన్ పడుతుంది.
పార్క్‌లో తప్పిపోయిన రఘురాం
ఇల్లంతా చూస్తారు. ఫోన్ కూడా లేదని చెబుతుంది జగదీశ్వరి. మరోవైపు పార్క్‌లో రాజ్‌ను కలుస్తుంది శ్రుతి. అదంతా రఘురాం చూస్తాడు. అమ్మాయి గారు ప్రేమలో పడ్డారన్నమాట అనుకుంటాడు. రఘురాం మతిమరుపు గురించి చెబుతుంది. నీ లవ్ స్టోరీలో నన్ను విలన్‌ను చేస్తావా. నీ సంగతి చెబుతా అని వాళ్లను ఫాలో అవుతాడు రఘురాం.
ఇంతలో ఓ బాబు బెలూన్ పగులగొట్టడంతో డిస్ట్రాక్ట్ అవుతాడు రఘురాం. ఇక్కడ ఉన్నానేంటీ. పార్క్‌కు ఎందుకు వచ్చాను. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తాడు రఘురాం. మరోవైపు నాన్న ఎక్కడ కనిపించట్లేదని విరాట్ చెబుతాడు. దాంతో జగదీశ్వరి ఏడుస్తుంటుంది.
తర్వాత శాలినిని కొడుతుంది చంద్రకళ. దానికి ఇంటి వారసుడు అంటూ శాలిని బెదిరిస్తుంది. దాంతో శాలిని పీక పట్టుకుంటుంది చంద్రకళ. కడుపే రాకుండా వారసుడు ఎలా వస్తాడు. నిజం తెలిసిపోయిందని చంద్రకళ చెబుతుంది. దాంతో శాలిని షాక్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


