నిన్ను కోరి నవంబర్ 27 ఎపిసోడ్: గుడిలో భగ్గుమన్న చీరలు- చంద్రకళపై నిందలు- రఘురాం సౌండ్ సీక్రెట్ తెలుసుకున్న శాలిని
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 27 ఎపిసోడ్‌లో గుడిలో హోమం జరిపిస్తుంటే రఘురాం సౌండ్స్‌కు డిస్ట్రాక్ట్ అవడం గమనిస్తుంది శాలిని. దాన్ని బాగా వాడుకోవచ్చు అనుకుంటుంది. చీరలపై స్ప్రే చల్లడంతో అగ్ని అంటుంకుటుంది. ముత్తయిదువులకు ఇచ్చే చీరలు భగ్గుమనడంతో అంతా చంద్రకళను నిందిస్తారు. చంద్ర ఏడుస్తుంటుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో రఘురాం, జగదీశ్వరి హోమం చేస్తుంటారు. గుడిలో గంట సౌండ్ వినపడినప్పుడల్లా డిస్టర్బ్ అవుతాడు రఘురాం. అది శాలిని కనిపెడుతుంది. ఈ పాయింట్ వాడుకోవచ్చు అనుకుంటుంది. పూజ అయిపోతుంది. అందరూ పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.

భగ్గుమన్న చీరలు
ముత్తయిదువులకు వాయినం ఇచ్చి మొక్కు తీర్చుకోమ్మని చెబుతాడు పంతులు. చీరలు తీసుకురావడానికి చంద్రకళ వెళ్తుంది. వాటిని అమ్మ వారి పాదాల ముందు పెట్టమని పంతులు చెబుతాడు. దాంతో చంద్ర పెడుతుంది. చీరలపై స్ప్రే చల్లితే ఎంతదూరం ఉన్న మంట అంటుకుంటుందన్న విషయం శాలిని గుర్తు చేసుకుంటుంది. చూస్తుండగానే చీరలు అగ్నితో భగ్గుమంటాయి.
రఘురాం కంగారుపడతాడు. నువ్వు కావాలనే చేశావుగా అని చంద్రకళను నిందిస్తారు అంతా. పూజకు ఎలాంటి ఆటంకం కలిగించను అని అత్తయ్యకు మాటిచ్చాను. నేనెందుకు చేస్తాను అని చంద్రకళ అంటుంది. అయినా వినకుండా చంద్రకళను తిడుతూనే ఉంటారు శ్యామల, కామాక్షి. మొక్కు తీర్చుకోలేదన్న జగదీశ్వరి బాధను ఎలా తీరుస్తారు అని శ్యామల అంటుంది.
ఇంట్లోవాళ్ల మీద పగేంటీ
ముత్తయిదువులకు ఇచ్చే చీరలు కాలిపోయాయంటే అరిష్టం. అయినా ఇంట్లోవాళ్ల మీద ఈ పగేంటే ఈ పిల్లకు అని పక్కనున్న వాళ్లు అంటారు. అందరిని ఆపిన జగదీశ్వరి అమ్మవారిని క్షమించమని కోరుకుంటుంది. ఇంకోసారి తాను తన భర్త మాత్రమే వచ్చి మొక్కు చెల్లించకుంటామని చెబుతుంది. తర్వాత అంతా ఇంటికి వెళ్దామని అనుకుంటారు.
చంద్రకళ ఏడుస్తూ ఉంటుంది. విరాట్ వచ్చి ఓదార్చుతాడు. ఇంతలో శ్రుతి వచ్చి పిలుస్తుంది. దాంతో అంతా ఇంటికి వెళ్తారు. చంద్రకళ ఏడుస్తుంటే శాలిని వచ్చి నువ్వు ఓడుతుంటే చాలా సంతోషంగా ఉందని అంటుంది. నీ మీద గెలవాలని అనుకుంటే నువ్వు రోడ్డు మీద ఉండేదానివి అని చంద్రకళ అంటుంది. చీరలు కాలిపోవడం పొరపాటుగా జరగలేదు. నిన్ను బ్లేమ్ చేయడానికి నేను వేసిన పక్కా ప్లాన్ అది నిజం చెబుతుంది శాలిని.
అసలైన సక్సెస్ చూపిస్తాను
నువ్వే అన్ని దగ్గరుండి చూసుకుని నా పని ఈజీ చేశావ్. నీ మీద అత్తయ్యకు సాఫ్ట్ కార్నర్ ఉంది. అది పోయేందుకే ఇలా చేశాను. మావయ్యను కొట్టింది నువ్వే అని అనుకుంటుంది. ఇలా ఒక్కో మెట్టు ఎక్కి సక్సెస్ అవుతాను అని శాలిని ఛాలెంజ్ చేస్తుంది. అసలైన సక్సెస్ అందరి సంతోషంలో ఉంటుందని నిరూపిస్తాను. ఇక నేను ఏది జరగనివ్వను. నువ్ కోరుకున్న సక్సెస్ రానివ్వను అని సవాలు విసిరి వెళ్లిపోతుంది చంద్రకళ.
నా వల్ల అపచారం జరిగి అత్తయ్య మొక్కు తీర్చలేదని బాధగా ఉందని విరాట్‌తో అంటుంది చంద్రకళ. చీరలు మంట అంటుకోవడం ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ శాలిని ఏదైనా చేసిందంటావా అని డౌట్ పడతాడు విరాట్. లేదు బావ అని చంద్రకళ అబద్ధం చెబుతుంది. రుజువు లేదు. నువ్ గొడవ పడతావ్. దాని వల్ల ఒరిగేది ఏం లేదని చంద్రకళ మనసులో అనుకుంటుంది.
బెదిరిపోయిన రఘురాం
తర్వాత చంద్రకళను విరాట్ ముద్దుపెట్టుకోబోతుంటే రఘురాం వస్తాడు. సారీ చెప్పి నా రూమ్ అనుకుని వచ్చాను అని వెళ్లిపోతాడు. పాపం మావయ్య బెదిరిపోయారు అని చంద్రకళ అంటుంది. రఘురాం సౌండ్ సీక్రెట్ తెలుసుకున్న శాలిని పూర్తిగా మెమోరీ పోయేలా ప్లాన్ చేస్తుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


