నిన్ను కోరి నవంబర్ 26 ఎపిసోడ్:మరో మహిళను భార్య అనుకున్న రఘురాం-పెద్ద గొడవ-క్రాంతి కోసం విరాట్ ఫైట్-స్ప్రేతో శాలిని
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 26 ఎపిసోడ్ లో రఘురాం కోసం ఫ్యామిలీ వెతుకుతుంది. జగదీశ్వరి పేరున్న మరో మహిళను చూసి తన భార్య అనుకుంటాడు రఘురాం. దీంతో పెద్ద గొడవ జరుగుతుంది. క్రాంతిని తోసేసిన వ్యక్తిని విరాట్ కొడతాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ లో రఘురాం గురించి వెతుకుతారు ఫ్యామిలీ మెంబర్స్. మీ ఇంట్లో వాళ్లందరూ టెన్షన్ పడుతుంటే నువ్వేంటీ కూల్ గా ఉన్నావని శ్రుతిని రాజ్ అడుగుతాడు. నాకు టెన్షన్ పడటం తెలియదని శ్రుతి చెప్తుంది. అప్పుడే రఘురాం అక్కడికి రావడంతో శ్రుతి కంగారు పడుతుంది. కానీ వీళ్లు ఎవరో తెలియనట్లు రఘురాం మాట్లాడతాడు.

భార్యగా మరో మహిళ
శాలినిని స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిన క్రాంతి నేను వెళ్లి వెతుకుతానంటాడు. క్రాంతిని మరో సైడ్ పంపిస్తుంది. ఓ వ్యక్తితో స్ప్రేను తెప్పిస్తుంది శాలిని. హై ఫ్లేమబుల్, చిన్న నిప్పు రవ్వ తగిలినా భగ్గున మండుతుందని ఆ వ్యక్తి చెప్తాడు. ఎంత ఆలోచించినా నాకు ఎవరు గుర్తు రావడం లేదని రఘురాం అనుకుంటాడు. జగదీశ్వరి అనే పేరున్న మరో మహిళను తన భార్య అనుకుంటాడు రఘురాం. పరాయి మగాడిని అండి అనడం నాకు నచ్చడం లేదని రఘురాం సీరియస్ అవుతాడు.
విరాట్ ఫైట్
ఇతనెవరో తేడాగా ఉన్నాడని జగదీశ్వరి పరుగులు పెడుతుంది. ఆ మహిళ గొడవ చేస్తుంది. ఆమె భర్త వచ్చి నా భార్య అని చెప్తాడు. రఘురాం ఆవిడ చేయి పట్టుకుని తన వైఫ్ అని అంటాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రఘురాంను ఆ వ్యక్తి తోసేయడంతో క్రాంతి వచ్చి పట్టుకుంటాడు. ఆ వ్యక్తి కాలర్ ను క్రాంతి పట్టుకుంటే అతను కొడతాడు. విరాట్ వచ్చి నా తమ్ముడి మీదే చేయి ఎత్తుతావా? అని ఆ వ్యక్తిని కొడతాడు.
రాజ్ ను చూసిన కామాక్షి
మరి మీ నాన్న చేసింది బాగుందా? నన్ను పట్టుకుని తన భార్య అంటున్నాడని ఆ మహిళ చెప్తుంది. గంట సౌండ్ కు రఘురాంకు మళ్లీ అన్నీ గుర్తొస్తాయి. విరాట్ క్షమించండని అడిగి గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడు. మరోవైపు గుడిలో రాజ్ తో శ్రుతి మాట్లాడటం కామాక్షి చూస్తుంది. ఈ కొత్త కారుకు పూజ చేయిస్తున్నాడు రాజ్. ఆ రోజు మనకు కార్లో లిఫ్ట్ ఇచ్చాడని శ్రుతి గుర్తు చేస్తుంది.
పిల్లలను చూసి గర్వం
సారీ జగదీశ్వరి నా మతిమరపుతో నిన్ను ఇబ్బంది పెడుతున్నా. మన పిల్లలను చూస్తే గర్వంగా ఉంది. నాకు అవమానం జరగ్గానే క్రాంతి తట్టుకోలేక ఎదురు తిరిగాడు. వాడి ఒంటి మీద చేయి పడగానే విరాట్ చూడలేక వాడికి అండగా నిలబడ్డాడు. తండ్రి మీద గౌరవం, అన్నదమ్ముల మధ్య అభిమానం అంటే అలా ఉండాలని రఘురాం చెప్తాడు. రఘురాం, జగదీశ్వరి.. విరాట్, చంద్రకళ దంపతులు హోమం చేస్తారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


