Sign in

నిన్ను కోరి నవంబర్ 22 ఎపిసోడ్: రఘురాం నుంచి శాలినిని కాపాడిన చంద్రకళ- బెడిసికొట్టిన మంచితనం- రాజ్‌పై శ్రుతి ఎంక్వైరీ!

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌లో రఘురాంకు గతం గుర్తుకు వచ్చి శాలిని గురించి అందరికి చెప్పాలనుకుంటాడు. చంద్రకళ వస్తే తన తలపై కొట్టింది శాలని అని చెబుతాడు. కానీ, రఘురాం నిజం చెప్పనివ్వకుండా శాలినిని కాపాడుతుంది చంద్రకళ. దాన్ని చంద్రకళపైనే రివర్స్ ప్లే చేసి ఇరికిస్తుంది శాలిని.

Published on: Nov 22, 2025, 08:40:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అందరు గుడిలో మొక్కు తీర్చుకునేందుకు అంతా ఒప్పుకుంటారు. మరోవైపు రాజ్‌ను ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఎలాగైనా శ్రుతి నుంచి లక్ష రూపాయలు లాగు అని తల్లి చెబుతుంది. ఎలా లాగాలి అని రాజ్ ఆలోచిస్తాడు.

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 22 ఎపిసోడ్‌

శ్రుతిని లక్ష అడిగిన రాజ్

మరోవైపు కొత్త డ్రెస్ కోసం తల్లిని ఐదు వేలు అడిగితే ఐదు వందలు తప్పితే ఎక్కవ లేవని కామాక్షి చెబుతుంది. ఇంతలో శ్రుతికి కాల్ చేసిన రాజ్ లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయమంటాడు. కోటీశ్వరుడివి అయిండి నన్ను అడుగుతావేంటీ అని శ్రుతి అంటుంది. డబ్బంతా ట్రస్ట్ పేరు మీద ఉంది. పర్సనల్ పనులకు తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని కవర్ చేస్తాడు రాజ్.

ఈరోజు మా డ్రైవర్ కూతురు ఎంగేజ్‌మెంట్ ఉంది. అతనికి ఇస్తానని మాటిచ్చాను. ఇవ్వకుంటే మాట పోతుంది. నువ్వు పంపిస్తావని తెలుసు. అర్జంట్‌గా పంపించు అని రాజ్ అంటాడు. సారీ బేబీ ఇవ్వలేను. మా వాళ్లు కూడా క్యాష్ ఇంట్లో పెట్టుకోను. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్సే. నాకు ఏదైనా కొనిపెడతారు కానీ డబ్బులు ఇవ్వరు అని శ్రుతి అంటుంది. సరే వేరే చోట ట్రై చేస్తా అని రాజ్ కాల్ కట్ చేస్తాడు.

లక్ష కోసం రాజ్ నన్ను అడగడటం ఏంటీ చీప్‌గా. రాజ్ నిజంగానే కోటీశ్వరుడా. రాజ్ ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి అని శ్రుతి డౌట్ పడుతుంది. మరోవైపు చంద్రకళకు విరాట్ ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే చంద్ర తప్పించుకుంటుంది. చంద్రను గట్టిగా పట్టేసుకున్న విరాట్ ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్తుంటాడు. ఇంతలో కామాక్షి వచ్చి చూస్తుంది.

రఘురాంకు గుర్తొచ్చిన గతం

కామాక్షి వచ్చి అరుస్తుంది. తలపులు వేసుకుని ఉండమంటుంది. పూజ సామానులో పాలు, పంచదార యాడ్ చేసుకోండని చెప్పడానికి వచ్చానని చెప్పి వెళ్లిపోతుంది కామాక్షి. మరోవైపు రఘురాంకు శాలిని నీళ్లు తీసుకొచ్చి ఇస్తే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వమంటాడు. విరాట్ వచ్చి ఆఫీస్‍కు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో రఘురాంకు శాలిని ట్యాబ్లెట్స్ మార్చింద, తలపై కొట్టింది గుర్తుకు వస్తుంది.

శాలిని వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తే రాక్షసి మళ్లీ వచ్చావా. నా తలపై కొట్టింది నువ్వే. ట్యాబ్లెట్స్ మార్చింది నువ్వే. నీ గురించి అందరికి చెబుతాను అని జగదీశ్వరిని పిలుస్తాడు. ఇంతలో చంద్రకళ వస్తుంది. చంద్రకళకు ఈ రాక్షసే తలపై కొట్టింది. మీ అత్తయ్యకు, క్రాంతికి చెప్పాలి అని రఘురాం అంటాడు. అందరిని పిలవడానికి రఘురాం వెళ్తుంటే మ్యాట్ లాగుతుంది చంద్రకళ.

దాంతో రఘురాం కిందపడపోతూ పక్కనే షోకేజ్ బొమ్మను కింద పడేస్తాడు. దాంతో రఘురాం అంతా మర్చిపోతాడు. అంతా వచ్చి ఏమైందండి అని అడుగుతారు. ఏదో చెప్పాలని వచ్చా. గుర్తుకు రావట్లేదు అని రఘురాం అంటాడు. చంద్రకళ కవర్ చేస్తుంది. రఘురాం వెళ్లిపోతాడు. అసలు ఏమైందని శాలినిని క్రాంతి, కామాక్షి అడుగుతారు.

చంద్రకళను ఇరికించిన శాలిని

చంద్రకళ మావయ్యకు ఏదో నూరిపోసినట్లుంది. దానికి మావయ్య అవునా అంటున్నారు. నేనే తలపై కొట్టినట్లు ఈవిడ నూరుపోస్తున్నట్లుంది అని చంద్రకళను ఇరికిస్తుంది. శాలినిని కాపాడిన చంద్రకళే ఇరుక్కుంటుంది. దాంతో క్రాంతి, శ్యామల చంద్రకళను నిందిస్తారు. ఇంకోసారి చేస్తే బాగుండదు అని వదిన చంద్రకళకు వార్నింగ్ ఇస్తాడు క్రాంతి.

మరోవైపు రాజ్‌కు తెలియకుండా కోటీశ్వరుడా కాదా తెలుసుకోవాలి అని శ్రుతి అనుకుంటుంది. కొత్త కారులో రాజ్ రావడం చూసి డౌట్ పడుతుంది శ్రుతి. మీ ఇంటికి తీసుకెళ్లు అని శ్రుతి అంటే షాక్ అవుతాడు రాజ్.

శ్రుతి ఎంక్వైరీ

ఎలాగైనా మ్యానేజ్ చేయాలి అనుకున్న రాజ్ ముందు కాఫీ షాప్‌కు వెళ్లి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఈలోపు సర్వెంట్స్‌కు కాల్ చేసి ఇల్లు బాగా సర్దమని చెబుతానని తల్లికి కాల్ చేస్తాడు రాజ్. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More