Sign in

నిన్ను కోరి నవంబర్ 20 ఎపిసోడ్: క్రాంతి బ‌ర్త్‌డే-విరాట్ గిఫ్ట్‌ను నేల‌కేసి కొట్టిన త‌మ్ముడు-శాలిని మొస‌లి క‌న్నీళ్లు

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో క్రాంతి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. అందరూ తలో గిఫ్ట్ ఇస్తారు. శ్యామల కవిత చదివి వినిపిస్తుంది. విరాట్ ఇచ్చిన ఫొటో ఫ్రేమ్ ను క్రాంతి నేలకేసి కొడతాడు.

Published on: Nov 20, 2025, 07:48:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 20 ఎపిసోడ్ లో క్రాంతి బర్త్ డే గిఫ్ట్ గా శ్యామల కవిత రాస్తుంది. క్రాంతి కోసం రాసిన కవిత కాబట్టి అతని ముందు చదివితేనే బాగుంటుంది అని కామాక్షి తప్పించుకుంటుంది. మరోవైపు శ్రుతి మామయ్యతో గొడవ గురించి ఇంటికొచ్చి రాజ్ కంగారు పడుతుంటాడు. అప్పుడే శ్రుతి కాల్ చేసి మామయ్యకు మతిమరుపు, అన్నీ మర్చిపోతాడు కంగారు పడకు అని చెప్తుంది.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

క్రాంతి బర్త్ డే

క్రాంతి బర్త్ డే కోసం మొత్తం డెకరేట్ చేస్తారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అత్తయ్య అని క్రాంతి అడుగుతాడు. ఇదంతా చేసింది అత్తయ్య కాదురా మీ వదిన అని చెప్తాడు రఘురాం. క్రాంతి కేక్ కట్ చేస్తాడు. అన్నయ్యకు కేక్ పెట్టలేదు ఏంట్రా అని రఘురాం అడుగుతాడు. దూరమయ్యాడు కదా అని క్రాంతి అనగానే అందరూ టెన్షన్ పడతారు. మళ్లీ క్రాంతి, విరాట్ కవర్ చేస్తారు.

శ్యామల కవిత

కొడుకు మెడలో రఘురాం చైన్ వేస్తాడు. శ్రుతి ఏమో పర్ ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఇంపోర్టెడ్ బాటిల్ అని బిల్డప్ ఇస్తుంది శ్రుతి. కామాక్షి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ బాగుందంటాడు క్రాంతి. నా ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్ని కలగలిపి నీ కోసం ఓ కవిత రాశానని శ్యామల చెప్తుంది. అల్లుడా.. ఓ చిన్న మేనల్లుడా అంటూ కవిత చదువుతుంది శ్యామల. అందరూ కవిత విని నవ్వేస్తారు.

విరాట్ గిఫ్ట్

విరాట్, చంద్రకళ కలిసి ఫొటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇస్తారు. అందులో విరాట్, క్రాంతి ఫొటో ఉంటుంది. తండ్రి చెప్పడంతో క్రాంతి ఓపెన్ చేస్తాడు. క్రాంతి నచ్చిందా? అని చంద్ర అడుగుతుంది. అంత మంచి గిఫ్ట్ నచ్చకుండా ఎలా ఉంటుంది? అందరికంటే అదే మంచి గిఫ్ట్ అని రఘురాం అంటాడు. చిరాకు పడ్డా, గొడవలు పడ్డా చివరకు కలిసే ఉంటామని, అదే అన్నదమ్ముల బంధమని విరాట్ అంటాడు. రఘురాంను రెస్ట్ తీసుకోమ్మని లోపలికి పంపిస్తుంది జగదీశ్వరి.

ఫ్రేమ్ ముక్కలు

క్రాంతి నువ్వు ఇలాంటి బర్త్ డే మళ్లీ చేసుకోవద్దు. మన మధ్య ఏ చిన్న గ్యాప్ లేకుండా నెక్ట్స్ బర్త్ డే చేసుకోవాలని విరాట్ అంటాడు. అప్పుడు కోపంతో ఆ ఫొటో ఫ్రేమ్ ను నేలకేసి విసిరి కొడతాడు క్రాంతి. హే.. ఆపుతావా నీ నటన. ఇది నీ మనస్ఫూర్తిగా ఇచ్చింది కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. మీ ఇద్దరి మనసుల్లో ఎంత విషం ఉందో నాకు బాగా అర్థమైంది. బర్త్ డే రోజు సంతోషంగా ఉండొద్దనే కదా శాలినిని టార్గెట్ చేస్తున్నారని క్రాంతి సీరియస్ అవుతాడు.

అన్నింటికి నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను క్రాంతిని చాలా కంట్రోల్ చేశా. కానీ నా వల్ల కావడం లేదని ఏడుస్తూ డ్రామా ఆడుతుంది శాలిని. మామయ్యను తీసుకొచ్చి గొడవ చూసేలా చేస్తానని శాలిని అనుకుంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More