నిన్ను కోరి నవంబర్ 13 ఎపిసోడ్: మామ‌య్య‌ను చంపేందుకు శాలిని ప్లాన్‌- కాపాడిన చంద్రకే షాకిచ్చిన ర‌ఘురాం

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో రఘురాంను చంపేందుకు శాలిని ప్లాన్ వేస్తుంది. గతం గుర్తుకురావాలంటే పైనుంచి దూకాలని మామయ్యకు చెప్తుంది. కానీ రఘురాం ను చంద్ర కాపాడుతుంది. అయితే చంద్రనే దూకమని చెప్పిందని మామయ్య షాకిస్తాడు.

Published on: Nov 13, 2025 7:28 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 13 ఎపిసోడ్ లో వంటింట్లో మైదా పిండి అందుకోవడానికి శ్యామల, కామాక్షి తిప్పలు పడుతుంటే చంద్రకళ నవ్వుతుంది. కుర్చీ ఎక్కకుండా డబ్బాను తీయమని చంద్రకు చెప్తుంది శ్యామల. అప్పుడు విరాట్ ను పిలుస్తుంది. విరాట్ ఎత్తుకోవడంతో డబ్బాను తీస్తుంది చంద్ర.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

రఘురాంను చంపేందుకు

చెట్లకు నీళ్లు పడుతున్న రఘురాం దగ్గరకు వస్తుంది శాలిని. ఏం గుర్తుచేసుకున్నా లాభం ఉండదు. ఒక సంఘటన వల్ల గతం మర్చిపోయిన వాళ్లకు మెడికల్ చికిత్స, గుర్తు చేసుకోవడం వల్ల గుర్తుకు రాదు. మళ్లీ తలపై దెబ్బ తగిలితేనే గుర్తుకొస్తుందని శాలిని చెప్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ చెబుదామని రఘురాం అంటే, ఇంట్లో వాళ్లకు తెలుసు కానీ ఫిజికల్ గా హర్ట్ చేయడం ఎవరికి ఇష్టం లేదని శాలిని అబద్ధాలు చెప్తుంది.

బాల్కనీలోనుంచి కిందకు

అయితే నువ్వు నా తలపై కొట్టు అని రఘురాం అడుగుతాడు. నేను అలా చేయలేను. అనుకోకుండా మీరు కింద పడటం వల్ల తలపై దెబ్బ తగిలితే ప్రయోజనం ఉంటుందని శాలిని చెప్తుంది. రఘురాం బాల్కనీలోనుంచి కిందకు దూకడానికి వెళ్తాడు. బురద అంటుకున్న అడుగులు చూసి చంద్రకళ పైకి వెళ్తుంది. రఘురాంను ఆపుతుంది. కిందకు తీసుకెళ్తుంది.

చంద్రకు షాక్

నా తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయా కదా. గుర్తుకురావాలంటే మళ్లీ దెబ్బ తగలాలి. అందుకే పైనుంచి దూకేద్దామని వెళ్లానని రఘురాం చెప్తాడు. మీకు అలా చెప్పింది ఎవరని క్రాంతి ప్రశ్నిస్తాడు. ఇదిగో ఈ చంద్రకళ అని రఘురాం షాకిస్తాడు. బురద అడుగులు చూసి వెళ్లి మామయ్యను కిందకు తీసుకొచ్చానని చంద్ర చెప్తుంది. విషయం తెలియకుండా డిస్కస్ చేయడం అనవసరం అని జగదీశ్వరి అంటుంది.

శాలిని కంగారు

కిందకు దూకమని చెప్పింది ఎవరో గుర్తుకొచ్చిందని రఘురాం అనేసరికి శాలిని కంగారూ పడుతుంది. కానీ రఘురాం మళ్లీ మర్చిపోతాడు. జగదీశ్వరి చెప్పిందని అంటాడు. నాన్నకు స్ట్రెస్ పెట్టొద్దని అమ్మతో చెప్తాడు విరాట్. నువ్వు అనుకున్నది జరగలేదని చిరాకుగా ఉందా శాలిని అని అడుగుతుంది చంద్ర. మామయ్య పైనుంచి దూకడానికి వెళ్లడానికి కారణం నువ్వే అని నాకు తెలుసని అంటుంది.

ఒక్క రోజు చాలు

ఏ ప్రూఫ్ తో చెప్తున్నావ్? మామయ్య నీ పేరు చెప్పారు అంటే నువ్వే చేసి ఆ నింద నా మీద వేయాలని చూస్తున్నావా? అని శాలిని అంటుంది. శాలిని ఎన్ని తప్పులు చేస్తున్నా తప్పించుకుంటున్నావంటే అది నీ తెలివి తేటల వల్ల కాదు. ఈ కుటుంబంతో కలిసి ఉండాలనే బంధం వల్ల అని తెలుసుకో. నేను కాన్సంట్రేషన్ చేశానంటే ఒక్క రోజు చాలు నీ తప్పులు బయట పెట్టడానికి అని చంద్ర అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/నిన్ను కోరి నవంబర్ 13 ఎపిసోడ్: మామ‌య్య‌ను చంపేందుకు శాలిని ప్లాన్‌- కాపాడిన చంద్రకే షాకిచ్చిన ర‌ఘురాం
News/Entertainment/నిన్ను కోరి నవంబర్ 13 ఎపిసోడ్: మామ‌య్య‌ను చంపేందుకు శాలిని ప్లాన్‌- కాపాడిన చంద్రకే షాకిచ్చిన ర‌ఘురాం