నిన్ను కోరి నవంబర్ 10 ఎపిసోడ్: రొమాంటిక్‌గా కాఫీ తాగిన చంద్ర, విరాట్- పనిమనిషిని జగదీశ్వరి అనుకున్న రఘురాం
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో విరాట్, చంద్రకళ రొమాంటిక్ గా కాఫీ తాగుతారు. పనిమనిషిని జగదీశ్వరి అనుకుంటాడు రఘురాం. దీంతో జగదీశ్వరి బాధ పడుతుంది. అది చూసి రఘురాం సారీ చెప్తాడు. భార్యతో ప్రేమగా మాట్లాడతాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 10 ఎపిసోడ్ లో రఘురాం కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు. అప్పుడే వచ్చిన రఘురాం వాకింగ్ కు వెళ్లానని చెప్తాడు. తిరిగి వద్దామంటే ఇల్లు గుర్తుకు రాలేదని అంటాడు రఘురాం. మరోసారి ఒంటరిగా వెళ్లొద్దని రఘురాంను కోరతారు.

చంద్రతో రొమాంటిక్ కాఫీ
కాఫీ తీసుకురమ్మని చంద్రకళకు చెప్పిన విరాట్, ఆమె గదిలోకి రాగానే వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటాడు. పొద్దున్నే సరసాలు ఏంటీ? అని చంద్ర అడుగుతుంది. ఇదే కాఫీని షేర్ చేసుకుని తాగుదామంటాడు విరాట్. సాసర్ లో కాఫీ పోసుకుని విరాట్, చంద్ర రొమాంటిక్ గా తాగుతారు. శ్రుతి అదంతా చూసి నా బేబీతో కలిసి నేను కూడా ట్రై చేయాలని అనుకుంటుంది.
జగదీశ్వరి కన్నీళ్లు
పని మనిషిని పట్టుకుని జగదీశ్వరి అని మాట్లాడతాడు రఘురాం. అందరూ వచ్చి అది మన ఇంటి పని మనిషి అని చెప్తారు. తనను చూసి నువ్వు అనుకున్న జగదీశ్వరి అని అంటాడు రఘురాం. దీంతో జగదీశ్వరి బాధ పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని శ్యామలతో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జగదీశ్వరి.
నేను ఆయన భార్యనని పదేపదే ఎలా చెప్పాలి? ఎలా గుర్తు చేయాలని జగదీశ్వరి బాధపడుతుంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, బాధపడొద్దని శ్యామల ఓదార్చుతుంది. మానసిక పరిస్థితి కారణంగా అన్నయ్య ఇలా చేస్తున్నాడు. మనమే అర్థం చేసుకోవాలి. అన్నయ్య త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని శ్యామల చెప్తుంది. రఘురాం ఇదంతా వింటాడు.
సారీ చెప్పిన రఘురాం
జగదీశ్వరి గదిలోకి రాగానే నీతో ఒకటి చెప్పాలని అంటాడు రఘురాం. కానీ ఓ వస్తువు కింద పడగానే అంతా మర్చిపోతాడు. గుర్తుకు రావడం లేదంటాడు. మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది. సారీ జగదీశ్వరి. పనిమనిషిని చూసి నువ్వని మాట్లాడినందుకు నీకు బాధ కలిగింది. ఇందులో తప్పు లేదు. నేను అలా పొరపాటు పడటమే తప్పు. అంతా తెలుస్తున్నట్లే ఉంది. కానీ అంతలోనే అంతా బ్లాక్ అవుతుంది. డాక్టర్ నీకు ఏమైనా చెప్పాడా? అని రఘురాం అడుగుతాడు.
భరిస్తావు కదా
మీకు తలకు దెబ్బ తగిలింది కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతారని డాక్టర్ చెప్పాడని జగదీశ్వరి చెప్తుంది. మరి నేను నిన్ను పూర్తిగా మర్చిపోతానని ఎందుకు బాధపడ్డావు? నువ్వే నన్ను పట్టించుకోవాలి జగదీశ్వరి. ఇద్దరం కలిసి కష్టనష్టాలు భరిస్తూ ఇక్కడి వరకూ వచ్చాం. ఇప్పుడు నన్ను భరిస్తావు కదా అని అడుగుతాడు రఘురాం.
మనసు ఇలా
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని జగదీశ్వరి అంటుంది. నా బలం, ధైర్యం, సంతోషం అన్నీ నువ్వే జగదీశ్వరి. నువ్వు నా లైఫ్ లో ఉండటం నా అదృష్టం అని రఘురాం అంటాడు. పడుచు పిల్లాడిలా బాగానే డైలాగ్ లు చెప్తున్నారు. మీరు తాత కాబోతున్నారని జగదీశ్వరి గుర్తు చేస్తుంది. వయసు పెరిగింది కానీ మనసు పడుచుతనం మర్చిపోలేదని రఘురాం చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


