నిన్ను కోరి నవంబర్ 8 ఎపిసోడ్: ఫస్ట్ నైట్‌కు అడ్డు చెప్పిన చంద్రకళ- కనిపించకుండా పోయిన రఘురాం- శాలినిని గెంటేసిన క్రాంతి

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌లో చంద్రకళతో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తాడు విరాట్. కానీ, కాపురం చేసేందుకు అడ్డు చెబుతుంది చంద్రకళ. రఘురాం ఇంట్లో కనిపించకుండా పోతాడు. దాంతో కామాక్షి, క్రాంతి చంద్రకళను నిందిస్తారు. శాలిని నిజం బయటపడినప్పుడు క్రాంతి ఎలా రియాక్ట్ అవుతాడో చెబుతుంది చంద్రకళ.

Published on: Nov 8, 2025, 08:27:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మల్లెపూలు, స్వీట్స్ తీసుకొస్తాడు విరాట్. శ్రుతి వచ్చి స్వీట్స్ ఇవ్వమంటే విరాట్ ఇవ్వడు. ఇవి నీకోసం కాదు మాకోసం అని విరాట్ అంటాడు. ఆ మాటలు విన్న కామాక్షి వచ్చి శ్రుతిని తీసుకెళ్లిపోతుంది. రాత్రి తొమ్మిదిన్నరకు మంచి ముహుర్తం ఉందట. ఫ్రెషప్ అయి రూమ్‌కు రా అని విరాట్ అంటాడు.

నిన్ను కోరి సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 8 ఎపిసోడ్‌

క్రాంతి ఏం చేస్తాడో గుర్తు చేసుకో

అది విన్న శాలిని చిరాకుగా వెళ్లిపోతుంది. అది చూసిన చంద్రకళ శాలిని మాట్లాడుతుంది. పూర్తి నిజం బయటపడినప్పుడు నీ జీవితం నట్టేట మునుగుతుంది. నిజం తెలిస్తే క్రాంతి ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించు. రెండోసారి మోసం చేసినందుకు, తండ్రిని చంపాలని చూసినందుకు ఏం చేస్తాడో గుర్తు చేసుకో అని చంద్రకళ అంటుంది.

దాంతో తనను క్రాంతి మెడ పట్టి గెంటేసినట్లు, ఈ ఇంటి ముఖం మరోసారి చూస్తే కాటికి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్లు ఊహించుకుంటుంది శాలిని. దాంతో దడుసుకుంటుంది. అందరి ముందు నిజం ఒప్పుకో అని చంద్ర చెబితే దానికన్నా ప్రాణం వదలడం బెటర్ అని శాలిని అంటుంది.

నిజం ఒప్పుకుంటే నీ కడుపులో బిడ్డ పుట్టాక అయినా అంతా క్షమిస్తారు. లేకుంటే నీ బతుకు దారుణం అయిపోతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది చంద్ర. నా నిర్ణయం మారదు. నేను ఎలాగైనా బయటపడతాను అని శాలిని అనుకుంటుంది. మరోవైపు చంద్ర అందంగా రెడీ అయి శోభనానికి వస్తుంది. రూమంతా రొమాంటిక్‌గా డెకరేట్ చేసి ఉండటం చూసి మురిసిపోతుంది.

శోభనానికి అడ్డు చెప్పిన చంద్ర

విరాట్‌ను హగ్ చేసుకుంటుంది చంద్రకళ. చంద్ర పడిన కష్టాలన్నీ నాకోసమే కదా అని థ్యాంక్స్ చెబుతాడు విరాట్. ఆరోజు ద్వేషంతో తాళి కట్టడం వల్లే నువ్వు దగ్గరయ్యావ్. ఇక నీకు ఏ కష్టం రానివ్వను. ఎవ్వరు ఏమనుకున్నా నిన్ను పూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను అని చంద్ర మీదకు వెళ్తాడు. కానీ, చంద్ర ఆపుతుంది.

ఇది సరైన సమయం కాదు. అత్తయ్య, మావయ్య పూర్తిగా నన్ను కోడలిగా అంగీకరించిన రోజే పూర్తి బంధంతో ఒక్కటవుదాం. నన్ను క్షమించు బావ అని చంద్రకళ అంటుంది. మరోసారి నా మనసు గెలిచావ్. ఈ ట్విస్ట్ ఏదో ఈ అరెంజ్‌మెంట్స్ చేయకముందే ఇచ్చుంటే బాగుండు అని విరాట్ పడుకుండిపోతాడు.

మరోవైపు శాలిని దగ్గరికి వచ్చిన క్రాంతి నాన్న మతిమరుపు వల్ల చంద్ర వదిన తప్పించుకుందని ఆలోచిస్తున్నావ్ కదా. కానీ, ఏదో ఒకరోజు పాపం పండుతుంది. అప్పుడు నేనేంటో చూపిస్తా. అప్పటివరకు స్ట్రెస్ ఫీల్ అవ్వకు. ప్రశాంతంగా పడుకో అని వెళ్లిపోతాడు క్రాంతి. నిజం బయటపడిన ఎలా తప్పించుకోవాలనే ఐడియా తడితే గానీ ప్రశాంతంగా ఉండలేను అని శాలిని అనుకుంటుంది.

కనిపించకుండా పోయిన రఘురాం

విరాట్ అటు పడుకుని ఉంటే కాపురం వద్దన్నాను కానీ పూర్తిగా దూరం పెడతాను అనలేదుగా. కిస్సింగ్‌లు హగ్గులు ఓకే బావ అని చంద్ర అంటుంది. దాంతో చంద్ర నడుముపై చేయి వేసి రొమాంటిక్‌గా చూస్తాడు విరాట్. మరుసటి రోజు ఉదయం చంద్ర ముగ్గు వేస్తుంది. అది చూసి మురిసిపోతాడు విరాట్. రఘురారం రూమ్‌లో కనిపించడు. జగదీశ్వరి కంగారు పడుతూ వచ్చి ఇంట్లో చెబుతుంది.

అంతా రఘురాం కోసం వెతుకుతుంటారు. సన్ రైజ్‌కు తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చావా అని చంద్రను నిందిస్తుంది కామాక్షి. వదిలేసిందో మాయం చేసి వచ్చిందో. నిజం పూర్తిగా బయటపడొద్దని మాయం చేసి వచ్చినట్లుందని క్రాంతి అంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More