నిన్ను కోరి అక్టోబర్ 28 ఎపిసోడ్: పూర్తిగా శాలిని మాయలో క్రాంతి-చంద్రకు షాక్-భార్యకు సారీ చెప్పిన విరాట్-మళ్లీ గొడవ
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో చంద్రకళ తప్పు చేసిందని నమ్ముతాడు క్రాంతి. శాలిని మాయలో పూర్తిగా పడిపోయి చంద్ర, విరాట్ ను నానా మాటలంటాడు. మరోసారి క్రాంతి, విరాట్ కు గొడవ జరుగుతుంది. జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో మామయ్యను కొట్టింది శాలినియే అని క్రాంతికి చెప్తుంది చంద్రకళ. నువ్వు అదే మాట అంటున్నావా వదినా? అని క్రాంతి అడుగుతాడు. నువ్వు విడాకులు ఇస్తానంటే ఓ ఛాన్స్ ఇవ్వమంది నేనే. ఇప్పుడు నేను చెప్పేది నమ్మవా? అని అడుగుతుంది చంద్ర. కానీ క్రాంతి మాత్రం భార్యకు సపోర్ట్ చేస్తాడు.

అసలు రూపాలు
వద్దు వదిన, ఇంకేం మాట్లాడొద్దు. ఇంటి నుంచి వెళ్లకుండా ఉండేందుకే నింద వేస్తున్నావని అనుకున్నా. కానీ తప్పు చేసి తప్పించుకోవాలని అనుకుంటున్నావని చంద్రకళతో క్రాంతి అంటాడు. నేను ఆ పని ఎలా చేశానని నమ్ముతున్నావని చంద్ర అంటుంది. నమ్మడమే నా తప్పు. ఇప్పుడు ఒక్కొక్కరి అసలు రూపాలు తెలుస్తున్నాయని క్రాంతి అంటాడు.
శాలిని కరెక్ట్
తేజును సేవ్ చేయడానికి ఫారెన్ డాక్టర్లను కన్సల్ట్ చేస్తానని డాక్టర్ తో అర్జున్ అంటాడు. కానీ అప్పటికే తన ఫ్రెండ్ తో మాట్లాడానని డాక్టర్ చెప్తుంది. తేజు ఏమో అర్జున్ తోనే ఉంటానని చెప్తుంది. మరోవైపు క్రాంతి ముందు చంద్రను బ్యాడ్ చేశానని శాలిని అనుకుంటుంది. ప్లేట్ ను తీసుకెళ్లి క్రాంతిని తినమంటుంది శాలిని. అన్నయ్య పదేపదే నిందిస్తుందంటే తట్టుకోలేకపోతున్నా. వదిన మంచితనమంతా ముసుగని అర్థమైంది. నువ్వే కరెక్ట్ శాలిని అని క్రాంతి అంటాడు.
నువ్వు నన్ను నమ్మావు. నువ్వు చంద్ర మాయలో ఉండి నన్ను అనుమానించి ఉంటే ఏమైపోయేదాన్నో. నువ్వు నమ్మితే చాలు అని శాలిని కపట మాటలు చెప్తుంది. ఫ్యూచర్ లో ఇద్దరం ముగ్గురం కాబోతున్నామనే ఫీలింగ్ ను ఎంజాయ్ చేద్దామని శాలిని అంటుంది. ఇద్దరు ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు.
విరాట్ సారీ
విరాట్ ప్లేట్ తీసుకుని చంద్ర దగ్గరకు వెళ్తాడు. సారీ చంద్ర, నేను అపార్థం చేసుకోవడం కారణంగానే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని విరాట్ అంటాడు. నువ్వు పది సార్లు తిట్టినా ఒక్కసారి ప్రేమగా మాట్లాడితే అన్ని మర్చిపోతానని చంద్ర అంటుంది. మామయ్య ఈ నాలుగు రోజుల్లోనే మామూలు మనిషిగా మారతాడని నమ్మకంతో చెప్తుంది. గుడిలో స్వామిజీని కలిసిన సంగతి చెప్తుంది చంద్ర. క్రాంతిని శాలిని మార్చేసిందని విరాట్ అంటాడు. ఏం జరిగినా శాలిని, క్రాంతి బ్రేకప్ కావొద్దని చంద్ర చెప్తుంది. చంద్ర, విరాట్ అన్నం తినిపించుకుంటారు.
శాలిని దోషి
రఘురాం కు సిరప్ వేస్తున్న శాలినిని ఆపుతాడు విరాట్. చంద్ర పాలు తెస్తేనే అనుమానపడ్డారు. మరి శాలిని మెడిసిన్ వేస్తే ఎందుకు డౌట్ రాకూడదు. దోషి అని తెలిసిన శాలినిపై అనుమానం ఉందని విరాట్ అంటాడు. నాన్నను నువ్వే చూసుకుంటానని చెప్పావు కదా అమ్మ. నీకు కుదరకపోతే నాకు చెప్పు, క్రాంతికి చెప్పు. అత్తయ్యలకు చెప్పు. మీకు నమ్మకం లేని చంద్ర కానీ, నాకు నమ్మకం లేని శాలిని కానీ నాన్న విషయంలో జోక్యం చేసుకోకూడదని విరాట్ అంటాడు.
మామయ్య ప్రాణం తీయాలని ఎలా అనుకుంటానని శాలిని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మళ్లీ విరాట్, క్రాంతి గొడవ పడతారు. విరాట్ ను చంద్ర ఆపుతుంది. చంద్రను శ్యామల, కామాక్షి మాటలంటారు. మనసులో కుట్రలు పెట్టుకుని పూజలు చేస్తే ఏం లాభమని క్రాంతి అనగానే విరాట్ చేయి ఎత్తుతాడు. మేం ఇప్పుడే వెళ్లిపోతామని క్రాంతి అంటే జగదీశ్వరి సీరియస్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.
వాళ్లు వాళ్ల భార్యల గురించే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ అర్థం కావడం లేదని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












